నెపో మాఫియా అన్ని అవార్డులను కొల్లగొడుతోంది – కంగనా

nepo mafia snatching all awards

కొన్ని నెలల క్రితం ఫిల్మ్ బ్యాగ్రౌండ్ ఉన్న నటీనటులకే బాలీవుడ్ ప్రాధాన్యం ఇస్తుందని అప్పట్లో దానిపై కొంత మంది స్టార్ నటీనటులు నెపోటిజం పై విమర్శలు చేశారు. అందులో ప్రధానంగా బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కంగనా రనౌత్ కూడా ఉన్నారు. కాగా తాజాగా మరోసారి నెపోటిజం పై అనే అంశం మళ్ళీ తెరపైకూ వచ్చింది. కొంత కాలం క్రితం యంగ్ హీరో సుశాంత్ రాజ్ పుత్ ఆత్మహత్యకు పాల్పడ్డ అందరికీ తెలిసిందే దానికి కారణం ఆయనకు అవకాశాలు లేక మత్తుకు బానిసై సూసైడ్ చేసుకున్నారనై ప్రచారం జరిగినది. నెపోటిజం వల్లే అతనకు అవకాశాలు లేక అతడు ఆత్మహత్యకు పాల్పడ్డాడని  అసమయాలో బాగా ప్రచారం జరిగింది.  ఆ సమయంలో కూడా కంగనా నెపోటిజం పై తనదైన శైలిలో విమర్శలు చేశారు.

కాగా ప్రస్తుతం మరోసారి ఈ అంశం తెరపైకి తెచ్చారు కంగనా. దానికి కారణం బాలీవుడ్ లో మొన్న జరిగిన దాదాసాహెబ్ ఫాల్కే అవార్డుల అందజేత కార్యక్రమం.  ఆ అవార్డులు రణ్బీర్ కపూర్, అలియ బట్ లను వరించింది. రణ్ బీర్ కపూర్ బ్రహ్మాస్త్ర లో నటనకు గాను ఉత్తమ యాక్టర్ ఎంపిక కాగా ఉత్తమ గంగుబాయి కథియవాడీలో అలియాభట్ నటనకు బెస్ట్ ఫిమేల్ యాక్టర్ అవార్డుకు ఎంపిక అయ్యారు. కాగా ఒకేసారి రణ్బీర్ దంపతులకు ఉత్తమ నటీనటులుగా దాదాసాహెబ్ పాల్కే అవార్డులు అందుకోవడంతో దాదాసాహెబ్ ఫాల్కే అవార్డుల ఎంపిక‌లో నిర్వాహకులు పక్షపాతంతో వ్యవహరించారని కంగనా రనౌత్ తీవ్ర ట్విటర్ వేదికగా  విమర్శలు చేశారు.

ట్విటర్ వేదికగా “అవార్డుల సీజన్ వచ్చేసింది.. నెపో మాఫియా మళ్లీ రంగంలోకి దిగి అర్హులైన ప్రతిభావంతుల నుంచి అన్ని అవార్డులను కొల్లగొడుతోంది. అగ్నిపర్వత కళాత్మక ప్రతిభను ప్రదర్శించి 2022 సొంతం చేసుకున్న కొంతమంది జాబితా ఇక్కడ ఉంది. ఉత్తమ నటుడు – రిషబ్ శెట్టి (కాంతారా), ఉత్తమ నటి- మృణాల్ ఠాకూర్ (సీతా రామం), ఉత్తమ సహాయ నటుడు- అనుపమ్ ఖేర్ (కాశ్మీర్ ఫైల్స్) ఉత్తమ సహాయ నటి- టబు (దృశ్యమాన్/భూల్ భులైయా) బాలీవుడ్ అవార్డులు పెద్ద బూటకం… నా షెడ్యూల్ నుండి నాకు కొంత సమయం లభించినప్పుడు, నేను అర్హులుగా భావించే వారందరి జాబితాను తయారు చేస్తాను … ధన్యవాదాలు” అంటూ తనదైన శైలిలో మండిపడ్డారు కంగనా. ఈ అవార్డు లలో ఇక ఫిలిం ఆఫ్ ది ఇయర్ గా టాలీవుడ్ మూవీ ఆర్ఆర్ఆర్ ఎంపిక కాగా, కాంతారా సినిమాలో చేసిన నటనకు గానూ రిషబ్ శెట్టికి మోస్ట్ ప్రామిసింగ్ యాక్టర్ అవార్డు అందుకున్నారు.

ఇది కూడా చదవండి: 

 

Leave a Reply

Dimple Hayathi In Shankars Movie keerthi suresh