తొలి సారిగా వారాహి పై జనసేనాని

Jana sena 10th Formation

Jana sena  10th Formation: తొలి సారిగా వారాహి పై జనసేనాని

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు ప్రస్తుతం  ఎన్నికల షెడ్యూలలో బిజిబిజీ గా  కనిపిస్తున్నారు. అసలు  ఇప్పటికే అటు కాపు, ఇటు బీసీ నేతలతో పవన్ వరుస సమావేశాలు నిర్వహించిన పవన్ నేడు జనసేన 10వ ఆవిర్భావ దినోత్సవం సందర్బంగా ‘ఛలో మచిలీపట్నం’ పేరుతో భారీ బహిరంగ సభ నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో ఏపీ ప్రజలకు పవన్ కీలక సందేశం ఇవ్వనున్నారు.

“రాజకీయాల్లో దశాబ్దానికి పైగా అనుభవం సంపాదించుకున్నాను. ఎన్నో ఒడిదొడుకులను తట్టుకొని నిలబడ్డాను. రెండు చోట్ల ఓడిపోయినా ఆగిపోలేదు. ప్రజా సమస్యలపై నా వంతుగా స్పందిస్తున్నానని” పవన్ పేర్కొన్నారు. “తాము అధికారంలో లేకపోయినా కూడా ఆత్మహత్యలు చేసుకున్న కౌలు రైతులకు అండగా నిలబడ్డాం. ఈ ఒక్కసారి నన్ను నమ్మండి నేను నిలబెట్టే అభ్యర్థిలో నన్ను చూసి గెలిపించండని” పవన్ కళ్యాణ్ ప్రజలకు సందేశం ఇచ్చారు. కాగా జనసేన 10వ ఆవిర్భావ సభ సందర్బంగా జనసైనికులు ఈ వ్యాఖ్యలను సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. కాగా ఈ సభలో పాల్గొనేందుకు జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ మధ్యాహ్నం 2 గంటలకు విజయవాడలోని ఆటోనగర్ ప్రాంతం నుంచి పవన్ వారాహిలో బయల్దేరారు. అయితే   తొలిసా రీగా వారాహి వాహనంలో విజయవాడ ఆటోనగర్‌ నుంచి మచిలీపట్నం బయలుదేరారు . విజయవాడ నోవాటెల్ హోటల్ నుంచి పవన్ కళ్యాణ్ మచిలీపట్నం బయలు దేరారు.  బెంజ్ సర్కిల్ మీదుగా ఆటోనగర్ వారాహి వద్దకు పవన్, నాదెండ్ల మనోహర్ చేరుకోనున్నారు. సభా వేదికకు శ్రీ పొట్టి శ్రీరాములు పుణ్య వేదికగా నామకరణం చేశారు.  సాయంత్రం 5 గంటలకు  మచిలీపట్నం సభకు చేరతారు. అప్పటి నుంచి రాత్రి 9 వరకు సభజరగనున్నది . పవన్‌ కళ్యాణ్ రాక కోసం విజయవాడ – బందరు మధ్య భారీ స్వాగత ఏర్పాట్లు చేశారు.

అలాగే  జనసేన కార్యకర్తల దారులన్నీఛలో మచిలీపట్నంవైపే.. వచ్చే ఏడాదే అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో జనసేనాని పవన్ కల్యాణ్ ఇవాళ ఏం మాట్లాడతారు..? సైనికులకు ఎలాంటి సందేశమిస్తారన్న విషయం ప్రస్తుతం పొలిటికల్ వర్గాల్లో ఆసక్తి నెలకొంది.

ఇది కూడా చదవండి :

Leave a Reply

Dimple Hayathi In Shankars Movie keerthi suresh