పట్టాలు తప్పిన విశాఖ -హైదరాబాద్ గోదావరి ఎక్స్‌ప్రెస్

Godvari Express Derailment Many Trains are cancelled

పట్టాలు తప్పిన విశాఖ -హైదరాబాద్ గోదావరి ఎక్స్‌ప్రెస్

పట్టాలు తప్పిన  విశాఖ -హైదరాబాద్ గోదావరి ఎక్స్‌ప్రెస్ పట్టాలు తప్పిన విశాఖ -హైదరాబాద్ గోదావరి ఎక్స్‌ప్రెస్విశాఖ -హైదరాబాద్ గోదావరి ఎక్స్‌ప్రెస్ పట్టాలు తప్పింది. ప్రయాణీకులు సురక్షితంగా ఉన్నారు. ఆరు బోగీలు పట్టాలు తప్పడంతో ట్రాక్ దెబ్బతిన్నది. రైలులో ప్రయాణిస్తున్న వారిని ఇతర మార్గాల ద్వారా హైదరాబాద్ కు చేర్చారు. ఈ ప్రమాదంలో ట్రాక్ దెబ్బ తినటం మినమా. అయితే  ఎవరికీ ఎటువంటి గాయాలు కాలేదని దక్షిణ మధ్య రైల్వే అధికారులు వెల్లడించారు. అదే సమయంలో ట్రాక్ పునరుద్దరణ చర్యలు ప్రారంభించారు. ఆరు కోచ్ లు పట్టాలు తప్పినట్లు అధికారులు ప్రకటించారు. దీంతో.ఆ మార్గంలో వచ్చే పలు రైళ్ల రాకపోకలపైన ప్రభావం పడింది. పలు రైళ్లను ఈ రోజు, రేపు రద్దు చేసారు. మరి కొన్నింటిని దారి మళ్లించారు. పలు రైళ్లు ఆలస్యంగా నడుస్తున్నాయి.

అలాగే ఘట్ కేసర్ వద్ద గోదావరి ఎక్స్‌ప్రెస్‌లోని ఎస్‌ -1, ఎస్‌ -2, ఎస్‌ – 3, ఎస్ – 4తో పాటు రెండు జనరల్ బోగీలు పట్టాలు తప్పాయి. అయితే, ఎవరికీ ఎటువంటి ప్రమాదం జరగకపోవటంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు. రైల్వే సిబ్బంది అక్కడకు చేరుకుని మరమ్మత్తులు చేపట్టారు. ట్రాక్‌ రిపేర్ ప్రక్రియను కొనసాగిస్తున్నారు. కాగా. ట్రాక్ దెబ్బ తినడంతో ఆ మార్గంలో రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. పలు రైళ్లు ఆలస్యంగా నడుస్తున్నాయి. గోదావరి ఎక్స్‌ప్రెస్ కు ఎల్‌హెచ్‌సీ సాంకేతికత ఆధారంగా చేసిన బోగీలు కావటంతో పెను ప్రమాదం తప్పింది. పట్టాలు తప్పిన ఆరు భోగిల్లో నాలుగు రిజర్వేషన్ బోగీలు ఉన్నాయి. ప్రయాణికుల కోసం అధికారులు ప్రత్యేక హెల్ప్‌లైన్‌ను ఏర్పాటు చేశారు. పట్టాలు తప్పిన ఆరు బోగీలను తిరిగి పట్టాల మీదకు తీసుకొచ్చారు.

ఘటనా స్థలికి రైల్వే ఉన్నతాధికారులు చేరుకున్నారు. ఈ ప్రమాదం కారణంగా సికింద్రాబాద్ కు రావాల్సిన – వెళ్లాల్సిన పలు రైళ్ల రాకపోకల్లో అంతరాయం ఏర్పడింది. సికింద్రాబాద్ రావాల్సిన హౌరా ఎక్స్ ప్రెస్, గుంటూరు నుంచి చేరుకోవాల్సిన పల్నాడు ఎక్స్ ప్రెస్ నల్గొండలో నిలిచిపోయాయి. ఏడు రైళ్లను ఈ రోజు రద్దు చేసారు. అందులో పలు ప్యాసింజర్ సర్వీసులు ఉన్నాయి. ట్రాక్ పునరుద్దరణ పనులు ఈ రాత్రికి పూర్తవుతాయని అధికారులు చెబుతున్నారు. పలు ఎక్స్ ప్రెస్ రైళ్లు ఆలస్యంగా నడుస్తున్నాయి. మరో 12 రైళ్లను పాక్షికంగా రద్దు చేసారు. పల్నాడు ను గుంటూరు – నల్గొండ వరకు పరిమితం చేసారు. విజయవాడ-సికింద్రాబాద్- విజయవాడ రైలును ఈ రోజు రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. రేపటి నుంచి రైళ్ల రాకపోకలు యధావిధిగా కొనసాగుతాయి అధికారులు తెలిపారు.

 

ఇది కూడా చదవండి :

Leave a Reply

Dimple Hayathi In Shankars Movie keerthi suresh