Dantewada Maoist Attack:11 మంది జవాన్లు మృతి

Dantewada Maoist Attack

మందుపాతర పేల్చిన మావోయిస్టులు11 మంది జవాన్లు మృతి

Dantewada Maoist Attack: ఛత్తీస్‌గఢ్‌ లో మావోయిస్టులు రెచ్చిపోయారు. దంతెవాడ లో మందుపాతర పేల్చారు  ఈ ఘటనలో 11 మంది ప్రాణాలు కోల్పోయారు.  ఛత్తీస్‌గఢ్‌లోని దంతేవాడలో చోటు చేసుకున్న ఈ ఘటనలో 10 మంది డీఆర్జీ జవాన్లు, ప్రైవేట్ బస్సు డ్రైవర్ మృతి చెందారు. ఈ ఘటన ఆర్మీ వర్గాలను, ప్రభుత్వాన్ని తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేస్తోంది. బుధవారం (ఏప్రిల్ 26) మధ్యాహ్నం జవాన్లతో వెళ్తున్న మినీ బస్సును లక్ష్యంగా చేసుకొని నక్సల్స్ ఈ ఘాతుకానికి పాల్పడ్డారు. పేలుడు దాటికి జవాన్లు ప్రయాణిస్తున్న మినీ బస్సు తునాతునకలైంది. జవాన్ల శరీర భాగాలు ఎగిరిపడ్డాయి. పేలుడు జరిగిన ప్రదేశంలో భారీ గొయ్యి ఏర్పడింది. రక్తపు మరకలు, తెగిపడిన శరీర భాగాలతో ఘటనా స్థలం భీతావహంగా మారింది.

ప్రతి ఏడాది 400 మందికి పైగా మావోయిస్టులు లొంగిపోతున్నారని బస్తర్ రేంజ్ ఐజీ సుందర్‌రాజ్ పీ చెప్పిన మరుసటి రోజే ఈ దాడి జరగడంతో భద్రతా దళాలు ఉలిక్కిపడ్డాయి. ఇంటెలిజెన్స్ ఇచ్చిన సమాచారం ఆధారంగా ఆ ప్రాంతంలో కూంబింగ్ నిర్వహించి తిరిగి వస్తుండగా ఈ ఘటన జరిగింది. ఛత్తీస్‌గఢ్ పోలీస్ ప్రత్యేక దళం డిస్ట్రిక్ట్ రిజర్వ్ గార్డ్ (డీఆర్‌జీ)లో ఎక్కువగా పోలీసులు, మావోయిస్టులను ఎదుర్కోవడానికి శిక్షణ పొందిన స్థానిక గిరిజనులు వుంటారు. అయితే సమాచారం అందుకున్న పోలీసులు , ఇతర భద్రతా బలగాలు ఆ ప్రాంతానికి చేరుకున్నాయి. గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించేందుకు గాను రాయ్‌పూర్ నుంచి హెలికాఫ్టర్‌ బయల్దేరింది.  దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది.

వామపక్ష తీవ్రవాదానికి కేంద్రమైన బస్తర్, దంతేవాడ, సుక్మా జిల్లాల్లో తిరుగుబాటుదారులపై అనేక విజయవంతమైన ఆపరేషన్లలో డీఆర్‌జీ కీలకపాత్ర పోషించింది. ఆరు దశాబ్ధాలుగా వందలాది మందిని బలిగొన్న మావోయిస్ట్ ఉద్యమం Dantewada Maoist Attack  ప్రాంతంలో రక్తపుటేర్లను పారించింది. 1967 నుంచి భారతదేశంలోని మధ్య, తూర్పు ప్రాంతాలపై మావోయిస్టులు నియంత్రణను సంపాదించారు. దీనిని ‘‘రెడ్ కారిడార్’’ అని పిలుస్తారు.

ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి భూపేష్ బఘేల్ ఈ ఘటనపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ‘ఇది చాలా బాధాకరం. మృతుల కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి. ఈ పోరాటం చివరి దశలో ఉంది. మావోయిస్టులను  ఎట్టి పరిస్తితిలో విడిచిపెట్టేదిలేదు’ అని ఆయన అన్నారు.

ఈ  విషయం కేంద్ర హోం మంత్రి అమిత్ షా.. సీఎం బఘెల్‌తో మాట్లాడారు. Dantewada Maoist Attack పేలుడు ఘటనకు సంబంధించిన వివరాలను అడిగి తెలుసుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వానికి అన్ని విధాలా సాయం అందిస్తామని ఆయన హామీ ఇచ్చారు.

Leave a Reply

Dimple Hayathi In Shankars Movie keerthi suresh