Samantha: గుడి కడుతున్న వీర అభిమాని.. ఓపెనింగ్ ఎప్పుడంటే ?

Samantha

సమంతకు గుడి కడుతున్న వీర అభిమాని.. ఓపెనింగ్ ఎప్పుడంటే ?

Samantha: సినీ తారలకు అభిమానులు ఉండడం సహజం. సాధారణంగా వారికిష్టమైన హీరో లేదా హీరోయిన్‌ అంటే పడి చచ్చేంత అభిమానం. అభిమాన తారల సినిమా రిలీజ్‌ అయిందంటే వారి ఆనందానికి హద్దే ఉండదు.

అంతలా సినీ తారలపై ఫ్యాన్స్ ప్రేమను చాటుకుంటారు. ఇక కొందరు వీరాభిమానులైతే అవకాశం వచ్చినప్పుడల్లా ఏదో ఒక రూపంలో తమ ‍ప్రేమను చాటుకుంటూ ఉంటారు. తమ ఫేవరేట్ హీరో, హీరోయిన్లను దేవతలా కూడా భావిస్తారు. వారికేమైనా జరిగితే కూడా తట్టుకోలేరు.

తమిళనాడులో సీనియర్ హీరోయిన్ ఖుష్బూకు గుడి కట్టారు. అటువంటి అరుదైన అభిమానం, భక్తి శ్రద్ధలు సమంతపై చూపిస్తున్నారు. ఇప్పుడు ఆమె కోసం ఓ గుడి కడుతున్నాడు అభిమాని. పూర్తి వివరాల్లోకి వెళితే..

సమంతకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని బాపట్ల నివాసి సందీప్ వీరాభిమాని. ఆమె మాయోసైటిస్ బారిన పడినప్పుడు కోలుకోవాలంటూ తిరుపతి, చెన్నై, నాగ పట్నంలో మొక్కుబడి యాత్ర చేశారు. ఇప్పుడు ఏకంగా సమంతకు గుడి కడుతున్నాడు.

బాపట్లలోని ఆలపాడు సందీప్ స్వస్థలం. ఆలపాడులోని తమ సొంత ఇంట్లో Samantha కోసం అతను గుడి కడుతున్నాడు. ప్రస్తుతం గుడి నిర్మాణ పనులు జోరుగా, శర వేగంగా జరుగుతున్నాయి. ఏప్రిల్ 28న సమంత బర్త్ డే. ఆ రోజు గుడి నిర్మాణ పనులు పూర్తి అవుతాయట. ఆ రోజే టెంపుల్ ఓపెనింగ్ ఉంటుందని సమాచారం.

ఖుష్బూతో పాటు తమిళనాట నయనతార, నిధి అగర్వాల్, హన్సిక, నమితకు సైతం కొంత మంది అభిమానులు గుళ్ళు కట్టారు. అదీ సంగతి! జయాపజయాలతో సంబంధం లేకుండా సమంత అభిమానులు సొంతం చేసుకుంటూ ముందుకు వెళుతున్నారు.

సమంతకు గుడి కడుతున్న వీర అభిమాని

సమంతకు ఎంత మంది అభిమానులు ఉన్నారో, ఆ స్థాయిలో విమర్శలు చేసే వ్యక్తులు కూడా ఉన్నారు. గుణశేఖర్ దర్శకత్వంలో ఆమె నటించిన పాన్ ఇండియా సినిమా ‘శాకుంతలం’ ఫ్లాప్ తర్వాత ఆ విమర్శలు ఎక్కువ అయ్యాయి. Samantha పని అయిపోయిందని నటుడు, నిర్మాత చిట్టిబాబు కామెంట్స్ చేశారు. ఆయనపై సామ్ పరోక్షంగా విమర్శలు చేశారు. దాంతో మళ్ళీ ఆయన విమర్శలు చేయడం స్టార్ట్ చేశారు.

‘సిటాడెల్’ వెబ్ సిరీస్ కాకుండా ఇప్పుడు సమంత చేతిలో ‘ఖుషి’ సినిమా ఉంది. శివ నిర్వాణ దర్శకత్వం వహిస్తున్న ఆ సినిమాలో విజయ్ దేవరకొండకు జోడీగా సామ్ నటిస్తున్నారు. మాయోసైటిస్ బారిన పడటంతో కొన్నాళ్ళు ఆ సినిమా షూటింగుకు బ్రేక్ పడింది. ఆ తర్వాత మళ్ళీ మొదలైంది. ఇప్పుడు మరికొన్ని సినిమాలు చర్చల దశలో ఉన్నాయని తెలిసింది. నిజానికి, రష్మిక నటిస్తున్న ‘రెయిన్ బో’ సినిమా ముందుగా సామ్ దగ్గరకు వెళ్ళింది. ఆ తర్వాత ఏమైందో ఏమో… హీరోయిన్ మార్పు జరిగింది.

కొన్ని రోజుల క్రితం లండన్ వెళ్లారు. అక్కడ ప్రియాంకా చోప్రా నటించిన ‘సిటాడెల్’ వెబ్ సిరీస్ ప్రీమియర్ షోకి అటెండ్ అయ్యారు. సేమ్ టైటిల్ తో రూపొందుతున్న ఇండియన్ వెర్షన్ ‘సిటాడెల్’లో ఆమె యాక్ట్ చేస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆ వెబ్ సిరీస్ షూటింగ్ చేస్తున్నారు.

Leave a Reply