Chiranjeevi vs Balakrishna మధ్య మళ్లీ సంక్రాంతి ఫైట్..కొత్త సెంటిమెంట్ తెరపైకి!
చిరంజీవి, బాలకృష్ణ సుదీర్ఘ విరామం తర్వాత మళ్లీ సంక్రాంతి బరిలోకి పోటీగా దిగబోతున్నారు. చిరంజీవి నటిస్తున్న ‘వాల్తేరు వీరయ్య’ వచ్చే ఏడాది సంక్రాంతికి రిలీజ్ చేయబోతున్నట్లు ప్రకటించి చాలా రోజులైంది. కానీ.. బాలకృష్ణ నటిస్తున్న ‘వీరసింహారెడ్డి’ కూడా సంక్రాంతికి రిలీజ్ చేయబోతున్నట్లు తాజాగా ప్రకటించారు.
ఇక్కడ మరో ఆసక్తికరమైన విషయం ఏంటంటే? ఈ రెండు సినిమాలూ మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ నుంచే వస్తున్నాయి.టాలీవుడ్‌లో అగ్రహీరోలుగా ఉన్న చిరంజీవి, బాలకృష్ణ 1980-90 నుంచే సంక్రాంతికి పోటీపడుతూ వస్తున్నారు. ఈ క్రమంలో ఇద్దరి సినిమాలు హిట్ అయిన సందర్భాలు చాలా తక్కువ. ఒక ఏడాది చిరంజీవి ఘన విజయం సాధిస్తే..
మరో ఏడాది బాలకృష్ణ సినిమా పైచేయి సాధించేది. చివరికి చిరంజీవి చాలా రోజులు సినిమాలకి దూరంగా ఉండి 2017లో రీఎంట్రి ఇచ్చిన ‘ఖైదీ నెం 150’ సినిమాకి కూడా బాలకృష్ణ నటించిన ‘గౌతమిపుత్ర శాతకర్ణి’ సినిమాతో పోటీ తప్పలేదు. ఆ ఏడాది రోజు వ్యవధిలో ఈ రెండు సినిమాలు విడుదల అయ్యాయి.
రియల్ లైఫ్ లో బాలయ్యను ‘డాడీ’ అని పిలుస్తున్న హీరోయిన్.. సెట్లో మాత్రం అలా..
నందమూరి నటసింహం బాలయ్య బాబు సినిమాలు, టాక్ షోలతో ఫుల్ బిజీగీ ఉన్నారు. నటనలో ఉగ్రరూపం చూపించే బాలకృష్ణతో నిజ జీవితంలో మాట్లాడాలంటే చాలా మంది భయపడతారు. ఆయన దగ్గర పనిచేసే వాళ్ల నుంచి టెక్నీషియన్స్, నటీనటులు బాలకృష్ణను చూసి జంకుతుంటారు. ఆయన ఎప్పుడు ఎలా రియాక్ట్ అవుతుంటారో అని కంగారుపడుతుంటారు. అందుకు అనేక సందర్భాలు కూడా ఉన్నాయి. పబ్లిక్ లె చంప చెల్లు మనిపించడం, ఫోన్ తీసి విసిరేయడం వంటి చాలానే చేశారు బాలకృష్ణ.
అయితే అన్ స్టాపబుల్ టాక్ షో వచ్చాక బాలయ్యపై ఉన్న నెగెటివిటీ అంతా పోయిందనే చెప్పాలి. ఆయన్ను అర్థం చేసుకున్నవాళ్లు మాత్రం బాలకృష్ణతో బాండింగ్ ను అసలు వదులుకోరు. ప్రస్తుతం అలా బంధాన్ని కొనసాగిస్తోంది పాపులర్ హీరోయిన్.ఇటీవల అఖండ చిత్రంతో మాసీవ్ హిట్ అందుకున్న నందమూరి బాలయ్య బాబు హీరోగా క్రాక్ సినిమాతో ఫామ్ లోకి వచ్చిన డైరెక్టర్ గోపిచంద్ మలినేని కాంబినేషన్ లో ఓ సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఈ సినిమాకు బాలకృష్ణకు సింహా అనే సెంటిమెంట్ గా వర్కౌట్ అయ్యేలా టైటిల్ పెట్టిన విషయం తెలిసిందే.
నందమూరి బాలకృష్ణ, గోపిచంద్ మలినేని కాంబో మూవీ NBK107కు వీర సింహారెడ్డి అని టైటిల్ ఖరారు చేశారు. అక్టోబర్ 21న కర్నూలులోని కొండారెడ్డి బురుజు వద్ద అభిమానుల సమక్షంలో ఈ టైటిల్ లోగోను ఆవిష్కరించారు. ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నట్లు సమాచారం.అయితే ఈ మూవీలో సిస్టర్ సెంటిమెంట్ కు ప్రాధాన్యత ఉండగా ఆ క్యారెక్టర్ లో బాలకృష్ణకు చెల్లెలిగా వరలక్ష్మీ శరత్ కుమార్ నటిస్తోంది. బాలకృష్ణ, వరలక్ష్మీ నటించిడం ఇదే తొలిసారి అయినప్పటికీ మంచి అనుబంధం ఏర్పర్చుకుందట వరలక్ష్మీ. కెమెరా ముందు క్యారెక్టర్ కు తగినట్లుగా బాలయ్యను ‘అన్నా’ అని పిలుస్తున్న వరలక్ష్మీ.. ఆఫ్ స్క్రీన్ మాత్రం ‘డాడీ’ అంటోందట.
డాడీ అనుకుంటూ చిన్న పిల్లలా బాలకృష్ణ చుట్టూ తిరుగుతుందట వరలక్ష్మీ శరత్ కుమార్. బాలయ్య బాబు కూడా ఆమెను కూతురిలా ట్రీట్ చేస్తున్నారని టాక్. సినిమా షూటింగ్ పూర్తవ్వగానే ఇద్దరు కలిసి మంచిగా కబుర్లు చెప్పుకోవడం, కలిసి భోజనం చేయడం వంటివి చేస్తున్నారట. వీరిద్దరి అనుబంధాన్ని చూసి మిగతా వారంతా ఆశ్చర్యపోతున్నారట.అయితే వరలక్ష్మీ శరత్ కుమార్ ఇప్పటికే తెలుగులో కొన్ని సినిమాలు చేసిన విషయం తెలిసిందే. అయితే ఏ సినిమా సెట్స్ లో కూడా ఎవరితో కలుపుగోలుగా ఉండేది కాదని … ఇప్పుడు బాలకృష్ణను మాత్రం డాడీ అంటూ అస్సలు వదలట్లేదని అంటున్నారు.
వింటేజ్ మాస్ లుక్‌లో మెగాస్టార్..
మెగా అభిమానులందరూ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తోన్న దీపావళి స్పెషల్ ధమాకా వచ్చేసింది. పండగ పర్వదినాన్ని పురస్కరించుకుని మెగాస్టార్ చిరంజీవి నటిస్తోన్న 154వ ప్రాజెక్ట్ నుంచి సర్‌ప్రైజ్ విడుదలైంది. బాబీ దర్శకత్వం వహిస్తోన్న ఈ సినిమా టైటిల్ టీజర్, చిరు ఫస్ట్‌లుక్‌ని చిత్రబృందం సోమవారం ఉదయం విడుదల చేసింది. ముందు నుంచి చెప్పినట్లుగానే ఈ చిత్రానికి ‘వాల్తేరు వీరయ్య’ అనే టైటిల్ ఖరారు చేశారు.ఇక, మెగాస్టార్ లుక్ విషయానికి వస్తే.. లుంగీ కట్టుకుని, ఉంగరాలు, కడియం, చెవి పోగుతో ఊరమాస్ గెటప్‌లో దర్శనమిచ్చారు.
ప్రస్తుతం ఈ వీడియో నెట్టింటిని షేక్ చేస్తోంది. దీనిని చూసిన నెటిజన్లు.. చిరంజీవి నటించిన ఒకప్పటి మాస్ చిత్రాలను గుర్తు చేసుకుంటున్నారు. ఈసారి థియేటర్లు దద్దరిల్లిపోవడం ఖాయం అంటున్నారు. విభిన్నమైన మాస్ కథాంశంతో రూపుదిద్దుకుంటోన్న ఈ సినిమాలో చిరుకు జోడీగా శ్రుతిహాసన్ కనిపించనున్నారు. రవితేజ కీలకపాత్ర పోషిస్తున్నారు. దేవిశ్రీ ప్రసాద్ స్వరాలు అందిస్తున్నారు. మైత్రి మూవీ మేకర్స్ పతాకంపై ఈ సినిమా నిర్మితమవుతోంది. సంక్రాంతి కానుకగా ఈసినిమా విడుదల కానుంది.
మహేష్ బాబు కొత్త బిజినెస్.. ఈ సారి భార్య పేరుతో మాస్టర్ ప్లాన్..
టాలీవుడ్ లో సూపర్ స్టార్ మహేష్ బాబు హవా నడుస్తోంది. వరుస సినిమాలతో ఫుల్ బిజీ ఉన్న మహేష్ బాబు.. మరోవైపు బిజినెస్ పరంగా కూడా కొత్త కొత్త ఆలోచనలు చేస్తున్నారు. పైసా వసూల్ మార్గాలపై అన్వేషణ చేస్తూ ఆయన ఓ మాస్టర్ ప్లాన్ రెడీ చేశారని తెలుస్తోంది.సినిమా షూటింగ్స్, కమర్షియల్ యాడ్స్ చేస్తూ భారీ రేంజ్ లో సంపాదిస్తున్న మహేష్ బాబు.. ఇప్పటికే థియేటర్, ప్రొడక్షన్ హౌస్, క్లాత్ బ్రాండ్ బిజినెస్‌లు ప్రారంభించి సక్సెస్ అయ్యారు. ఈ బిజినెస్ వ్యవహారాల్లో మహేష్ సతీమణి నమ్రత హ్యాండ్ ఎక్కువగా ఉంటుందని సమాచారం.
అయితే ఈ సారి మరో బిగ్ ప్లాన్ చేసిన మహేష్.. ఏకంగా తన భార్య నమ్రత పేరుతోనే పెద్ద వ్యాపారం ప్రారంభించబోతున్నారట. మార్కెట్ లో డిమాండ్ ఉన్న రెస్టారెంట్ బిజినెస్ లోకి మహేష్ బాబు ఎంటర్ అవుతున్నారనే విషయం బయటకొచ్చింది.ఇప్పటికే మహేష్ బాబు అండ్ టీమ్ దీనిపై పూర్తి స్థాయిలో వర్కవుట్స్ చేసి ప్లాన్ రెడీ చేశారని టాక్. మినర్వా ఎ.ఎన్ పేరుతో ఓ హోటల్‌ను నవంబర్ నెలలో స్టార్ట్ చేయబోతున్నారట. ఆ తర్వాత డిసెంబర్ నెలలో ప్యాలెస్ హైట్స్ నమ్రత పేరుతో మరో రెస్టారెంట్ ప్రారంభించనున్నారట.ఇప్పటికే ఏషియన్ సంస్థతో చేతులు కలిపి ఏఎంబీ సినిమాస్ (AMB Cinemas) పేరుతో ఓ వ్యాపారం, హంబుల్ అనే బ్రాండ్ పేరుతో మరో వ్యాపారం చేస్తున్న మహేష్. ఇప్పుడు హోటల్ రంగంలోకి రానుండటం హాట్ టాపిక్ అయింది.
పరిస్థితులకు అనుగుణంగా ఎప్పటికప్పుడు మహేష్ బాబు వేస్తున్న స్టెప్స్ చూసి ఖుషీ అవుతున్నారు ఆయన ఫ్యాన్స్.ప్రస్తుతం త్రివిక్రమ్ శ్రీనివాస్ తో ఓ సినిమా చేస్తున్నారు మహేష్ బాబు. మహేష్ బాబు కెరీర్‌లో 28వ సినిమాగా గ్రాండ్‌గా ఈ సినిమా రూపొందుతోంది. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్‌పై తెరకెక్కనున్న ఈ సినిమాకు సూర్యదేవర రాధాకృష్ణ (చినబాబు) నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. తమన్ బాణీలు కడుతున్నారు.
గతంలో త్రివిక్రమ్- మహేష్ బాబు కాంబోలో వచ్చిన అతడు, ఖలేజా సినిమాలు ప్రేక్షకాదరణ పొందటంతో మళ్ళీ అదే కాంబోలో రాబోతున్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఈ సినిమాతో మహేష్- త్రివిక్రమ్ కాంబో హాట్రిక్ సక్సెస్ అందుకుంటుందని ఆశగా ఉన్నారు సూపర్ స్టార్ ఫ్యాన్స్.దీంతో పాటు దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో మరో సినిమా చేస్తున్నారు మహేష్ బాబు. వీరిద్దరి కాంబినేషన్‌లో భారీ పాన్ ఇండియా మూవీగా అతి త్వరలో ఈ సినిమా సెట్స్ మీదకు రానుంది. ప్రస్తుతం ఈ మూవీ ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ నడుస్తున్నాయి.