NTR క్లాసీ లుక్ లో మాస్ హీరో.

NTR క్లాసీ లుక్ లో మాస్ హీరో.

టాలీవుడ్ యంగ్ స్టార్ హీరోల్లో మాస్ హీరో ఎవరు అనగానే ఠక్కున గుర్తుకు వచ్చే పేరు ఎన్టీఆర్ అనడంలో సందేహం లేదు. అలాంటి ఎన్టీఆర్ ను ఇలా క్లాసీ లుక్ లో చూడం ఆశ్చర్యంగా ఉందని.. చాలా ఆనందంగా ఉందంటూ అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. సోషల్ మీడియాలో ప్రస్తుతం వైరల్ అవుతున్న ఈ ఫోటోలు ఎన్టీఆర్ పై అభిమానం మరింతగా పెరిగేలా చేస్తున్నాయంటూ కామెంట్స్ వస్తున్నాయి.ఇటీవల ఎన్టీఆర్ కాస్త బరువు పెరిగినట్లుగా అనిపిస్తున్నాడని..

ఆయన లుక్ ఏ మాత్రం సరిగా లేదు అంటూ చాలా మంది చాలా రకాలుగా కామెంట్స్ చేస్తున్న ఈ సమయంలో తాజాగా ప్రముఖ ఫోటోగ్రాఫర్ కమలేష్ షేర్ చేసిన ఈ ఫోటోలు నందమూరి అభిమానులకు ఫుల్ గా సంతోషాన్ని కలిగిస్తున్నాయి. ఎన్టీఆర్ అభిమానులతో పాటు ప్రతి ఒక్కరు కూడా ఎన్టీఆర్ లుక్ భలే ఉందంటూ కామెంట్స్ చేస్తున్నారు.ఆర్ ఆర్ ఆర్ సినిమా తో అంతర్జాతీయ స్థాయిలో స్టార్ గా నిలిచిన ఎన్టీఆర్ తాజాగా జపాన్ మీడియా ముందుకు సినిమా ప్రమోషన్ నిమిత్తం వెళ్లాడు.

ఆ సందర్భంగా తీసిన ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఎన్టీఆర్ కూల్ అండ్ స్మైలింగ్ లుక్ ఆకట్టుకునే విధంగా ఉంది. ఎన్టీఆర్ తదుపరి సినిమా షూటింగ్ ఎప్పుడెప్పుడు మొదలు అవుతుందా అంటూ అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.ఎన్టీఆర్ తదుపరి సినిమా కొరటాల శివ దర్శకత్వంలో రూపొందబోతున్న విషయం తెల్సిందే. ఆ సినిమా లో ఎన్టీఆర్ లుక్ ఇలాగే ఉండి.. క్లాసీ పాత్రలో కనిపిస్తే బాగుంటుందని అభిమానులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నానరు. మరి కొరటాల ఎలా చూపించబోతున్నాడో.. ఆ తర్వాత ఎన్టీఆర్ ను ప్రశాంత్ నీల్ ఎలా చూపించబోతున్నాడో తెలియాలంటే మరి కొన్నాళ్లు వెయిట్ చేయాల్సిందే.

 

 బాలీవుడ్‌లోకి బాలయ్య..

ఆరు పదుల వయసులోనూ కుర్ర హీరోలకు ధీటుగా సినిమాలు చేస్తూ.. ఇప్పటికీ తనలోని సత్తాను నిరూపించుకుంటూనే ఉన్నారు నటసింహా నందమూరి బాలకృష్ణ. ఈ మధ్య కాలంలో చాలా పరాజయాలను చవి చూసిన ఆయన.. గత ఏడాది విడుదలైన ‘అఖండ’తో కెరీర్‌లోనే బిగ్గెస్ట్ హిట్‌ను ఖాతాలో వేసుకున్నారు. ఈ ఉత్సాహంతోనే ఫ్యూచర్ ప్రాజెక్టులను వరుసగా లైన్‌లో పెట్టుకుంటున్నారు. ఇలా ఇప్పటికే అనిల్ రావిపూడితో బాలయ్య ఓ సినిమాను ప్రకటించారు. తాజాగా ఈ ప్రాజెక్టు గురించి ఓ ఆసక్తికరమైన వార్త బయటకు వచ్చింది.

బోయపాటి శ్రీను దర్శకత్వంలో బాలయ్య నటించిన చిత్రమే ‘అఖండ’. ప్రతిష్టాత్మకంగా వచ్చిన ఈ సినిమాకు తెలుగు ప్రేక్షకులు భారీ స్పందనను అందించారు. దీంతో అత్యధిక వసూళ్లతో ఈ మూవీ సూపర్ డూపర్ హిట్ అయింది. దీనికి కలెక్షన్లు పోటెత్తడంతో చాలా ప్రాంతాల్లో సరికొత్త రికార్డులు కూడా నమోదు అయ్యాయి. దీంతో ఇది బాలయ్య కెరీర్‌లోనే టాప్ మూవీగా నిలిచింది.అఖండ’ తర్వాత నటసింహా బాలకృష్ణ ఫుల్ జోష్‌తో కనిపిస్తున్నారు. ఈ ఉత్సాహంతోనే ఫ్యూచర్ ప్రాజెక్టులను సైతం లైన్‌లో పెట్టుకున్నారు.

ఇందులో ‘క్రాక్’ మూవీ డైరెక్టర్ గోపీచంద్ మలినేనితో ప్రస్తుతం ఓ మాస్ సినిమా చేస్తున్నారు. పల్నాడు ఫ్యాక్షన్ నేపథ్యంతో తెరకెక్కుతోన్న ఈ మూవీ షూటింగ్ శరవేగంగా సాగుతోంది. దీన్ని మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తోంది.టాలీవుడ్ సక్సెస్‌ఫుల్ డైరెక్టర్‌గా పేరు తెచ్చుకున్న అనిల్ రావిపూడితో నటసింహా నందమూరి బాలకృష్ణ ప్రాజెక్టును కూడా లైన్‌లో పెట్టుకున్న విషయం తెలిసిందే. ఇప్పటికే దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన కూడా వెలువడింది. షైన్ స్క్రీన్ బ్యానర్‌పై సాహు గారపాటి, హరీశ్ పెద్ది ఈ సినిమాను నిర్మిస్తున్నారు. దీనికి ఎస్ థమన్ సంగీతాన్ని సమకూర్చుతున్నాడు.అనిల్ – బాలయ్య కాంబోలో రాబోయే ఈ చిత్రంపై ఆరంభం నుంచే అంచనాలు భారీ స్థాయిలో నెలకొన్నాయి.

అందుకు అనుగుణంగానే ఇది సరికొత్త పంథాలో తెరకెక్కించబోతున్నారట. ఇక, ఇందులో అంజలి, ప్రియమణి కీలక పాత్రలను చేస్తున్నారని అంటున్నారు. అలాగే, శ్రీలీలా.. బాలయ్య కూతురిగా నటించబోతుందట. ఇక, ఈ చిత్రానికి రూ. 80 కోట్లు బడ్జెట్ కేటాయించారని టాక్.దాదాపు నాలుగు దశాబ్దాలుగా నటసింహా నందమూరి బాలకృష్ణ తెలుగులో సినిమాలు చేస్తున్నారు. గతంలో కంటే ఇప్పుడు మరిన్ని ప్రయోగాలతో ముందుకు వెళ్తున్నారు. ఈ నేపథ్యంలో త్వరలోనే అనిల్ రావిపూడితో చేసే సినిమా ద్వారా బాలయ్య బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నారని తాజాగా తెలిసింది. ఈ చిత్రం దక్షిణాది భాషల్లోనూ రూపొందనుందని సమాచారం.

మాస్ ‘రావణాసుర’ దీపావళి స్పెషల్ సర్ ప్రైజ్.

మాస్ మహారాజ రవితేజ బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతున్నాడు. ధమాకా సినిమా అతి త్వరలోనే విడుదల కాబోతున్న విషయం తెల్సిందే. ఇక చాలా మంది ఆసక్తిగా ఎదురు చూస్తున్న ‘రావణాసుర’ సినిమా యొక్క విడుదల తేదీని దీపావళి సందర్భంగా అధికారికంగా ప్రకటించారు.సుధీర్ వర్మ దర్శకత్వంలో అభిషేక్ నామ నిర్మిస్తున్న రావణాసుర సినిమాలోని రవితేజ మరో లుక్ ను కూడా దీపావళి సందర్బంగా రివీల్ చేయడంతో అభిమానులకు సూపర్ సర్ ప్రైజ్ అన్నట్లుగా అభిప్రాయం వ్యక్తం అవుతోంది.

రావణాసుర సినిమా రవితేజ మార్క్ మాస్ ఎంటర్ టైనర్ గా ఉంటుందని యూనిట్ సభ్యులు అంటున్నారు.రవితేజ కి జోడీగా రావణాసుర సినిమాలో ముగ్గురు ముద్దుగుమ్మలు హీరోయిన్ లుగా కనిపించబోతున్నారు. ముఖ్యంగా జాతిరత్నాలు ముద్దుగుమ్మ ఫరియా అబ్దుల్లా కి ఇదో మంచి ఛాన్స్ అన్నట్లుగా ఆమెను అభిమానించే వారు మాట్లాడుకుంటున్నారు.మేఘ ఆకాంక్ష మరియు దక్షా లు కూడా రవితేజ కు జోడీగా ఈ సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమాను వచ్చే ఏడాది సమ్మర్ కానుకగా ఏప్రిల్ 7వ తారీకున ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్లుగా అధికారికంగా ప్రకటించారు.

రవితేజ చేస్తున్న అన్ని సినిమాల్లోకి ఈ సినిమా పై ఒకింత ఎక్కువ ఆసక్తి ఆయన అభిమానుల్లో ఉన్నట్లుగా చర్చ జరుగుతోంది.ఈ సినిమాలో రవితేజ లాయర్ గా కనిపించబోతున్నట్లుగా ఫస్ట్ లుక్ పోస్టర్ ను చూస్తూ ఉంటే అర్థం అవుతోంది. ఇక అక్కినేని హీరో సుశాంత్ ఈ సినిమాలో కీలక పాత్రలో కనిపించబోతున్న నేపథ్యంలో మరింతగా ఈ సినిమా కి హైప్ ఉంది అనడంలో సందేహం లేదు.

జపాన్ లో ‘ఆర్ఆర్ఆర్’తో ఆ విషయం కన్ఫర్మ్…

ప్రపంచ వ్యాప్తంగా సినిమా పరిశ్రమ ఒకింత గడ్డు కాలం ను ఎదుర్కొంటుంది అంటూ సినీ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. థియేటర్ల యొక్క మనుగడ కష్టంగా మారుతుంది అనుకుంటున్న సమయంలో ఏదో ఒక సినిమా వచ్చి ఇండస్ట్రీకి ఊపిరి ఊదుతున్నట్లుగా అనిపిస్తుంది.ఇప్పుడు ఆర్ ఆర్ ఆర్ సినిమాకు జపాన్ లో దక్కుతున్న ఆదరణ మరియు చిత్ర యూనిట్ సభ్యులు అక్కడ చేస్తున్న ప్రమోషన్ కార్యక్రమాలు చూస్తూ ఉంటే మంచి కంటెంట్ ఉన్న సినిమాకు మంచి ప్రమోషన్ చేస్తే తప్పకుండా థియేటర్లకు జనాలు వస్తారని నిరూపితం అయ్యింది.

థియేటర్లను జనాలు ఇప్పుడు.. ఎప్పుడు కూడా మిస్ చేసుకోరు అంటూ ఈ విషయాన్ని ఆర్ ఆర్ ఆర్ ను జపాన్ లో ఆధరిస్తున్న తీరును చూస్తూ ఉంటే అర్థం అవుతోంది. నెట్ ఫ్లిక్స్ ద్వారా ప్రపంచ వ్యాప్తంగా సినిమాను స్ట్రీమింగ్ చేయడం జరిగింది. అయినా కూడా ఆర్ ఆర్ ఆర్ వంటి విజువల్ వండర్ మూవీని థియేటర్ లోనే చూడాలని అక్కడి వారు కోరుకుంటున్నారు.

సినిమాకు చేసిన పబ్లిసిటీ మరియు చిత్ర యూనిట్ సభ్యులు పెట్టిన ఎఫర్ట్ వల్లే జపాన్ లో ఆర్ ఆర్ ఆర్ కి మంచి స్పందన దక్కింది అనడంలో ఎలాంటి సందేహం లేదు. ప్రపంచ వ్యాప్తంగా కూడా సినిమాలు మంచి కంటెంట్ తో వస్తే జనాలు థియేటర్లకు రావడం పక్కా అని ఈ సినిమా తో కన్ఫర్మ్ అయ్యింది.

Leave a Reply

Dimple Hayathi In Shankars Movie keerthi suresh