ఏజ్ బార్ అవుతున్నా కొద్దీ వయసు రీత్యా వచ్చే మార్పులు శరీరంలో జరుగుతుంటాయి. వాటిని ఎంత మార్చాలని అనుకున్నా సరే అవి మారవు. ముఖ్యంగా డబ్బు తో వయసు మీద పడకుండా చేయాలనుకోవడం అదో పెద్ద నాన్సెన్స్ థింగ్ అని చెప్పొచ్చు. ఇంతకీ ఈ లీడ్ అంతా దేనికి అనుకోవచ్చు.. యూఎస్ లో ఒక సీ.ఈ.ఓ తన ఏజ్ కనబడకుండా యంగ్ గా ఉండేందుకు కోట్లకు కోట్లు కర్చి చేస్తున్నాడు. కాలిఫోర్నియాలోని ఒక సాఫ్ట్ వేర్ కంపెనీ సీ.ఈ.ఓ అయిన బ్రియాన్ జాన్సన్ కి 45 ఏళ్ల వయసు ఉంటుంది. ఇంతవరకు అతనికి పెళ్లి కాలేదు.
అయితే అతను యంగ్ గా కనిపించేందుకు చాలా ప్రయత్నాలు చేస్తున్నారు. అతను యువ కుడిలా మారేందుకు దాదాపు ఏడాదికి 16 కోట్ల దాకా ఖర్చు పెడుతున్నాడట అంతేకాదు రోజుకి 111 టాబ్లెట్స్ ని తీసుకుంటున్నాడట. బాబోయ్ రోజుకి 111 టాబ్లెట్స్ ఏంటి అని షాక్ అవ్వొచ్చు. అసలు అతను ఎందుకు యువకుడిలా మారాలని అనుకుంటున్నాడు అంటే అతను ఒంటరితనమే అతన్ని అలా కావాలని చేస్తుందట.
తనకు అమ్మాయిలతో డేటింగ్ చేయాలని ఉందట. తాను యువకుడిలా మారితే అలా చేయొచ్చని అంటున్నాడు. అంతేకాదు తనతో డేటింగ్ చేసే వారికి కొన్ని కండీషన్స్ ఉన్నాయట. తనకు ఉన్న అలవాట్లని వారు గౌరవించాలని అంటున్నాడు. మొత్తానికి 45 ఏళ్ల వయసులో యంగ్ గా కనిపించాలని కోట్లకు కోట్లు ఖర్చు పెడుతున్న బ్రియాన్ జాన్సన్ గురించి తెలుసుకున్న నెటిజెన్లు షాక్ అవుతున్నారు.