బైడెన్ నివాసంపై దాడికి కుట్ర పన్నిన తెలుగు యువకుడు

అమెరికాలో తెలుగు కుర్రాడు కందుల సాయి వర్షిత్ అరెస్ట్ అయ్యాడు. వాషింగ్టన్ డీసీ పోలీసులు అతణ్ని అరెస్ట్ చేశారు. పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. అమెరికా అధ్యక్షుడి అధికారిక నివాస భవనం వైట్‌హౌస్‌లోకి ఓ భారీ ట్రక్కుతో బీభత్సం సృష్టించిన కేసులో అరెస్ట్ అయ్యాడు. నాజీల పతాకాన్ని ఆ ట్రక్కుపై అతికించినట్లు పోలీసులు గుర్తించారు. కందుల సాయి వర్షిత్ వయస్సు 19 సంవత్సరాలు. మిస్సోరీలోని ఛెస్టర్‌ఫీల్డ్‌లో నివాసం ఉంటోన్నాడు. గ్రేటర్ సెయింట్ లూయిస్ ప్రాంతంలోని రాక్‌వుడ్ స్కూల్‌లో చదువుకున్నాడు. ఛెస్టర్‌ఫీల్డ్‌లోని మార్క్వెట్ సీనియర్ హైస్కూల్‌లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేశాడు. అమెరికా కాలమానం ప్రకారం సోమవారం రాత్రి 9:40 నిమిషాల సమయంలో ఓ భారీ ట్రక్కులో వైట్‌హౌస్‌లోకి దూసుకెళ్లే ప్రయత్నం చేశాడు.

కట్టుదిట్టమైన భద్రత ఉండే వైట్ హౌస్ దగ్గర బారికేడ్లను ఓ ట్రక్కుతో అత్యంత వేగంగా వచ్చి గుద్ది మళ్లీ ట్రక్కు వెనక్కి తీసుకుని మళ్లీ గుద్దాడు. ఆ తరువాత స్వస్తిక్ కి గుర్తు ఉన్న నాజీ జెండాను బయటికి తీశాడు సాయి వర్షిత్.  అంతేకాదు ‘అధ్యక్షుడుని చంపిన తరువాత అధికారాన్ని నా చేతుల్లోకి తీసుకుంటా’ అంటూ వర్షిత్ అన్నట్లుగా సమాచారం తెలుస్తోంది.

అలాగే  గత ఆరునెలలుగా తాను కుట్ర చేస్తున్నట్టుగా సాయి వర్షిత్ ఒప్పుకున్నట్లుగా తెలిసింది. అయితే సాయి వర్షిత్ వైట్ హౌస్ మీద దాడికోసమే వాషింగ్టన్ వచ్చాడు. రాగానే ఓ ట్రక్కు అద్దెకు తీసుకుని నేరుగా వైట్ హౌస్ లోకి దూసుకెళ్లే ప్రయత్నం చేశాడు. దీంతో  వైట్ హౌస్ దగ్గర కలకలం రేగింది. వెంటనే అలర్ట్ అయిన సెక్యూరిటీ, భద్రతా బలగాలు సాయివర్షిత్ ను అదుపులోకి తీసుకున్నారు. అయితే, సాయి వెనుక ఇంకా ఎవరైనా ఉన్నారా? అనే కోణంలో దర్యాప్తు సాగుతోంది. అంతకు ముందు సాయి వర్షిత్ కు ఎలాంటి నేర చరిత్రా లేదు.

లఫాయెట్టె పార్క్, హెచ్ స్ట్రీట్ బ్లాక్ నంబర్ 1600 వైపు నుంచి నార్త్-వెస్ట్ గేట్ వైపు భారీ ట్రక్కుతో దూసుకొచ్చాడు. యూ-హాల్ అనే రెంటల్ కంపెనీకి చెందిన ట్రక్ అది. అరిజోనాలోని ఫీనిక్స్ ప్రధాన కేంద్రంగా అమెరికా వ్యాప్తంగా మూవర్స్ అండ్ స్టోరేజ్ సర్వీసులను అందించే సంస్థ యూ-హాల్.

కాగా ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదు. ఆ ట్రక్కులో మారణాయుధాలు గానీ, మందుగుండు సామగ్రి గానీ ఇతర పేలుడు పదార్థాలు లేవని తెలుస్తోంది. సోషల్‌మీడియా అకౌంట్స్‌ ద్వారా సాయివర్షిత్‌ గురించి పూర్తి వివరాలు సేకరించే ప్రయత్నం చేస్తున్నారు పోలీసులు.

Leave a Reply

Dimple Hayathi In Shankars Movie keerthi suresh