Babu Mohan : బీజేపీ నేతల పై బాబు మోహన్ దూకుడు
Babu Mohan : మాజీ మంత్రి, బీజేపీ నేత బాబు ప్రస్తుతం బీజేపీలో కొనసాగుతోండగా. అయితే రాజకీయంగా ఆయన అంత యాక్టివ్‌గా కనిపించడం లేదు.
అప్పుడప్పుడు ప్రెస్‌మీట్లు పెట్టి సీఎం కేసీఆర్‌ను విమర్శిస్తున్నారు. కార్యకర్తలతో బాబు మోహన్ అంతగా పరిచయాలు పెట్టుకోవడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి.
ఈ తరుణం లోనే బాబు మోహన్ కార్యకర్తపై బూతు పురాణం ఎత్తుకున్నారు. అయన బుతులకు కారణం ఏంటి అనుకున్నారు.
అందోల్ నియోజకవర్గానికి చెందిన వెంకటరమణ అనే కార్యకర్త పార్టీలో మీతో కలిసి పనిచేస్తానంటూ ఫోన్ చేశాడు.
దీనితో అయన అసలు నువ్వు ఎవరు నీ స్థాయి ఎంత.నీ బ్రతుకెంత.అంటు బాబు మోహన్ గారు బూతులతో చెలరేగిపోయారు.
తాను ప్రపంచస్ధాయి నాయకుడినని, అసలు నీ బ్రతుకెంత? అంటూ కించపరుస్తూ మాట్లాడారు.
అసలు బండి సంజయ్ ఎవడ్రా వాడు నా తమ్ముడు’ అని బాబు మోహన్ ఫోన్ కాల్‌లో మాట్లాడారు.
అసలు అవసరమైతే రేపే పార్టీకి రాజీనామా చేస్తా, నువ్వు కావాలో నేను కావాలో పార్టీ తేల్చుకుంటుంది.
రెండు తెలుగు రాష్ట్రాల్లో పనిచేసేందుకు నన్ను అమిత్ షా బీజేపీలో చేర్చుకున్నారు’ అని కార్యకర్తపై బాబు మోహన్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఇంకోసారి తనకు ఫోన్ చేస్తే జోగిపేటలో చెప్పుతో కొడతానంటూ కార్యకర్తను హెచ్చరించారు.
దీనికి సంబంధించిన ఆడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
‘నీ వయస్సు ఎంత గాడిద అని తిట్టి నీకు కావాలంటే ఫోన్ కాల్ రికార్డు చేసుకో, ఇంకోసారి ఫోన్ చేస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయి’ అంటూ హెచ్చరించారు.
ఈయన అందోల్ నియోజకవర్గం నుంచి రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన ఉమ్మడి రాష్ట్రంలో చంద్రబాబు కేబినెట్‌లో మంత్రిగా పనిచేశారు.
2004, 2009లో అందోల్ నియోజకవర్గంలో మాజీ డిప్యూటీ సీఎం దామోదర రాజనర్సింహ చేతిలో రెండుసార్లు ఓటమి చెందారు.
అలాగే 2014లో తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేసిన ఆయన టీఆర్ఎస్ పార్టీలో చేరారు.
2014 అసెంబ్లీ ఎన్నికల్లో అందోల్ నియోజకవర్గం నుంచి టీఆర్ఎస్ పార్టీ తరపున పోటీ చేసి దామోదర రాజనర్సింహపై గెలిచారు.
సీఎం కేసీఆర్‌తో విబేధాలు రావడంతో 2018లో టీఆర్ఎస్‌కు గుడ్ బై చెప్పి కాషాయ పార్టీలో చేరారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ నుంచి పోటీ చేయాలని ఆయన భావిస్తున్నారు.
బండి సంజయ్ ఎవడ్రా.. బీజేపీ కార్యకర్తతో బాబు మోహన్ బూతు పురాణం#BabuMohan #BabuMohanAudioLeak #BandiSanjay pic.twitter.com/9N96KR4xTM
— Telugu Scribe (@TeluguScribe) February 7, 2023
ఇది కూడా చదవండి: