త్వరలో రానున్న కాంతార 1

కన్నడ పరిశ్రమ నుంచి ఇటీవల వచ్చిన బ్లాక్ బస్టర్ చిత్రం ‘కాంతార’.  దీనిలో హీరోగా  రిషబ్ శెట్టి ,సప్తమి గౌడ హీరోయిన్ గా రిషబ్ శెట్టి దర్శకత్వంలో హోంబలే ఫిలిమ్స్ నిర్మాణంలో తెరకెక్కిన సినిమా కాంతార. చిన్న సినిమాగా రిలీజయి ఎటువంటి అంచనాలు లేకుండా ఒక చిన్న సినిమాగా ప్రేక్షకుల ముందుకు వచ్చి దేశం మొత్తాన్ని షేక్ చేసింది. ఈ సినిమా కన్నడ గ్రామ దేవతల నేపథ్యంతో తెరకెక్కింది. కర్ణాటకలోని ప్రాచీన సంప్రదాయం అయిన ‘భూతకోల’ని దర్శకుడు రిషబ్ తెరకెక్కించిన తీరు అందర్నీ ఎంతగానో ఆకట్టుకుంది. ఈ సినిమా ప్రీ క్లైమాక్స్ లో రిషబ్ క్యారెక్టర్ ట్రాన్స్‌ఫార్మషన్ ఒక హైలైట్ అయితే.. మూవీ ఎండింగ్ లో భూతకోల ఆడే తీరు అందర్నీ కట్టపడేసింది.ఈ సినిమా  కేవలం 25 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన కాంతార సినిమా 450 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్స్ వసూలు చేసింది. అలాగే కాంతార సినిమాని ప్రేక్షకులతో పాటు అన్ని పరిశ్రమల సెలబ్రిటీలు కూడా మెచ్చుకున్నారు. ఈ సినిమా భారీ విజయం సాధించడంతో కాంతార సినిమాకి సీక్వెల్ కూడా ఉంటుందని గతంలోనే ప్రకటించారు.అలాగే  చిత్ర నిర్మాత కూడా దీనికి పార్ట్ 2 ఉంటుందని చెప్పారు. దీంతో అంతా కాంతార సినిమాకి నెక్స్ట్ పార్ట్ ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తున్నారు. అయితే తాజాగా ఈ సినిమా 100 రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా కాంతార సీక్వెల్ పై హీరో రిషబ్ శెట్టి మాట్లాడుతూ  ప్రేక్షకులకు ఒక ట్విస్ట్ ఇచ్చారు.ఆ ట్విస్ట్ ఏంటి అనుకుంటున్నారా . మీరు చూసింది కాంతార 2. త్వరలో కాంతార 1 తీస్తాను, ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ జరుగుతున్నాయి. ఇప్పుడు వచ్చిన కాంతార సినిమాకి సీక్వెల్ కాదు ప్రీక్వెల్ చెయ్యబోతున్నాము అని తెలిపి అందర్నీ ఆశ్చర్యపరిచాడు. దీంతో ప్రేక్షకులు ఇప్పుడు చూసింది కాంతార 2నా అనుకుంటూ మరి కాంతార 1లో ఏం స్టోరీ చూపిస్తారో అంటు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

ఇది కూడా చదవండి :

Leave a Reply

Dimple Hayathi In Shankars Movie keerthi suresh