Pawan Kalyan : పవన్ మూవీ సెట్‌లో

Pawan Kalyan

Pawan Kalyan : పవన్ మూవీ సెట్‌లో భారీ అగ్ని ప్రమాదం

Pawan Kalyan : ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ టైటిల్ పాత్ర‌లో న‌టిస్తోన్న లేటెస్ట్ చిత్రం ‘హరిహర వీరమల్లు’.

జాగర్ల మూడి క్రిష్ దర్శకత్వంలో ఎ.ఎం.ర‌త్నం ఈ చిత్రాన్ని నిర్మిస్తోన్న సంగ‌తి తెలిసిందే.

ఈ సినిమా ప్ర‌స్తుతం శ‌ర‌వేగంగా షూటింగ్‌ను పూర్తి చేసుకుంటోంది. ఇందులో మొఘ‌ల్ కాలానికి చెందిన ట‌చ్ ఎక్కువ‌గా క‌నిపిస్తుంది.

అలాగే ప‌వ‌ర్ స్టార్ ఇందులో రాబిన్ హుడ్ త‌ర‌హా బందిపోటు పాత్ర‌లో క‌నిపించ‌బోతున్నారు.

అయితే ఈ షూటింగ్ లో భాగంగా  హైదరాబాద్ దుండిగల్ పరిధిలోని బౌరంపేటలో అర్థరాత్రి

సమయంలో సెట్ లో మంటలు ఎగసిపడ్డాయని అక్కడి వారు చెబుతున్నారు.

విషయం తెలుసుకుని హుటాహుటిన అక్కడికి చేరుకున్న ఫైర్‌ సిబ్బంది సెట్‌లో మంటలను అదుపు చేశారు.

అయితే వర్షానికి సెట్‌ కూలగా దానికి మరమ్మత్తులు చేసే క్రమంలో ఈ అగ్నిప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది.

ఈ అగ్ని ప్రమాదంలో భారీగా ఆస్తి నష్టం జరిగిందని తెలుస్తోంది. కాగా ఎవ్వరి ఎలాంటి గాయాలు కాలేదు.

తిరిగి సెట్ Pawan Kalyan : నిర్మించి పెండింగ్ చిత్రీకరణను పూర్తి చేయాల్సి ఉంటుంది దాంతో ఈ మూవీ షూటింగ్ కు

మరికొంత సమయం పట్టేలా కనిపిస్తుంది.

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న తొలి పాన్ ఇండియా కావడంతో ఈ మూవీ పై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.

అయితే ఒకవైపు ఏపీ రాజకీయాల్లో యాక్టివ్‌గా ఉంటూనే  మరొక వైపు సినిమా సెట్స్ మీద చురుకుగా

వ్యవహరిస్తున్నారు  పవన్  ఇప్పటికే కమిటైన అన్ని సినిమాలను చకచకా ఫినిష్ చేస్తున్నారు.

ఈ క్రమంలోనే క్రిష్ దర్శకత్వంలో వస్తున్న హరిహర వీరమల్లు సినిమా కంప్లీట్ చేసే పనిలో ఉన్నారు.

విభిన్నమైన చారిత్రక అంశాలను ఆధారంగా చేసుకుని ఈ సినిమాను రూపొందిస్తున్నారు క్రిష్ రీసెంట్ గా

వదిలిన ఫస్ట్ గ్లాన్స్ వీడియో హరిహర వీరమల్లు సినిమాపై ఉన్న అంచనాలకు రెక్కలు కట్టింది.

నిధి అగ‌ర్వాల్ ఇందులో హీరోయిన్‌గా న‌టిస్తుండ‌గా మ‌రో హీరోయిన్ పాత్ర‌లో బాలీవుడ్ బ్యూటీ నోరా ఫ‌తేహి క‌నిపించ‌నుంద‌ట‌.

అలాగే మ‌రో బాలీవుడ్ స్టార్ అర్జున్ రాంపాల్ ఇందులో మొఘ‌ల్ చ‌క్ర‌వ‌ర్తి ఔరంగ‌జేబు పాత్ర‌లో క‌నిపించ‌బోతున్నారు.

సీనియ‌ర్ మ్యూజిక్ డైరెక్ట‌ర్ ఎం.ఎం.కీర‌వాణి ఈ చిత్రానికి సంగీతాన్ని అందిస్తున్నారు.

ఏఎం రత్నం ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ సినిమాలో యాక్షన్ ఎపిసోడ్స్ హైలైట్ కానున్నాయట.

బడ్జెట్ విషయంలో ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా అన్ని హంగులతో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారట.

దాదాపు 150 కోట్లకు పైగా బడ్జెట్ కేటాయించి ఈ సినిమాను రూపొందిస్తున్నారు.

అయితే షూటింగ్ Pawan Kalyan : దశలోనే భారీ డిమాండ్ చేకూరడంతో దాదాపు పెట్టిన

పెట్టుబడి మొత్తం రిలీజ్ కి ముందే రావొచ్చని అంచనా వేస్తున్నారు ట్రేడ్ విశ్లేషకులు.

Leave a Reply

Dimple Hayathi In Shankars Movie keerthi suresh