Arvind Kejriwal:ఎల్జీ సర్ శాంతిభద్రతలు

Arvind Kejriwal

Arvind Kejriwal:ఎల్జీ సర్ శాంతిభద్రతలు మీ బాధ్యత

Arvind Kejriwal: దేశ రాజధాని ఢిల్లీలోని షాబాద్ లో 16 ఏళ్ల బాలిక హత్యపై ఢిల్లీ లెఫ్టినెంట్

గవర్నర్ వీకే సక్సేనాపై ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఢిల్లీలో ఓ మైనర్ బాలిక దారుణ హత్యకు గురైంది. ఇది చాలా బాధాకరం, దురదృష్టకరం.

నేరగాళ్లు నిర్భయంగా తయారయ్యారని, పోలీసులంటే భయం లేదన్నారు. ఎల్జీ సర్, లా అండ్ ఆర్డర్ మీ బాధ్యత,

ఏదైనా చేయండి. ఢిల్లీ ప్రజల భద్రత అత్యంత ముఖ్యమైనది” అని ముఖ్యమంత్రి ట్వీట్ చేశారు.

ఇక మరో ట్వీట్‭లో ‘‘ఎల్జీ సర్, మీ పని ఢిల్లీలో శాంతిభద్రతలు సమీక్షించడం. ఢిల్లీ పోలసులతో పాటు

డీడీఏను సమర్థవంతంగా నడిపించడం. మా పని (ప్రభుత్వం) మిగిలిన అన్ని పనుల్ని చక్కదిద్దడం.

మీరు మీ పని సరిగా నిర్వర్తించండి. అలాగే మమ్మల్ని మా పని చేసుకోనివ్వండి.

అలా Arvind Kejriwal:  అయితేనే ఈ వ్యవస్థ నడుస్తుంది. కానీ మీరు మీ పని వదిలేసి, మా పనుల్లో తలదూర్చుతున్నారు.

అంతే కాకుండా మా పనులకు ఇబ్బందులు కలిగిస్తున్నారు. ఇలా అయితే వ్యవస్థ ఎలా నడుస్తుంది?’’ అని కేజ్రీవాల్ ప్రశ్నించారు.

అయితే ఢిల్లీ ప్రభుత్వ అధికారాలను పరిమితం చేస్తూ కేంద్రం తీసుకొచ్చిన ఆర్డినెన్స్ పై వివాదం చెలరేగిన నేపథ్యంలో ఢిల్లీ సీఎం ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం.

ఢిల్లీలోని రోహిణిలో 16 ఏళ్ల బాలికను ఆమె ప్రియుడు అతి కిరాతకంగా పొడిచి చంపాడు. నిందితుడిని సాహిల్ గా గుర్తించిన ఢిల్లీ పోలీసులు అరెస్టు చేశారు. ఐపీసీ సెక్షన్ 302 కింద షాబాద్ డెయిరీ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసినట్లు అధికారులు తెలిపారు.

మరోవైపు, దేశ రాజధాని మహిళలు, బాలికలకు అత్యంత అసురక్షితంగా మారిందని డీసీడబ్ల్యూ చీఫ్ స్వాతి మలివాల్ అన్నారు

. 16 ఏళ్ల బాలికను 40-50 సార్లు పొడిచి, ఆపై రాయితో పలుమార్లు కొట్టారని, ఆ తర్వాత ఆమె మరణించిందని చెప్పారు. ఇదంతా సీసీటీవీలో రికార్డయింది. ఇది చూసిన చాలా Arvind Kejriwal:  మంది పట్టించుకోలేదు. మహిళలు, బాలికలకు ఢిల్లీ అత్యంత అసురక్షితంగా మారింది. కేంద్ర హెచ్ఎం, ఢిల్లీ ఎల్జీ, డీసీడబ్ల్యూ చీఫ్, ఢిల్లీ సీఎంతో ఉన్నత స్థాయి సమావేశం ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాను’ అని మలివాల్ పేర్కొన్నారు.

Leave a Reply

Dimple Hayathi In Shankars Movie keerthi suresh