Lion Like Calf: ఇది చూడడానికి జనం క్యూ

Lion Like Calf

Lion Like Calf:సింహానికి జన్మనిచ్చిన ఆవు.. ఇది చూడడానికి జనం క్యూ

Lion Like Calf: ఆవు సింహం పిల్లకు జన్మనిచ్చిన ఘటన తీవ్ర కలకలం రేపింది. ఈ వింత ఘటనను చూసేందు జనం ఎగబడుతున్నారు. మధ్యప్రదేశ్‌లో  రైసెన్‌ జిల్లాలోని గూర్ఖా గ్రామంలో చోటు చేసుకుంది. నత్తులాల్‌ శిల్పాకర్‌ అనే రైతు ఆవు సింహం పిల్లను పోలిన దూడకు జన్మనిచ్చింది

దానికి గిట్టకు బదులుగా పంజా కనిపించడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. రెయిజెన్ జిల్లాలో జరిగిందీ ఘటన.  ఈ ఆవు దూడని చూసేందుకు పెద్ద ఎత్తున ప్రజలు తరలి వస్తున్నారు. ఇదో అద్భుతం అంటూ ఆశ్చర్యపోతున్నారు. ఉన్నట్టుండి గ్రామంలో అలజడి రేగడం అధికారుల దృష్టికి వెళ్లింది. వెంటనే ఆ ఆవు దూడని చూసేందుకు వచ్చారు. ఈ నమ్మశక్యం కానీ ఘటనతో వైద్యుల సైతం కంగుతిన్నారు. ఆవు గర్భాశయంలో లోపం కారణంగానే ఈ వింత సంభవించిందని పశుసంవర్ధక శాఖ పేర్కొంది. ఈ మేరకు పశువైద్యాధికారి ఎన్‌కే తివారీ మాట్లాడుతూ.. ఇది ప్రకృతి అద్భుతం కాదన్నారు. పిండం సరిగా అభివృద్ధి చెందకపోవడం వల్ల ఇలాంటి సమస్య ఎదురైందన్నారు. ఆవు గర్భంలో ఉన్న లోపం కారణంగానే ఇలాంటి దూడకు జన్మనిచ్చిందన్నారు.

Also Watch

AP: ఇంటర్మీడియట్ పరీక్షల్లో ఫెయిల్ కావడంతో

అయితే…పుట్టిన లేగదూడ ఓ అరగంట వరకూ ఆరోగ్యంగానే కనిపించింది. ఏమైందో తెలియదు కానీ ఉన్నట్టుండి చనిపోయింది. ఈ Lion Like Calf చూసేందుకు వేరే గ్రామాల ప్రజలు కూడా తరలి వస్తున్నారు. ఎందుకిలా జరిగిందన్నది ప్రస్తుతం అధికారులు ఇంకా వెల్లడించలేదు.

ఇటీవలే మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్‌లో ఓ శిశువు నాలుగు కాళ్లతో జన్మించింది. సోషల్ మీడియాలో ఈ శిశువు ఫోటోలు వైరల్ అయ్యాయి. కమలా రాజా విమెన్స్ అండ్ చైల్డ్ పీడియాట్రిక్స్ డిపార్ట్‌మెంట్‌లో ఈ శిశువు జన్మించింది. క్షణాల్లోనే ఈ వార్త వైరల్ అయిపోయింది. సికందర్ కాంపు ప్రాంతానికి చెందిన ఆర్తి కుశ్వాహా అనే మహిళకు…ఆడ శిశువు జన్మించినట్టు వైద్యులు చెప్పారు. బిడ్డ ఆరోగ్యంగా ఉందని వెల్లడించారు. 2.3 కిలోల బరువుతో జన్మించినట్టు తెలిపారు. ప్రసవం జరిగిన వెంటనే ప్రత్యేక వైద్యుల బృందం శిశువుని పరీక్షించింది. “పుట్టుకతోనే శిశువుకు నాలుగు కాళ్లున్నాయి. శారీరక వైకల్యం వల్లే ఇలా జరిగింది. సాధారణంగా…పిండం రెండుగా విడిపోయినప్పుడు కవలలు  పుడతారు. కానీ…ఇక్కడ ఒకే  పిండానికి అదనపు శరీర భాగాలు పెరిగాయి. అప్పుడప్పుడూ ఇలా జరుగుతూ ఉంటుంది. దీన్నే మెడికల్ సైన్స్‌లో ఇస్కియోపాగస్ అంటారు. నడుము కింది భాగంలో మరో రెండు కాళ్లు అదనంగా పుట్టుకొచ్చాయి. కానీ…అవి ప్రస్తుతానికి ఎట కదలడం లేదు” అని వైద్యులు స్పష్టం చేశారు. పిల్లల వైద్య నిపుణులు శిశువుని పూర్తి స్థాయిలో పరీక్షిస్తున్నారు.

 

Leave a Reply

Dimple Hayathi In Shankars Movie keerthi suresh