టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇవ్వబోతున్న ఏపీ మంత్రి ..

AP Minister Vidadala Rajini to enter Tollywood

టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇవ్వబోతున్న ఏపీ మంత్రి ..

సినిమాల నుంచి రాజ‌కీయాల్లోకి రంగ ప్ర‌వేశం చేసి చ‌క్రం తిప్పినవారి గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. ఒక‌ప్ప‌టితో పోల్చితే ఇప్పుడు ఈ దూరం మ‌రింత త‌గ్గింద‌నే చెప్పాలి. అలాగే రాజ‌కీయ నాయ‌కుల్లో సైతం సినీ రంగంలోకి అడుగు పెట్టిన వారు లేక‌పోలేదు. కొంద‌రు ఒక‌టి అరా పాత్ర‌ల్లోనూ న‌టించిన సందర్భాలు  కూడా వున్నాయి. కొంద‌రైతే నిర్మాత‌లుగా మారారు. మ‌రి కొంద‌రి రాజ‌కీయ నాయ‌కుల‌కైతే తెర వెనుక ఉండి నిర్మాణ బాధ్య‌త‌ల‌ను ప‌ర్య‌వేక్షించార‌నే పేరు కూడా లేక‌పోలేదు. కాగా రెండో కేట‌గిరి అయిన రాజ‌కీయాల నుంచి సినీ రంగంలోకి అడుగు పెడుతున్న వారిలో ఆంధ్ర ప్ర‌దేశ్ మంత్రి ఒక‌రు జాయిన్ కాబోతున్నారు. ఆ విషయం

సోష‌ల్ మీడియాలో ఏపీ మంత్రి ఒక‌రు సినీ రంగ ప్ర‌వేశం చేయ‌బోతున్నార‌నే వార్త‌లు తెగ చ‌క్క‌ర్లు కొడుతున్నాయి. ఇంత‌కీ ఆ మంత్రి ఎవ‌రో కాదు.. వైద్య ఆరోగ్య శాఖా మంత్రి అయిన విడ‌ద‌ల ర‌జిని. దీనిపై అధికారిక ప్ర‌క‌ట‌న రాలేదు. అయితే సినీ స‌ర్కిల్స్‌లో వినిపిస్తోన్న గుస‌గుస‌ల మేర‌కు టాలీవుడ్ నిర్మాణ రంగంపై విడద‌ల ర‌జిని ప్ర‌త్యేకంగా దృష్టి పెట్టారు. ఓ నిర్మాణ సంస్థ‌ను కూడా  స్థాపించార‌ట‌. హైద‌రాబాద్‌లో క‌థా చ‌ర్చ‌లు చేయ‌టానికి ఆఫీసుని కూడా తీసుకున్నార‌నే వార్త‌లుకూడా వినిపిస్తున్నాయి.  మరో వైపు విడద‌ల అయిన  ర‌జిని బ్యాన‌ర్‌లో ఇప్ప‌టికే ఓ క‌థ‌ను తెర‌కెక్కించ‌టానికి రంగం సిద్ధ‌మైంద‌ని స‌మాచారం. ఈ సినిమాను ఎవ‌రు డైరెక్ట్ చేస్తారు. అందులో హీరో, హీరోయిన్లు ఎవ‌రు? అనే విష‌యాల‌కు సంబంధించి త్వ‌ర‌లోనే అధికారిక ప్ర‌క‌ట‌న ఉంటుందని టాక్‌. అయితే ఏపీ మినిష్ట‌ర్ త‌న పేరుని అధికారికంగా ప్ర‌క‌టిస్తారో లేక వెన‌కుండి చ‌క్రం తిప్పుతారో మ‌రి వేచి. .

చిల‌క‌లూరి పేట నియోజ‌క వ‌ర్గం నుంచి  ర‌జిని 2014లో తెలుగు దేశం పార్టీ త‌ర‌పున‌ త‌న రాజ‌కీయ జీవితాన్ని ఆరంభించారు. అయితే త‌ర్వాత జ‌రిగిన రాజ‌కీయ ప‌రిణామాల‌తో వైసీపీ పార్టీలో జాయిన్ అయ్యారు. 2019లో ఎమ్మెల్యేగా విజ‌యం సాధించారు. ఇటీవ‌ల ఏపీలో జ‌రిగిన మంత్రి వ‌ర్గ పునః వ్య‌వ‌స్థీక‌ర‌ణ‌లో విడద‌ల ర‌జినీకి వైద్య, ఆరోగ్య శాఖా మంత్రి పదవి భాద్యతలు చేపట్టింది.

ఇది కూడా చదవండి :

Leave a Reply

Dimple Hayathi In Shankars Movie keerthi suresh