సినీ పరిశ్రమలో మరో విషాదం ప్రముఖ నటి ఆత్మహత్య

Akanksha Dubey Suicide: సినీ పరిశ్రమలో మరో విషాదం ప్రముఖ నటి ఆత్మహత్య

ఈ మధ్యకాలంలో వరుసగా సినిమా ఇండస్ట్రీలో విషాదాలు చోటుచేసుకుంటున్నాయి. పలువురు ఆకస్మికంగా మృతిచెందుతూ అభిమానులకు షాక్ ఇస్తున్నారు. తాజాగా ఓ హీరోయిన్ ఆత్మహత్య చేసుకున్న ఘటన కలకలం రేపుతోంది. భోజ్‌పురి నటి ఆకాంక్ష దూబే సూసైడ్‌కు పాల్పడింది. అతి చిన్న వయసులోనే ఆమె మృతి అభిమానుల్లో తీవ్ర విషాదం నింపింది. ఆకాంక్ష వయసు 25సంవత్సరాలు ప్రస్తుతం ఆకాంక్ష ఓ సినిమా షూటింగ్ నిమిత్తం వారణాసిలో ఉంది.ఈ రోజు (ఆదివారం) వారణాసిలోని ఓ హోటల్‌లో నటి మృతదేహం లభ్యమైంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. నివేదికల ప్రకారం, ఆకాంక్ష దూబే వారణాసిలో ఓ హోటల్ గదిలో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. రాత్రి షూటింగ్ ముగించుకుని ఆమె హోటల్‌కు చేరుకుందని చెబుతున్నారు.

ఆకాంక్ష దూబే 21 అక్టోబర్ 1997న ఉత్తరప్రదేశ్‌లోని మీర్జాపూర్‌లో జన్మించింది. ఆకాంక్ష ఇన్‌స్టాగ్రామ్‌లో చాలా యాక్టివ్‌గా ఉండేది. ఆమెకు డ్యాన్స్ అంటే చాలా ఇష్టమని తెలుస్తుంది. ఇన్‌స్టాలో ఆకాంక్ష దూబేకి దాదాపు 17 లక్షల మంది ఫాలోవర్లు ఉన్నారు.

అయితే శనివారం రాత్రి పాటను స్వయంగా తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో తన వీడియోను షేర్ చేసింది ఆకాంక్ష. ఒక నెల క్రితం, నటి ప్రేమికుల రోజున ఇన్‌స్టాగ్రామ్‌లో అధికారికంగా వార్తలను షేర్ చేసింది.  సహనటుడు సమర్‌సింగ్‌తో కలిసి ఫోటోలను షేర్ చేసింది. హ్యాపీ వాలెంటైన్స్ డే’ అని పోస్టు చేసింది. దీంతో ఆమె మృతికి ప్రేమ వ్యవహారమే కారణమా అనే అనుమానం వ్యక్తమవుతోంది. ఆకాంక్ష అక్టోబర్ 21, 1997న ఉత్తరప్రదేశ్‌లోని మీర్జాపూర్‌లో జన్మించింది. చిన్నప్పటి నుంచి డ్యాన్స్‌, యాక్టింగ్‌ అంటే ఆమెకు ఎంతో ఇష్టం. టిక్‌టాక్ , ఇన్‌స్టాగ్రామ్‌లో వైరల్ అయిన తన డ్యాన్స్ , యాక్టింగ్ వీడియోలను పంచుకోవడం ద్వారా ఆమె సినిమాల్లో నటించే అవకాశాలు అందుకుంది.

అలాగే వీడియో పాటలతో పాటు, ఆకాంక్ష దూబే పలు భోజ్‌పురి చిత్రాలలో నటించింది. మేరీ జంగ్ మేరా ఫైస్లా చిత్రంతో ఆకాంక్ష తన సినీ జీవితాన్ని ప్రారంభించింది. అనంతరం వరసగా అవకాశాలు అందుకుంది. భోజ్‌పురిలో ముజ్సే షాదీ కరోగి, వీరన్ కే వీర్, ఫైటర్ కింగ్ వంటి చిత్రాల్లో నటించింది ఆకాంక్ష.

𝐀𝐤𝐚𝐧𝐤𝐬𝐡𝐚 𝐃𝐮𝐛𝐞𝐲 (@akankshadubey_official) • Instagram photos and videos

 

 

.

Leave a Reply