మరోసారి అప్పు తెచ్చిన ఏపీ ప్రభుత్వం ఎన్ని కోట్లు అంటే ?

AP GOVERNMENT BROUGHT DEBT ONCE AGAIN

AP Govt :మరోసారి అప్పు తెచ్చిన ఏపీ ప్రభుత్వం ఎన్ని కోట్లు అంటే ?

ఏపీ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మరి అప్పులకుప్పగా మారుతోంది. మంగవారం రోజు రిజర్వ్ బ్యాంకు నుంచి ఏపీ ప్రభుత్వం మరో రూ.958 కోట్లు అప్పు తెచ్చింది. 7.70 శాతం వడ్డీతో ఆరేళ్లకు బాండ్ల వేలం ద్వారా ఈ రుణం తీసుకుంది. ఇటీవల ఎఫ్ఆర్బీఎం కింద నాలుగోసారి అప్పు తెచ్చుకునేందుకు కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఈ రోజు తీసుకున్న అప్పుతో ఎఫ్ఆర్బీఎం కింద ఇచ్చిన అనుమతి మొత్తం పూర్తి అయిపోయింది. ఈ సంవత్సరంలో నాలుగుసార్లు ఇచ్చిన రుణం, నాబార్డు, లిక్కర్ బాండ్లతో కలుపుకొని రూ. 87,758 కోట్లను ఏపీ ప్రభుత్వం అప్పు చేసినట్టయ్యింది.

కాగా ఇటీవల పార్లమెంట్‌ సాక్షిగా ఏపీ అప్పులను కేంద్రం మరోసారి బయటపెట్టింది. 2023 బడ్జెట్‌ అంచనాల ప్రకారం ఏపీ అప్పులు రూ. 4,42,442 కోట్లుగా ఉన్నట్లు పేర్కొంది. రాజ్యసభలో ఎంపీ కనకమేడల ప్రశ్నకు కేంద్రం ఈ సమాధానం చెప్పింది. కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. బడ్జెట్‌లో అప్పులకు తోడు కార్పొరేషన్లు, ఇతర మార్గాల్లో అప్పులు అదనంగా ఉన్నాయని కేంద్రం వెల్లడించింది. ఇప్పటికే ఏపీ అప్పులు రూ.10 లక్షల కోట్లకు చేరాయని విపక్షాల విమర్శలు చేస్తున్నాయి. ‘‘2019లో రాష్ట్ర అప్పులు రూ.2,64,451 కోట్లు ఉండగా 2020లో రూ.3,07,671 కోట్లు, 2021లో రూ.3,53,021 కోట్లు, 2022 సవరించిన అంచనాల తర్వాత రూ.3,93,718 కోట్లు, 2023 బడ్జెట్ అంచనాల ప్రకారం ప్రస్తుత ఏపీ అప్పు రూ.4,42,442 కోట్లుగా ఉంది. సుమారు రూ.45 వేల కోట్ల అప్పులు చేస్తోందని పంకజ్ చౌదరి వెల్లడించారు.

ఇది కూడా చదవండి :

Leave a Reply

Dimple Hayathi In Shankars Movie keerthi suresh