ట్రెండీ వేర్స్ లో పిచ్చికేస్తున్న కాజల్ అగర్వాల్

సెకండ్ ఇన్నింగ్స్ ను  ప్రారంబించిన కాజల్

టాలీవుడ్ బ్యూటీ  కాజల్ అగర్వాల్ ప్రస్తుతం సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించింది. బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో ఫ్యాన్స్ ను అలరించేందుకు సిద్ధం అవుతోంది. ఏదేమైనా కాజల్ మంచి కేరీర్ లో స్పీడ్ పెంచుతోంది.  ఈ భామ నటిస్తోన్న తమిళ చిత్రం ఘోస్టీ కల్యాణ్‌ కథనందిస్తూ దర్శకత్వం వహిస్తున్నాడు. ఉగాది పండుగ సందర్భంగా తెలుగులో మార్చి 22న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ మూవీని తెలుగులో గంగా ఎంటర్‌టైన్‌మెంట్స్‌ సమర్పిస్తోంది. తెలుగు, తమిళ భాషల్లో వస్తున్న ఈ చిత్రంలో రాధికా శరత్‌ కుమార్‌, యోగి బాబు, కేఎస్‌ రవికుమార్‌, ఊర్వశి, మనోబాల, సంతాన భారతి, సత్యన్‌, స్వామినాథన్, జగన్‌ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. సీడ్‌ పిక్చర్స్ బ్యానర్‌పై తెరకెక్కుతున్న ఈ చిత్రంలో కాజల్‌ డ్యుయల్‌ రోల్‌లో కనిపించనుంది. హార్రర్‌ కామెడీ డ్రామా నేపథ్యంలో తెరకెక్కుతోన్న ఈ మూవీకి శ్యామ్‌ సీఎస్‌ సంగీతం అందిస్తున్నాడు.

ఈ సందర్భంగా నెట్టింట వరుస పోస్టులతో సందడి చేస్తోంది. దక్షిణాది ప్రేక్షకుల్లో ఎంతో క్రేజ్ దక్కించుకున్న కాజల్ అగర్వాల్ వ్యాపారవేత్త అయిన గౌతమ్ కిచ్లును 2020 అక్టోబర్ 30న పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. గతేడాది ఏప్రిల్ 19న పండంటి మంగబిడ్డకు జన్మనిచ్చింది. పెళ్లి, ప్రెగ్నెన్సీ కారణంగా సినిమాలకు కాస్తా దూరమైంది. ప్రస్తుతం సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించిన స్టార్ హీరోయిన్ భారీ చిత్రాల్లో నటిస్తోంది. కమల్ హాసన్ ‘ఇండియన్ 2’లో నటిస్తూనే మరోవైపు తమిళ చిత్రాల్లోనూ వరుస నటిస్తోంది. మరోవైపు బాలయ్య ‘ఎన్బీకే 108’లో అవకాశం అందుకుందని అంటున్నారు. చెక్కుచెదరని అందంతో అదిరిపోయే అవుట్ ఫిట్లలో స్టన్నింగ్ గా ఫొటోషూట్లు చేస్తూ వస్తోంది.

తాజాగా ట్రెండీ వేర్స్ లో మతులు పోగొట్టింది. హాట్ సిట్టింగ్ ఫోజులతో స్టార్ హీరోయిన్ ఉక్కిరిబిక్కిరి చేసింది. కంబ్యాక్ ఇస్తున్న సందర్భంగా కాజల్ నెట్టింట రచ్చ చేస్తోంది. మైండ్ బ్లోయింగ్ గా ఫొటోషూట్లు చేస్తూ గ్లామర్ ఫొటోలతో ఫ్యాన్స్ తో పాటు నెటిజన్లను ఖుషీ చేస్తోంది. కాజల్ బ్యూటీఫుల్ లుక్స్ తో ఫాన్స్ ఫిధా అవు న్నారు. దీంతో ఫొటోలను లైక్స్, కామెంట్లతో నెట్టింట వైరల్ చేస్తున్నారు. ప్రభుదేవా ‘గులేబకావళి’, జ్యోతిక ‘జాక్ పాట్’ చిత్రాలతో తెలుగు ప్రేక్షకులను సైతం ఆయన ఆకట్టుకున్న ఆయన ఈ సినిమాతో ఎలా అలరించబోతున్నారో  వేచి చూడాలి మరి.

 

Leave a Reply

Dimple Hayathi In Shankars Movie keerthi suresh