కాంగో పడవ ప్రమాదంలో 145 మంది దుర్మరణం

145 people feared dead Congo boat accident, Boat Accident, 145 People Dead, DR Congo boat sinks, DR Congo boat sinks, Latest Telugu News

వాయువ్య డెమొక్రాటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగోలోని నదిలో రాత్రిపూట వస్తువులు మరియు జంతువులతో ఓవర్‌లోడ్ చేయబడిన మోటరైజ్డ్ పడవ మునిగిపోయింది. ఈ ఘటనలో కనీసం 145 మంది ప్రయాణికులు మరణించినట్లు తెలుస్తుంది. కాగా ఈ పడవలో సుమారు 200 మంది ప్రయాణిస్తుండగా వారిలో 145 మంది ప్రయాణికులు మరణించి నట్లు మిగిలిన 55 మంది ప్రాణాలతో బయటపడ్డారని అధికారులు తెలిపారు.

కాగా ఈ ఘటన పై ఆ ప్రాంతంలోని సివిల్ సొసైటీ గ్రూపుల అధ్యక్షుడు జీన్-పియర్ వాగ్యులా విలేకరులతో మాట్లాడుతూ రిపబ్లిక్ ఆఫ్ కాంగో వెళ్తున్న పడవ బసంకుసు పట్టణానికి సమీపంలో లులోంగా నదిలో బోల్తా పడిందిని పేర్కొన్నారు. పడవ మునిగి పోవడానికి ఓవర్‌లోడ్ ప్రధాన కారణమని, ఈ ఘటనలో 55 మంది ఇప్పటి వరకు ప్రాణాలతో బయటపడ్డారని,  కనీసం 145 మంది ఆచూకి ఇంక తెలియరాలేదని తెలిపారు.

ఇవి కూడా చదవండి:  

Leave a Reply

Dimple Hayathi In Shankars Movie keerthi suresh