హోలీ శుభాకాంక్షలు తెలిపిన మెగాస్టార్ అల్లుడు కళ్యాణ్ దేవ్

Megastar's son-in-law Kalyan Dev wishes on Holi

 Megastar :హోలీ శుభాకాంక్షలు తెలిపిన మెగాస్టార్ అల్లుడు కళ్యాణ్ దేవ్

మెగాస్టార్ చిరంజీవి అల్లుడు కళ్యాణ్ దేవ్ హోలీ పండగ శుభాకాంక్షలు తెలిపారు. ఈ నేపద్యం లో  సరికొత్త వాదన వినిపిస్తుంది. కళ్యాణ్ దేవ్ భార్య శ్రీజాకు దూరంగా ఉంటున్న విషయం తెలిసిందే. అధికారికంగా విడాకులు ప్రకటించనుకున్నప్పటికీ విడిపోయారన్న మాట వాస్తవమేనని, విశ్వసనీయ వర్గాల సమచారం. ఈ వాదన బలపరిచే విధంగా పరిస్థితులు ఉన్నాయి. శ్రీజ-కళ్యాణ్ దేవ్ కలిసి కనిపించి ఏడాది దాటిపోయింది. ఇక వీరిద్దరి సోషల్ మీడియా పోస్ట్స్ విడాకుల మేటర్ ధృవీకరిస్తున్నాయి. కళ్యాణ్ దేవ్ కూతురు నవిష్క శ్రీజా వద్దే పెరుగుతుంది. ఈ క్రమంలో కూతురుని తలచుకుని కళ్యాణ్ దేవ్ ఎమోషనల్ పోస్ట్స్ పెడుతుంటారు. ఆమెను బాగా మిస్ అవుతున్నట్లు తెలిపే పోస్ట్స్ చేస్తుంటారు.

అయితే పండగ వేళ కళ్యాణ్ దేవ్ చాలా జోష్ ఫుల్ గా కనిపించారు. హోలీ వేడుకల్లో పాల్గొన్న ఆయన అభిమానులు, మిత్రులకు హోలీ శుభాకాంక్షలు తెలియజేశారు. దీంతో కళ్యాణ్ దేవ్ విషయంలో ఆల్ ఈజ్ వెల్ అన్న వాదన వినిపిస్తోంది. ఆయన విడాకుల డిప్రెషన్ నుండి బయటకు వచ్చారని, అందుకే పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తూ సోషల్ మీడియా పోస్ట్ పెట్టారని పరిశ్రమల వర్గాల అంచనా అది ఇరువురికీ మంచిదే కాబట్టి ఆల్ హ్యాపీ అని చొప్పొచ్చు.

ఇటీవల శ్రీజా-కళ్యాణ్ దేవ్ సోషల్ మీడియా వేదికగా గొడవకు దిగారు వాలెంటైన్స్ డే నాడు వారి సోషల్ మీడియా పోస్ట్స్ అతిపెద్ద చర్చలు దారితీశాయి. కళ్యాణ్ దేవ్ ఒకరిని ఎంత ఇష్టపడ్డాం అనేది కాదు  ఎలా ట్రీట్ చేశాం అనేది ముఖ్యం  అని ఇంస్టాగ్రామ్ స్టేటస్ పోస్ట్ చేశాడు. దానికి కౌంటర్ గా శ్రీజా ఒకరి ప్రేమించడం అంటే అర్థం మిమ్మల్ని ఎక్కువగా ప్రేమించేలా చేసుకోవడం కాదు  తమని తాము ఎక్కువగా ప్రేమించబడేలా చేయాలి. ప్రేమను గుర్తించాలి. ప్రతిచోటా దాని కోసం వెతక కూడదు  అని శ్రీజా ఇంస్టాగ్రామ్ స్టేటస్ లో కామెంట్ పెట్టారు. కళ్యాణ్ దేవ్ సందేశం ప్రకారం  శ్రీజా తన పట్ల సరిగా వ్యవహరించలేదు. గౌరవం ఇవ్వలేదని పరోక్షంగా చెబుతున్నాడు. దానికి సమాధానం చెబుతున్నట్లు శ్రీజా పోస్ట్ ఉంది. నా ప్రేమను గుర్తించలేకపోయావు  ప్రతి విషయంలో నన్ను ప్రేమించడం లేదని విమర్శించావని చెబుతున్నట్లుగా ఉంది. వారి మధ్య విభేదాలకు కొనసాగుతున్నాయని సోషల్ మీడియా పోస్ట్స్ ఒకింత స్పష్టత ఇచ్చాయి. కాగా శ్రీజా మూడో వివాహం చేసుకోబోతున్నారన్న ప్రచారం జరిగింది. అలాగే కళ్యాణ్ దేవ్ కూడా బంధువుల అమ్మాయితో వివాహానికి సిద్ధం అవుతున్నారని పుకార్లు వినిపించాయి. కాగా 2016లో చిరంజీవి చిన్న కుమార్తె శ్రీజ కళ్యాణ్ దేవ్ ని వివాహం చేసుకున్నారు. శ్రీజకు ఇది రెండో వివాహం. అలాగే చిరంజీవి అల్లుడి హోదాలో కళ్యాణ్ దేవ్ హీరోగా మారాడు.

ఆయన మొదటి చిత్రం విజేత ఓ మోస్తరు విజయాన్ని నమోదు చేసింది. అనంతరం సూపర్ మచ్చి, కిన్నెరసాని చిత్రాల్లో కళ్యాణ్ దేవ్ నటించారు.

Kalyaan Dhev (@kalyaan_dhev) • Instagram photos and videos

ఇది కూడా చదవండి :

Leave a Reply

Dimple Hayathi In Shankars Movie keerthi suresh