NTR: నేడు తెలంగాణలో ఎన్టీఆర్ శత జయంతి వేడుకలు

NTR: నేడు తెలంగాణలో ఎన్టీఆర్ శత జయంతి వేడుకలు

NTR: ఎన్టీఆర్ శత జయంతి వేడుకలు నేడు హైదరాబాద్‌లోని కైత్లాపూర్ మైదానంలో జరగనున్నాయి. ఈ సందర్భంగా ప్రత్యేకంగా 10 ఎకరాల విస్తీర్ణంలో భారీ సభా ప్రాంగణాన్ని నిర్మించారు.

ఈరోజు ఈ వేడుకలు సాయంత్రం 5 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు జరగనున్నాయి.

ఈ కార్యక్రమానికి గౌరవ అతిథి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుతో  పాటు నందమూరి బాలకృష్ణ, హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ, మురళీ మోహన్, డి. రాజా, సీతారాం ఏచూరి, పురందేశ్వరి, విక్టరీ వెంకటేష్, ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్, అల్లు అర్జున్, ప్రభాస్, రానా వంటి సుప్రసిద్ధ వ్యక్తుల సంఖ్య.

సుమన్, జయప్రద, మరియు కె. రాఘవేంద్రరావు హాజరుకానున్నారు.

Also Watch

Jr NTR: జూనియర్ ఎన్టీఆర్‌కు శుభాకాంక్షలు తెలిపిన ప్రముఖులు

అలాగే ఎన్టీఆర్‌ సినీ, రాజకీయ జీవితానికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు, సమగ్ర విశేషాలతో రూపొందించిన ‘జై ఎన్టీఆర్‌’ వెబ్‌సైట్‌ను కూడా ప్రారంభిస్తున్నారు.

ఎన్టీఆర్‌ ఉపన్యాసాలను ఇందులో జోడిస్తున్నారు. ఎన్టీఆర్ శత జయంతి కమిటీ ఆధ్వర్యంలో తొలి సభను శత జయంతి కమిటీ విజయవాడలో నిర్వహించారు.

రెండో సభను హైదరాబాద్‌లో పెట్టారు. ఎన్టీఆర్‌ అభిమానులు పెద్దసంఖ్యలో హాజరై ఈ సభను విజయవంతం చేయాలని నిర్వాహణ కమిటీ విజ్ఞప్తి చేసింది.

తెలుగు జాతి ఖ్యాతిని విశ్వవ్యాప్తంగా చాటి చెప్పిన ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాలను ఇవాళ ఘనంగా నిర్వహిస్తున్నట్లు మురళీ మోహన్ తెలిపారు.

మురళి మోహన్ గారు మాట్లాడుతూ గత సంవత్సరం మే28న ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాలు ప్రపంచ వ్యాప్తంగా ప్రారంభమయ్యాయి. పుణ్య పురుషులను మనం అరుదుగా చూస్తుంటాం.

అలాంటి పుణ్య పురుషుడు ఎన్టీఆర్. ఎన్టీఆర్ లాంటి పురుషుడు కోటికి ఒకరు పుడతారు. కంచుకోట లాంటి కాంగ్రెస్ పార్టీని ఓడించి 9 నెలల్లో టీడీపీని అధికారంలోకి తెచ్చిన ఘనత ఎన్టీఆర్ ది.

అయితే ఈ నెల 28వ తేదీ లోపు నందమూరి తారక రామారావుకు భారతరత్న అవార్డును బహూకరించాలని ప్రధానమంత్రిని ఇదే వేదిక నుంచి డిమాండ్ చేయబోతున్నామని తెలియజేశారు.

తెలుగు రాష్ట్రాలతో పాటు ప్రపంచ వ్యాప్తంగా ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాలు నిర్వహించుకుంటున్నాం. సూర్య చంద్రులు ఉన్నంతవరకు ఎన్టీఆర్ పేరు ఉంటుంది.

ఎన్టీఆర్ చరిత్ర గురించి ప్రత్యేక వెబ్ సైట్స్ రూపొందించాం. 500 పేజీల ప్రత్యేక సావనీర్ ఆవిష్కరించనున్నాం. ఎన్టీఆర్ పేరుతో ప్రత్యేక యాప్ ను లోకేశ్ ఆవిష్కరిస్తారు.

ఎన్టీఆర్ కుటుంబ సభ్యులను ఘనంగా సన్మానించనున్నాం అని  టీడీ జనార్దన్ తెలిపారు.

One thought on “NTR: నేడు తెలంగాణలో ఎన్టీఆర్ శత జయంతి వేడుకలు

Leave a Reply

Dimple Hayathi In Shankars Movie keerthi suresh