రేపు ప్రారంభం కానున్న సికింద్రాబాద్-తిరుపతి వందేభారత్ ఎక్స్ ప్రెస్

దేశంలో త్వరలో భారతీయ రైల్వే 13 వందే భారత్ రైళ్లను నడపనుంది. సెమీ హైస్పీడ్ రైలు రూట్ల జాబితాలో సికింద్రాబాద్-తిరుపతి రూట్ కరారు కావడంతో, రేపు (ఏప్రిల్ 8)  ప్రధాని నరేంద్ర మోడీ న సికింద్రాబాద్-తిరుపతి మార్గంలో ఈ రైలును జెండా ఊపి ప్రారంభించనున్నారు. ఇప్పటికే భోపాల్-న్యూఢిల్లీ మార్గంలో వందే భారత్ ను ప్రధాని జెండా ఊపి ప్రారంభించిన వారం తర్వాత మరో కొత్త మార్గంలో రైలు ప్రారంభోత్సవం జరగనుంది. ఈ కొత్త రైలుతో పాటు, చెన్నై-కోయంబత్తూరు మార్గంలో దక్షిణ భారతదేశంలో రెండవ వందే భారత్ ను ప్రధాని జెండా ఊపి ప్రారంభిస్తారు. ఈ కొత్త రైళ్లు భారతదేశంలోని అధునాతన రైళ్లలో 12 మరియు 13 వ యూనిట్లు.

కాగా సికింద్రాబాద్-తిరుపతి వందేభారత్ ఎక్స్ప్రెస్ నల్గొండ, గుంటూరు, ఒంగోలు, నెల్లూరు స్టేషన్లలో ఆగుతుంది, నగరాల మధ్య 660 కిలోమీటర్ల ప్రయాణాన్ని కవర్ చేస్తుంది. అయితే మొదటి రోజు మాత్రం రైలు మార్గం కొంచం  భిన్నంగా ఉంటుంది. ఈ మార్గంలో మొదటి రైలు నల్గొండ, మిర్యాలగూడ, పిడుగురాళ్ల, గుంటూరు, తెనాలి, బాపట్ల, చీరాల, ఒంగోలు, నెల్లూరు, గూడూరు స్టేషన్లలో ఆగుతుంది. సికింద్రాబాద్ నుంచి తిరుపతి వందే భారత్ ఎక్స్ ప్రెస్ టికెట్ ధర ఇంకా అఫీషియల్ కన్ఫర్మేషన్ లేదని, రూ.1000-1500 వరకు ఉండొచ్చని అంచనా వేస్తున్నారు.

సికింద్రాబాద్ నుంచి తిరుపతి వందేభారత్ ఎక్స్ ప్రెస్ ను ఈ నెల 8న సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ నుంచి ప్రధాని నరేంద్ర మోదీ జెండా ఊపి ప్రారంభిస్తారని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. వందే భారత్ ఎక్స్ ప్రెస్ గర్వానికి, సౌకర్యానికి, కనెక్టివిటీకి పర్యాయపదమని కిషన్ రెడ్డి ట్వీట్ ను ప్రధాని పేర్కొన్నారు.

‘వందే భారత్ ఎక్స్ప్రెస్ గర్వం, సౌకర్యం, కనెక్టివిటీకి పర్యాయపదం. సికింద్రాబాద్-తిరుపతి మధ్య నడిచే ఈ రైలు పర్యాటక రంగానికి, ముఖ్యంగా ఆధ్యాత్మిక పర్యాటకానికి ఎంతో మేలు చేస్తుంది. ఇది ఆర్థిక వృద్ధికి కూడా ఊతమిస్తుంది’ అని ప్రధాని మోదీ పేర్కొన్నారు.

 

Leave a Reply

Dimple Hayathi In Shankars Movie keerthi suresh