ప్రముఖ సంగీత దర్శకుడు రామ్‌లక్ష్మణ్‌ ఇకలేరు

ప్రముఖ దిగ్గజ సంగీత దర్శకుడు రామ్‌ లక్ష్మణ్‌ (78) కన్నుమూశారు. గుండెపోటుతో ఆయన శనివారం నాగ్‌పూర్‌లో తుదిశ్వాస విడిచారు. దిగ్గజ సంగీత దర్శకుడు కన్నుమూయడంతో బాలీవుడ్‌ ఒక్కసారిగా షాక్‌కి గురయ్యింది. తీవ్ర దిగ్ర్భాంతికి లోనయ్యింది.  ​శుక్రవారం అర్థరాత్రి దాటాక రెండు గంటల సమయంలో గుండెపోటుతో ఆయన మృతి చెందినట్లు ఆయన కుమారుడు అమర్‌ తెలిపాడు. కొన్నిరోజుల క్రితం రామ్‌ లక్ష్మణ్‌ వ్యాక్సిన్‌ వేయించుకున్నారని, ఆ తర్వాత అస్వస్థతకు గురయ్యారని, ట్రీట్‌మెంట్‌ కొనసాగుతుండగానే గుండెపోటుతో చనిపోయినట్లు అమర్ మీడియాకు వెల్లడించాడు.

సోమవారం ఉదయం రాజ్‌ అంతిమ యాత్ర ప్రారంభమైంది. కూకట్‌పల్లి హౌసింగ్‌ బోర్డు నుంచి మహాప్రస్థానం వరకు ఈ అంతిమయాత్ర కొనసాగింది. మహా ప్రస్థానంలో కోటి ,శివాజిరాజా , కాశీ విశ్వనాథ్ , జయంత్ , నల్లమల్లపు బుజ్జి తదితరులు రాజ్ మృతదేహాన్ని సందర్శించి ఆయనకు నివాళులు అర్పించారు. కాసేపటి క్రితమే మహాప్రస్థానంలో రాజ్‌ అంత్యక్రియలు ముగిశాయి. రాజ్‌ పెద్దల్లుడు కృష్ణంరాజు ఆయన అంతిమ సంస్కారాలు నిర్వహించారు. కాగా రాజ్‌తో సుమారు 180కు సినిమాలకు పనిచేసిన కోటి మిత్రుడి భౌతికకాయాన్ని చూసి తట్టుకోలేకపోయారు. చివరిచూపు చూసుకొని కన్నీరుపెట్టుకున్నారు.

ఆయన `మైనే ప్యార్‌ కీయా`, `హమ్‌ ఆప్‌కే కౌన్`‌, `హమ్‌ సాథ్‌ సాథ్‌ హై`, `100 డేస్‌` లాంటి సూపర్‌ హిట్‌ బాలీవుడ్‌ సినిమాలకు అత్యద్భుతమైన పాటలను అందించారు. రామ్‌ లక్ష్మణ్‌ పాటలు సినిమా విజయాల్లో కీలక భూమిక పోషించాయంటే అతిశయోక్తి కాదు. ఎన్నో మ్యూజికల్‌ హిట్స్ అందించారు. తొంభై దశకంలో అద్భుతమైన పాటలు అందించిన రామ్‌ లక్ష్మణ్‌ అసలు పేరు విజయ్‌ పాటిల్‌.  సల్మాన్‌ ఖాన్‌, షారూఖ్‌, ఇలా స్టార్‌ హీరోల సినిమాలకు సంగీతం అందించారు. ఆయా చిత్రాల్లో సక్సెస్‌లో భాగమయ్యాయి. రామ్‌ లక్ష్మణ్‌ సంగీతం అందించారంటే సినిమా సక్సెసే అనేంతగా బాలీవుడ్‌లో ముద్ర పడింది. వినసొంపైన సంగీతం శ్రోతలను ఉర్రూతలూగించారాయన.

రాజ్‌ అసలు పేరు తోటకూర సోమరాజు. ఆయనకు భార్య, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. అలనాటి సంగీత దర్శకుడు టీవీరాజు కుమారుడే రాజ్‌. .ప్రళయగర్జన సినిమాతో సినీ సంగీత ప్రస్థానం ప్రారంభించిన రాజ్‌ మరో మ్యూజిక్‌ డైరెక్టర్‌ కోటితో కలిసి ఎన్నో మరుపురాని పాటలు అందించారు. ప్రధానంగా 90వ దశకంలో తమ సంగీతంతో ఒక ఊపు ఊపేశారు రాజ్‌ కోటి.వీళ్లిద్దరూ కలిసి 180కి పైగా సినిమాలకు సంగీతం అందించారు.అయితే అనుకోని పరిస్థితుల్లో కోటి నుంచి విడిపోయిన రాజ్‌ సొంతంగా పది సినిమాలకు సంగీతం అందించారు.

Leave a Reply

Dimple Hayathi In Shankars Movie keerthi suresh