సినీ పరిశ్రమలో మరో విషాదం

చలనచిత్ర పరిశ్రమలో మరో విషాదం చోటు చేసుకుంది.ప్రముఖ టీవీ నటుడు నీతేష్ పాండే కన్నుమూశారు. ఆయన వయస్సు 51 సంవత్సరాలు.ఆయనకు భార్య అర్పిత పాండే ఉన్నారు. . మహారాష్ట్రలోని నాసిక్‌లో గత రాత్రి షూటింగ్‌ ముగించుకుని హోటల్‌లో విశ్రాంతి తీసుకున్న నితీశ్‌ విగతజీవిగా కనిపించారు. అయితే ఆయన గుండెపోటుతో మరణించి ఉండవచ్చని భావిస్తున్నారు పోలీసులు.  ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని విచారణ ప్రారంభించారు. కాగా ఆయన మృతి పట్ల పలువురు సెలబ్రిటీలు విచారం వ్యక్తం చేస్తున్నారు.

అయితే నితేశ్‌ మరణవార్తపై ఆయన బంధువు, నిర్మాత సిద్దార్థ్‌ నగర్‌ స్పందిస్తూ ‘అవును, ఆయన మనల్ని వదిలి వెళ్లిపోయారు. నా సోదరి అర్పిత పాండే(నితేశ్‌ భార్య) షాక్‌లో ఉంది. ఆమెతో పాటు నితేశ్‌ తండ్రి కూడా మధ్యాహ్నంకల్లా ఇక్కడ ఉంటారు. మాకంతా షాకింగ్‌గా ఉంది. మాటలు రావడం కూడా కష్టమవుతోంది. తను నా కంటే చిన్నవాడు. తనకెలాంటి అనారోగ్య సమస్యలు లేవు’ అని తెలిపారు.

నితేష్ పాండే స్వస్థలం ఉత్తరాఖండ్‌లోని నైనిటాల్. ముంబైలో స్థిరపడ్డారు. నితేశ్ 1973లో జన్మించినాడు. 1990లో నాటకరంగంలో అడుగుపెట్టారు. పలు నాటకాల్లో నటించారు.  నితేశ్ తేజస్ షోతో టీవీ రంగంలోకి అడుగుపెట్టాడు. అస్తిత్వ, ఏక్ ప్రేమ్ కహాని, మంజిలీన్ అపానీ అపాని, సాయా, జస్టజూ, దుర్గేష్ నందిని వంటి పాపులర్‌ సీరియల్స్‌లో నటించి పేరు తెచ్చుకున్నాడు. కేవలం టీవీ సీరియల్స్ లోనే కాదు పలు చిత్రాల్లోనూ నితేశ్‌ నటించారు. బాలీవుడ్‌ బాద్‌ షా షారుఖ్ ఖాన్ నటించిన ‘ఓం శాంతి ఓం’ చిత్రంలో సహాయకుడిగా చేసి మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు.

బాజీ చిత్రంతో నితేష్ పాండే బాలీవుడ్‌లోనూ అడుగుపెట్టారు. బధాయి దో, రంగూన్, మడారి, హంటర్, షాదీ కే సైడ్ ఎఫెక్ట్స్, దబాంగ్ 2, ఓం శాంతి ఓం, మేరే యార్ కీ షాదీ హై వంటి సినిమాల్లో నటించారు. 1998లో అశ్విని కల్సేకర్‌ను పెళ్లి చేసుకున్నారు. 2002లో ఆమెతో విడిపోయారు. ఆ తరువాత తోటి నటి అర్పిత పాండేను పెళ్లాడారు.

Leave a Reply

Dimple Hayathi In Shankars Movie keerthi suresh