చిరు లీక్స్ నుంచి భోళా శంకర్ ఫొటోస్ లీక్

తెలుగు సినీ ప్రేక్షకులకు మెగాస్టార్ చిరంజీవి గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.మెగాస్టార్‌ చిరంజీవి యంగ్ హీరోలతో పోటీపడి మరీ సినిమాల్లో నటిస్తున్నారు. గ్యాప్ లేకుండా బ్యాక్ టు బ్యాక్ మూవీస్ తో థియేటర్లలో సందడి చేస్తూనే ఉన్నారు. రీసెంట్ గా ‘వాల్తేరు వీరయ్య’తో భారీ బ్లాక్ బస్టర్ అందుకున్న విషయం తెలిసిందే. ఆ తర్వాత రిలీజ్ కు సిద్ధమవుతున్న చిత్రం ‘భోళా శంకర్’మొహర్ రమేష్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ శరవేగంగా జరుగుతోంది.ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన పోస్టర్లను విడుదల చేసిన విషయం తెలిసిందే.ఆ పోస్టర్స్ సినిమాపై అంచనాలను మరింత పెంచేసాయి.మెగాస్టార్ చిరంజీవి ఈ సినిమాకు సంబంధించిన అప్డేట్లను ఎప్పటికప్పుడు విడుదల చేస్తూనే ఉన్నారు.తాజాగా మెగాస్టార్ చిరు లీక్స్ ద్వారా మరో అప్డేట్ ని విడుదల చేశారు.తాజాగా చిరు తమన్నా లతో కలిసి చిత్ర యూనిట్ సాంగ్ ను షూట్ చేసింది.

ఈ క్రమంలో  ‘భోళా శంకర్ నుంచి చిరు అదిరిపోయే అప్డేట్ అందించారు. ట్వీటర్ వేదికన షూటింగ్ స్పాట్, బ్యూటీఫుల్ లోకేషన్ నుంచి కొన్ని ఫొటోలను కూడా షేర్ చేసుకున్నారు. చిరు ట్వీట్ లో.. ‘స్విట్జర్లాండ్ లో కళ్ళు చెదిరే  అందాలతో మైమరిపించే లొకేషన్స్ లో భోళాశంకర్ కోసం  తమన్నాతో  ఆట పాట ఎంతో ఆహ్లాదంగా జరిగింది! ఈ  పాట ప్రేక్షకులందరినీ, మరింతగా అభిమానులందరినీ మెప్పిస్తుందని చెప్పగలను! త్వరలోనే మరిన్ని సంగతులు  పంచుకుందాం ! అప్పటివరకూ ఈ ‘చిరు లీక్స్’ పిక్స్ మీకోసం.‘ అంటూ చెప్పుకొచ్చారు. కాగా ఈ సినిమాకు సంబంధించిన అప్డేట్లను ఎప్పటికప్పుడు చిరు లీక్స్ ద్వారా మెగాస్టార్ పంచుకుంటూ ఉండటంతో అభిమానులు ఈ సినిమాపై భారీగా అంచనాలు పెట్టుకుంటున్నారు. ప్రస్తుతం చిరు షేర్ చేసిన ఫోటోస్ నెట్టింట తెగ వైరలవుతున్నాయి. దీంతో “ఒక సాంగ్ లీక్ చేయండి బాస్ అని ఒకరు”… “బాస్, గేమ్ చేంజర్ సినిమా గ్లింప్స్ లీక్ చేయవా” అంటూ కామెంట్స్ చేస్తున్నారు ఫ్యాన్స్.

ఈ సినిమాలో చిరు సరసన మిల్కీ బ్యూటీ తమన్నా నటిస్తున్న విషయం తెలిసిందే. ఏకే ఎంటర్టైన్‌మెంట్స్ నిర్మిస్తున్న ఈ సినిమాకు మహతి స్వరసాగర్ సంగీతం సమకూరుస్తున్నాడు. ఇందులో చిరంజీవి సోదరి పాత్రలో స్టార్ హీరోయిన్ కీర్తి సురేశ్ నటిస్తోంది. అయితే ఈ సినిమా సిస్టర సెంటిమెంట్ తో ఉండబోతోంది అని తెలుస్తోంది.

Leave a Reply

Dimple Hayathi In Shankars Movie keerthi suresh