భోలా శంకర్ లో అక్కినేని హీరో ఎవరంటే? 

Chiranjeevi: భోలా శంకర్ లో అక్కినేని హీరో ఎవరంటే?

ఈ సంవత్సరం  సంక్రాంతికి ‘వాల్తేర్ వీరయ్య’ చిత్రంతో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ ఖాతాలో వేసుకున్నారు మెగాస్టార్ చిరంజీవి. ప్రస్తుతం మెహర్ రమేష్ దర్శకత్వంలో ‘భోలా శంకర్’ చిత్రంలో నటిస్తున్నారు చిరు. ఈ మూవీ ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్ నిర్మిస్తుండగా తమిళ్‌లో విజయం సాధించిన ‘వేదాళం’ చిత్రానికి ఇది తెలుగు రీమేక్‌ కాగా  దీనిలో తమన్నా భాటియా ఫిమేల్ లీడ్‌గా నటిస్తోంది. అంతేకాదు ఇదే సినిమాలో చిరంజీవికి చెల్లిగా స్టార్ హీరోయిన్ కీర్తి సురేష్ కనిపించనుంది.  దీనిలో మణి శర్మ కుమారుడు మహతి స్వర సాగర్ స్వరాలు సమకూరుస్తున్నారు.

అయితే తాజా సమాచారం ప్రకారం యాక్షన్ కామెడీ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతున్న ‘భోలా శంకర్’ చిత్రంలో మరో యంగ్ హీరో కీలక పాత్ర పోషిస్తున్నాడు. ఆయన ఎవరంటే కాళిదాసు, కరెంట్, చిలసౌ’ వంటి చిత్రాల ద్వారా హీరోగా మంచి గుర్తింపు సాధించుకున్న అక్కినేని హీరో సుశాంత్ ‘భోలా శంకర్’ చిత్రంలో లవర్‌ బాయ్‌గా నటిస్తున్నారు. ఇప్పుడు ఇదే విషయాన్ని సుశాంత్ పుట్టినరోజు సందర్భంగా నేడు పిక్స్  చేస్తూ ట్వీట్ చేశారు. మేకర్స్. అంతేకాదు ఈ చిత్రంలో శాంత్ కీర్తి సురేష్‌ను ప్రేమించే వ్యక్తిగా కనిపిస్తాడని కూడా వెల్లడించారు.

నిజానికి ఈ సినిమా ఏప్రిల్ 14న విడుదల కావాల్సి ఉండగా పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో జాప్యం కారణంగా వాయిదా పడింది. అయితే త్వరలోనే కొత్త విడుదల తేదీని ప్రకటించనున్నారు.

ఇక ఈ చిత్రంలో లవర్ బాయ్ రోల్ చేస్తున్న సుశాంత్‌కు ఇప్పటి వరకు మంచి కమర్షియల్ దొరకడం లేదు. ఈ క్రమంలోనే అల్లు అర్జున్ హీరోగా త్రివిక్రమ్ రూపొందించిన ‘అల వైకుంఠపురంలో’ కీలక పాత్ర పోషించినప్పటికీ.. అది కూడా తన కెరీర్‌కు ప్లస్ అవ్వలేదు. అయితే ‘భోలా శంకర్’ చిత్రంలో మాత్రం ఇంపార్టెంట్ రోల్ ప్లే చేసినట్లు తెలుస్తోంది. ఈ మేరకు నేడు సుశాంత్ బర్త్‌డే సందర్భంగా భోలా శంకర్ టీమ్ సుశాంత్‌కు వెల్‌కమ్ చెప్తూ ట్వీట్ చేసింది. ప్రత్యేకంగా సుశాంత్    ఈ చిత్రంలో లవర్ బాయ్ పాత్రలో కనిపించనున్నాడు.

 

 

Leave a Reply

Dimple Hayathi In Shankars Movie keerthi suresh