Viral Video : ప్రధాని మోదీకి పాదాభివందనం చేసిన మేరీ మిల్‌బెన్

Viral Video

Viral Video:ప్రధాని మోదీకి పాదాభివందనం చేసిన మేరీ మిల్‌బెన్

Viral Video: భారత దేశ ప్రధానమంత్రి నరేంద్రమోదీ అధికారిక పర్యటన ముగింపు కార్యక్రమంలో భాగంగా శనివారం అమెరికా ప్రముఖ గాయని మేరీ మిల్‌బెన్ భారత జాతీయ గీతం జనగణమనను ఆలపించారు.

ఆ తర్వాత  ప్రధాని నరేంద్ర మోదీకి పాదాభివందనం చేసి, ప్రధాన మోదీ ఆశీస్సులు తీసుకున్నారు. ప్రధాని మోదీ

38 ఏళ్ల మిల్‌బెన్.. భారత జాతీయ గీతం ఆలపించాల్సిందిగా.. అమెరికాలోని భారత కమ్యూనిటీ ఫౌండేషన్ (USICF) ఆహ్వానించింది.

వాషింగ్టన్ డీసీలోని ఇంటర్నేషనల్ ట్రేడ్ సెంటర్‌లో… రొనాల్డ్ రీగన్ బిల్డింగ్‌లో ఈ కార్యక్రమం జరిగింది.

ఆఫ్రికన్-అమెరికన్ అయిన భారత సంస్కృతికి అనుగుణంగా ప్రధాని మోడీ పాదాలకు నమస్కారం చేసింది.

ఈ సందర్భంగా ప్రధాని గాయని చేతులను పట్టుకుని ఆప్యాయంగా పలకరించారు. అంతకుముందు మిల్ బెన్ భారత జాతీయ గీతం జనగణ మన అంటూ ఆలపించింది

ప్రధాని మోడీ అమెరికా పర్యటన ముగింపునకు చిహ్నంగా జాతీయ గీతాన్ని ఆలపించారు.

అయితే మిల్‌బెన్ సింగర్ మాత్రమే కాదు.. హాలీవుడ్ నటి కూడా. ఆమె ఇదివరకు జనగణమన, ఓమ్ జయ్ జగదీష్ పాడటంతో ఇండియాలో ఫేమస్ అయ్యారు.

అలాగే తనకు ఈ  అవకాశం ఇచ్చినందుకు ఎంతో గౌరవంగా భావిస్తున్నట్టు అంతకుముందు మిల్ బెన్ వ్యాఖ్యానించారు.

‘‘అమెరికా, భారత జాతీయ గీతాలు రెండూ ప్రజాస్వామ్య ఆదర్శాలను, స్వేచ్ఛను తెలియజేస్తాయి.

అమెరికా-భారత్ అసలైన బంధాల సారాంశం ఇది. స్వేచ్ఛాయుత దేశం అన్నది ప్రజల స్వేచ్ఛ ద్వారానే నిర్ణయించబడుతంది’’అని మిల్ బెన్ పేర్కొన్నారు.

భారతీయ విలువలు, సంస్కృతి, ఆధ్యాత్మిక భావాలతో మోడీ ప్రపంచవ్యాప్తంగా ఎంతో గౌరవం పొందారని మేరీ వ్యాఖ్యానించారు.

ఇప్పటి వరకు నలుగురు అమెరికా అధ్యక్షుల ముందు అమెరికా జాతీయగీతం పాడే అవకాశం దక్కిందని చెప్పిన మిల్‌బెన్..

. ప్రధాని మోదీ ముందు తన కుటుంబంగా భావించే అమెరికాలో స్థిరపడ్డ భారతీయుల ముందు ప్రదర్శన ఇవ్వడాన్ని గౌరవంగా భావిస్తున్నట్లు చెప్పారు.

ఇక  అమెరికా పర్యటన ముగియడంతో తదుపరి ఈజిప్టులో పర్యటనకు మోడీ పయనమయ్యారు.

అలాగే గత నెలలో ప్రధాని మోదీ పపువా న్యూ గినియా పర్యటనముగిసిన సందర్భంగా ఆ దేశ ప్రధాని విమానాశ్రయంలో

మోదీ పాదాలకుప్రధాని మోదీ పాదాలను తాకి నమస్కరించగా,  నమస్కరించగా తిరిగి మోదీ రెండు చేతులు జోడించి వారికి నమస్కరించారు.

Leave a Reply

Dimple Hayathi In Shankars Movie keerthi suresh