Salman Khan: బాలీవుడ్ కండలవీరుడు సల్మాన్ ఖాన్‌కు చంపుతానని బెదిరింపు కాల్
బాలీవుడ్ కండలవీరుడు సల్మాన్ ఖాన్‌కు బెదిరింపులు ఆగట్లేదు. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన పంజాబీ గాయకుడు, కాంగ్రెస్ పార్టీ నాయకుడు సిద్ధు మూసేవాలా దారుణ హత్యకు గురైనప్పటి నుంచీ ఆయనకు బెదిరింపు ఫోన్లు, మెయిల్స్ అందుతూనే వస్తోన్నాయి. సల్మాన్ ఖాన్‌ను టార్గెట్‌గా చేసుకున్నారు గ్యాంగ్స్టర్లు. సల్మాన్ ఖాన్‌ను హత మార్చడమే తన లక్ష్యమంటూ ఇదివరకే లారెన్స్ బిష్ణోయ్ ప్రకటించుకున్నాడు కూడా.
ఇప్పుడు రాజస్థాన్‌లోని జోధ్‌పూర్‌కు చెందిన ‘రోకీ భాయ్’ అనే వ్యక్తి నుండి నటుడు సల్మాన్ కు సోమవారం రాత్రి హత్య బెదిరింపు వచ్చినట్లు ముంబై పోలీసులు తెలిపారు.
ఈ బెదిరింపుల నేపథ్యంలో ముంబై పోలీసులు సల్మాన్ ఖాన్ గన్ లైసెన్స్‌ను మంజూరు చేశారు. ఆయనకు మరింత కట్టుదిట్టమైన భద్రత కల్పించారు. ఆయన నివాసం వద్ద భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. దీనికి అదనంగా ఆయుధ లైసెన్స్‌ను కూడా మంజూరు చేశారు. అయినప్పటికీ- ప్రాణాపాయ బెదిరింపులకు బ్రేకులు పడట్లేదు. మరోసారి ఆయనకు బెదిరింపులు అందాయి.
కాల్ చేసిన వ్యక్తి ఏప్రిల్ 30 న నటుడిని చంపుతానని బెదిరించాడని,విచారణ జరుగుతోందని పోలీసులు తెలిపారు. “పోలీస్ కంట్రోల్ రూమ్ నిన్న రాత్రి అందుకున్న ఓ కాల్లో ఓ వ్యక్తి తనను తాను రోకీ భాయ్ అని చెప్పుకున్నాడు. తాను రాజస్థాన్‌లోని జోధ్‌పూర్ నుంచి కాల్ చేస్తున్నానని చెప్పాడు. ఏప్రిల్ 30న నటుడు సల్మాన్ ఖాన్ ను చంపుతానని బెదిరించాడు. ఈ విషయంపై విచారణ చేస్తున్నాం” అని ముంబై పోలీసులు వెల్లడించారు.
ఇటీవల గ్యాంగ్‌స్టర్ గోల్డీ బ్రార్ నుంచి కూడా సల్మాన్ ఖాన్ కు బెదిరింపులు ఎదురయ్యాయి. గతేడాది పంజాబీ సింగర్, కాంగ్రెస్ నేత సిద్ధూ మూసేవాలా హత్యలో పాల్గొన్న బ్రార్ సల్మాన్‌ను చంపేస్తామంటూ ఇటీవల బెదిరింపు మెయిల్ పంపాడు. ఈ విషయంలో గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్, గోల్డీ బ్రార్, రోహిత్ బ్రార్‌పై ముంబై పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.
సల్మాన్ ఖాన్ భద్రతా కారణాల రీత్యా హై ఎండ్ బుల్లెట్ ప్రూఫ్ కారును కొనుగోలు చేశారు. సల్మాన్ ఖాన్ కొత్తగా బుల్లెట్ ఫ్రూప్ పెట్రోల్ స్పోర్ట్స్ యుటిలిటీ వెహికల్ ను కొన్నారు. ఈ కారు ఇండియన్ మార్కెట్లో ఇప్పటి వరకు రిలీజ్ కాలేదు. నిస్సాన్ కంపెనీ రూపొందించిన ఎస్‌యూవీల్లో అత్యంత ఖరీదైన కారు ఇదేనట. భద్రత కూడా బీ6 లేదా బీ7 ఉంటుందని సమాచారం. బీ6లో 41ఎమ్ఎమ్ మందపాటి గ్లాస్, బీ7లో 78ఎమ్ఎమ్ మందంతో కూడిన గ్లాస్ ఉంటుంది. ఫలితంగా బుల్లెట్స్ లోపలకు చొరబడలే