పోరుకు సిద్ధం అంటున్న చిరు ఫాన్స్ బాలయ్య ఫాన్స్

ఈ సంవత్సరం సంక్రాంతి సిని ప్రియులకు మాములుగా లేదు అనడం అతియోశక్తి  దానికి కారణం బాక్సాఫీస్ ను బద్దల కోట్టిన మెగాస్టార్ వాల్తేరు వీర‌య్య‌.. నట‌సింహ నంద‌మూరి బాల‌కృష్ణ వీర‌సింహా రెడ్డి చిత్రాలు పోటీ ప‌డ్డాయి. రెండు సినిమాలు ఘ‌న విజ‌యాల‌ను సొంతం చేసుకున్నా విషయం తెలిసిందే.అయితే వీర సింహా రెడ్డి కంటే వాల్తేరు వీర‌య్య‌కే ఎక్కువ మార్కులు ప‌డ్డాయి. ఈ బాక్సాఫీస్ హీట్ ఆనంద ఉత్సహాలు తిరక ముందే ఈ స్టార్ హీరోలిద్ద‌రూ మ‌రోసారి బాక్సాఫీస్ పోరుకి సై అనేస్తున్నార‌ని సినీ స‌ర్కిల్స్ స‌మాచారం. అసలు వివ‌రాల్లోకి వెళితే. ప్ర‌స్తుతం నంద‌మూరి బాల‌కృష్ణ హీరోగా అనీల్ రావిపూడి ద‌ర్శ‌క‌త్వంలో ఓ సినిమా రూపొందుతోన్న సంగ‌తి తెలిసిందే. మ‌రో వైపు మెగాస్టార్ చిరంజీవి, మెహ‌ర్ ర‌మేష్ ద‌ర్శ‌క‌త్వంలో భోళా శంక‌ర్ సినిమాను చేస్తున్నారు. ఈ రెండు సినిమాలు ఒకేరోజు సమ్మర్లో విడుదల కాబోతున్నాయని సమాచారం. ఇప్ప‌టికే భోళా శంక‌ర్ సినిమాను మేక‌ర్స్ మే 12న విడుద‌ల చేయ‌టానికి అన్ని ఏర్పాట్లు  చేస్తున్న‌ట్లు స‌మాచారం. అదే రోజున బాల‌కృష్ణ త‌న 108వ సినిమాను రిలీజ్‌కి రెడీ చేస్తున్నారు. సినీ వర్గాల్లో చక్కర్లు కొడుతున్న ఈ వార్త నిజమైతే మాత్రం అసలే వేడిగా ఉండే సమ్మర్ మరోసారి టాలీవుడ్ స్టాల్ వార్ట్స్ పోరుతో బాక్సాఫీస్ హీటెక్కుతుందనటంలో సందేహమే లేదు.చిరంజీవి.. భోళా శంక‌ర్ మూవీ త‌మిళ చిత్రం వేదాళంకు రీమేక్‌. ఇందులో త‌మ‌న్నా హీరోయిన్‌గా న‌టిస్తుంటే కీర్తి సురేష్ చిరంజీవి చెల్లెలు పాత్ర‌లో క‌నిపించ‌నుంది. బాల‌కృష్ణ 108వ సినిమా యాక్ష‌న్ జోన‌ర్‌లో ఉన్న‌ప్ప‌టికీ శ్రీలీల బాల‌య్య కూతురిగా క‌నిపించ‌నుంద‌ట‌.

ఇది కూడా చదవండి: 

 

Leave a Reply

Dimple Hayathi In Shankars Movie keerthi suresh