“నేను త్వరలోనే షిఫ్ట్ అవుతున్నా.. నా అడ్రస్ మారుతోంది. మారుతున్న అడ్రస్ నోట్ చేసుకుని అక్కడకు రండి కలుద్దాం.. ఇది అన్నది ఓ ప్రెండో లేక కుటుంబలోని వ్యక్తో కాదు, సాక్షాత్తు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి. ఢిల్లీ లోని లీలా ప్యాలెస్ హోటల్ లో నిర్వహించిన ఎపిగ్లోబల్ ఇన్వెస్టర్ సమ్మిట్ రౌండ్ టేబుల్ సమావేశంలో ముఖ్యమంత్రి ఈ వ్యాఖ్యలు చేశారు. ఆయనకు మనసుంటే ఎక్కడికైనా, ఎప్పుడైనా వెళ్ళొచ్చు…. కాని ఈ రాజధాని మార్పు వ్యవహారంలో సర్వోన్నత న్యాయస్థానంలో కేసు నడుస్తున్నపుడు ఇలాంటి వ్యాఖ్యాలు ముఖ్యమంత్రి స్థాయిలో చేయడం ఎంతవరకు సబబు అని పలువురు పరిశీలకులంటున్నారు. ఆయన ఇలా అన్నారో లేదో ప్రధాన ప్రతిపక్షమైన టీడిపి ప్రెస్ మీట్ నిర్వహించి ఘాటు వ్యాఖ్యలతో నిరసన తెలిపింది. ఈ వ్యాఖ్యలు, నిరసనలతో మీడియా వారికి లాభమేమో కాని సదరు సామాన్యులకు మాత్రం ఒరిగేదేమీలేదు. ఏదేమైనా సరే జగన్ చేసిన ఈ పనికి జగన్ మంత్రివర్గానికి ఓ కొత్త ఊపును అటు ప్రతిపక్షానికి కొంత తలనొప్పిని తీసుకుచ్చారని విశ్లేషకులు భావిస్తున్నారు.