శ్రీ వారి సన్నిధిలో కొడుకుతో కాజల్

తెలుగు సినీ ప్రేక్షకులకు టాలీవుడ్ స్టార్ హీరోయిన్ లలో ఒకరు ఐన  కాజల్ అగర్వాల్ గురించి ప్రత్యేకంగా చెప్పకరలేదు. తెలుగులో ఎన్నో సినిమాలలో నటించి స్టార్ హీరోయిన్గా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును ఏర్పరచుకుంది కాజల్. ఈమెకు రెండు తెలుగు రాష్ట్రాలలో ఏ రేంజ్ లో ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఉందో మనందరికీ తెలిసిందే. కానీ ఈమె ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉంటూ తల్లిగా తన కొడుకు, కుటుంబ బాధ్యతలు నిర్వహిస్తున్న విషయం అందరకు తెలిసిందే. కానీ కాజల్ ప్రస్తుతం సినిమాలకు కాస్త బ్రేక్ తీసుకుంది కాజల్ అగర్వాల్. కాజల్ 2020లో తన చిన్ననాటి స్నేహితుడు గౌతమ్ కిచ్లు ని పెళ్లి చేసుకున్న విషయం మనందరికీ తెలిసిందే. ఈ దంపతులకు ఒక కుమారుడు కూడా జన్మించాడు. మాతృత్వం కోసం సినిమాలకు కాస్త బ్రేక్ తీసుకున్న కాజల్ అగర్వాల్ ఇప్పుడిప్పుడే సినిమాలలోకి రీ ఎంట్రీ ఇవ్వడానికి ప్రయత్నిస్తోంది. ఈ నేపథ్యంలోనే కొత్త ప్రాజెక్టులకు గ్రీన్ సిగ్నల్ ఇస్తోంది ఈ ముద్దుగుమ్మ. ప్రస్తుతం ఈ అందాల చందమామ కాజల్ అగర్వాల్  తన కొడుకుతో తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. వీఐపీ బ్రేక్ దర్శన సమయంలో తిరుమల స్వామివారి సేవలో పాల్గొన్నారు కాజల్‌. కొడుకు పట్టాక తొలిసారి తన కుమారుడితో కలిసి తిరుమలకు వచ్చిన కాజల్‌, ఆమె కుమారిడికి అర్చకులు వేద ఆశీర్వాదాలు చేశారు. అనంతరం తీర్థ ప్రసాదాలు అందించారు. ఆమెకు  తోడుగా ఆమె తల్లి కూడా ఉన్నారు. ప్రస్తుతం  శ్రీవారి దర్శనార్థం వచ్చిన కాజల్‌ని చూసేందుకు భక్తులు ఎబగబడ్డారు. దీంతో టిటిడి సిబ్బంది ఆమెకి భద్రత కల్పించారు.

 

ఇది కూడా చదవండి: 

 

Leave a Reply

Dimple Hayathi In Shankars Movie keerthi suresh