నేను ఇంకా బతికే వున్నా :కోట శ్రీనివాసరావు

Kota Srinivasa Rao: నేను ఇంకా బతికే వున్నా

తెలుగు తెరపై కోట శ్రీనివాస‌రావుకు ప్రత్యేకమైన స్థానం ఉంది. ఆయన గురించి  ప్రత్యేకంగా చెప్పవలసిన పనిలేదు ఆయన  ఎన్నో విలక్షణ పాత్రలు పోషించి అలరించిన పలు అవార్డ్స్ అందుకున్నారు. విల‌న్‌గా, క‌మెడియ‌న్‌గా, క్యారెక్ట‌ర్ ఆర్టిస్ట్‌గా కోట చేసిన ఎన్నో పాత్రలు ప్రేక్షకుల మెప్పు పొందాయి.

అయితే అలాంటి  సీనియర్ నటుడైన కోట శ్రీనివాసరావు చనిపోయారంటూ సోషల్ మీడియాలో వార్తలు  షికార్లు  కొట్టాయి .అయితే  తాజాగా దీనిపై కోట శ్రీనివాసరావు గారు రియాక్ట్ అయ్యారు.

పెరుగుతున్న టెక్నాలజీకి తోడు ఫేక్ న్యూస్‌ల హంగామా రెట్టింపవుతూ వస్తోంది. సోషల్ మీడియా వేదికగా ఎన్నో రకాల పుకార్లు పుట్టుకొస్తున్నాయి. రాను రాను ఫేక్ న్యూస్‌ల‌కు సంబంధించిన న్యూసెన్స్ ఎక్కువైపోతుంది. మరీ ముఖ్యంగా సెలబ్రిటీలను టార్గెట్ చేస్తూ సొమ్ము చేసుకుంటున్నారు కొందరు గాసిప్ రాయుళ్లు. ఈ నేపథ్యంలోనే తాను మరణించినట్లు వస్తున్న వార్తలపై కోట ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓ వైపు సినీ ఇండస్ట్రీలో వ‌రుస విషాదాలు నెల‌కొంటున్న త‌రుణంలో కోట శ్రీనివాసరావు మరణించారంటూ వార్తలు రావడంతో అంతా షాక్ కు గురియ్యరు . ఈ విషయం కోట వరకు వెళ్లడంతో ఆయన తన బాధను వ్యక్తం చేస్తూ ఓ వీడియో రిలీజ్ చేశారు.

ఈ వీడియోలో కోట మాట్లాడుతూ అందరికీ నమస్కారం. ప్రేక్షకులకు ఉగాది శుభాకాంక్షలు. ఎవరో సోషల్ మీడియా అట నేను పోయానని వేశారట కోట శ్రీనివాసరావు దుర్మరణం అని ఇలాంటి వార్తలు ఎందుకు వేస్తారో తెలియదు. తెల్లారితే పండుగ ఏంట్రా ఏంటిదని ఆలోచన. పొద్దున్నుంచే ఫోన్లు  ఇప్పటివరకు 50కాల్స్ నేనే మాట్లాడాను మా కుర్రాళ్లు మాట్లాడారు ఓ పది మంది పోలీసులు వ్యాన్లు కూడా తీసుకుని ఇంటికి వచ్చేశారు. “కేసు రాయాలి  పెద్దాయన. పెద్ద పెద్దవాళ్లు వస్తారు. అందుకే సెక్యూరటీ వచ్చాం” అన్నారు. నేను మాట్లాడేసరికి ఇదేంటని పోలీసులు ఆశ్చర్యపోయారు. మా మీద దయుంచి మీరే కాస్త ఇలాంటివి అరికట్టండి ఇది విని కాస్త పెద్దవాళ్లుంటే గుండె ఆగి చచ్చిపోతారని పోలీసులకు చెప్పాను. ఇలాంటి వదంతులు మీరు నమ్మొద్దని మనవి చేస్తున్నా. మిగతావాళ్లకు తెలియ జేయండి. ఇది చూసైనా వాళ్లకు బుద్ధి వస్తుంది. జీవితంలో డబ్బు సంపాదించడానికి చాలా మార్గాలు ఉన్నాయి. ఇది అక్కర్లేదు మనిషి ప్రాణాలతో ఆడుకోకూడదు. అంతే. నమస్కారం అని కోట శ్రీనివాసరావు అన్నారు. మొత్తానికి కోట శ్రీనివాస రావు స్వయంగా వివరణ ఇవ్వడంతో అభిమానులంతా ఉపిరి పీల్చుకున్నారు.

 

Leave a Reply

Dimple Hayathi In Shankars Movie keerthi suresh