Telangana 10th Results: పది ఫలితాల్లో కూడా బాలికలదే పైచేయి

Telangana 10th Results

Telangana 10th Results: పది ఫలితాల్లో కూడా బాలికలదే పైచేయి

Telangana 10th Results: తెలంగాణ రాష్ట్రంలో పదో తరగతి ఫలితాల నేడు  విడుదలయ్యాయి. బుధవారం మధ్యాహ్నం 12 గంటలకు విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి పదో తరగతి పలితాలను విడుదల చేశారు.

పదో తరగతి ఉత్తీర్ణత శాతం 86.60 శాతంగా నమోదైందని తెలిపారు. బాలికల ఉత్తీర్ణత శాతం 88.53 శాతం కాగా, బాలుర ఉత్తీర్ణత శాతం 84.68 శాతంగా నమోదైందని మంత్రి వెల్లడించారు.

పది ఫలితాల్లో కూడా బాలికలదే పైచేయిగా ఉంది. కాగా, 2793 పాఠశాలల్లో వంద శాతం ఉత్తీర్ణత నమోదైంది. 25 స్కూల్స్‌లో ఉత్తీర్ణత శాతం ‘సున్నా’ గా నమోదు.. అంటే ఒక్కరూ కూడా పాస్ కాలేదు. నిర్మల్ జిల్లాలో అత్యధికంగా 99 శాతం ఉత్తీర్ణత సాధించగా, సెకండ్ ప్లేస్ లో సిద్ది పేట నిలిచింది.   వికారాబాద్ జిల్లాలో అత్పల్పంగా 59.46 శాతం ఉత్తీర్ణత నమోదు చేసింది.

Also Watch

Telangana: ఇంటర్​లో ఫెయిల్…. 8 మంది సూసైడ్

ఏప్రిల్ 3 నుంచి 12వ తేదీ వరకు పదో తరగతి పరీక్షలు జరిగాయి. మొత్తం 4,84,370 మంది విద్యార్థులు పరీక్షలు రాశారు. కాగా మంగళవారం పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్‌ శ్రీదేవసేన, ఎస్సెస్సీ బోర్డు ఉన్నతాధికారులతో మంత్రి సమీక్షించి, ఫలితాల విడుదలకు ఆమోదం తెలిపిన సంగతి విదితమే. కాగా, విద్యార్థులు bse.telangana.gov.in, bseresults.telangana.gov.in వెబ్‌సైట్ల ద్వారా తమ ఫలితాలను తెలుసుకోవచ్చు.

అలాగే ఫెయిలైన విద్యార్థుల కోసం జూన్ 14 నుంచి 22 వరకు సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించనున్నారు. ఫెయిల్ అయిన విద్యార్థులు సప్లిమెంటరీ పరీక్షలకు బాగా చదివి ఉత్తీర్ణత సాధించాలని అన్నారు మంత్రి సబిత. అటు తల్లిదండ్రులు కూడా పిల్లలకు మనోదైర్యాన్ని ఇచ్చి అండగా ఉండాలని తెలిపారు.

విద్యా సంవత్సరం కోల్పోకుండా ఉండేందుకు త్వరగా సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహిస్తున్నామని కాబట్టి విద్యార్థులు అందోళన చెందకూడదని మంత్రి సబిత తెలిపారు. ఇంటర్ ఫలితాలు వెలువడిన తర్వాత విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకోవడం బాధాకరమని మంత్రి సబితా ఇంద్రారెడ్డి వ్యాఖ్యానించారు. విద్యార్థులు ఎవరూ కూడా ఆత్మహత్యలు చేసుకోవద్దని కోరారు.

కాగా, గత ఏడాది తెలంగాణ పదో తరగతి పరీక్షా ఫలితాల్లో పెద్ద ఎత్తున ఉత్తీర్ణత శాతం నమోదైంది. ఏకంగా 90 శాతం మంది విద్యార్థులు పాసయ్యారు. వీరిలో బాలుర ఉత్తీర్ణత శాతం 87.61 కాగా, బాలికల ఉత్తీర్ణత శాతం 92.45 గా ఉంది. జిల్లాల వారీగా చూస్తే సిద్దిపేట జిల్లా మొదటి స్థానంలో 97.87 శాతం ఉత్తీర్ణతతో తొలి స్థానంలో నిలిచింది. హైదరాబాద్ జిల్లా 79 శాతంతో చివరి స్థానంలో నిలిచిన విషయం విధితమే.

Leave a Reply