టీడీపీ వర్సస్ వైసీపీ గెలుపు ఎవరిది

YSRCP vs Tdp :టీడీపీ వర్సస్ వైసీపీ  గెలుపు ఎవరిది

ఏపీ అసెంబ్లీ కొత్త సమరానికి వేదిక గా మారనుంది .  ఈ నెల (మార్చి )23న ఎమ్మెల్సీ ఎన్నికలకు ఓటింగ్ జరగనుంది. ఇది రెబల్స్ కు పరీక్షగా మారుతోంది. ఏడు ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ ఎన్నికలకు రంగం సిద్దమైంది.

ఇప్పటికే వైసీపీ నుంచి ఏడుగురు అభ్యర్ధులు నామినేషన్లు దాఖలు చేసారు. టీడీపీ నుంచి పంచుమర్తి అనురాధ ఎమ్మెల్సీ ఎన్నికల బరిలోకి దిగారు. సంఖ్యాబలం లేకున్నా టీడీపీ అభ్యర్థిని నిలబెట్టింది. ఇక్కడ టీడీపీ వ్యూహం వెనుక కొత్త లెక్కలు ఉన్నాయి. టీడీపీ నుంచి వైసీపీకి మద్దతుగా నిలిచిన ఎమ్మెల్యేలపై చంద్రబాబు గురి పెట్టారు. అదే సమయంలో వైసీపీ నుంచి టీడీపీకి మద్దతిచ్చే వారి పైన అధికార పార్టీ ఏం చేయబోతుందనేది ఆసక్తిగా మారుతోంది.

అయితే ఈ ఎన్నికల్లో గెలవాలంటే ఒక్కో అభ్యర్ఢికి 23 మంది ఎమ్మెల్యేల మద్దతు కావాలి. టీడీపీకి 2019 ఎన్నికల్లో 23 సీట్లు దక్కాయి. కానీ, కొందరు వైసీపీకి దగ్గరయ్యారు. టీడీపీ అభ్యర్ధి గెలుపు కష్టంగానే కనిపిస్తోంది. కానీ, టీడీపీ మాత్రం ఈ ఎన్నికల్లో తమ పార్టీ నుంచి గెలిచి వైసీపీకి దగ్గరైన రెబల్స్ ను కార్నర్ చేస్తూ పోటీకి దిగినట్లు కనిపిస్తోంది. అదే సమయంలో వైసీపీ నుంచి తమ పార్టీతో కొందరు టచ్ లో ఉన్నారని టీడీపీ నేతలు చెబుతున్నారు. దీంతో ఎవరు ఎవరితో ఉన్నారు ఓటింగ్ లో ఏం జరగబోతోందునే ఆసక్తి మొదలైంది.

సభలో సంఖ్య బలం ఆధారంగా ఏడు స్థానాలు వైసీపీకే దక్కాలని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. తాజాగా జరిగిన మంత్రివర్గ సమావేశంలోనూ ముఖ్యమంత్రి జగన్ ఈ ఏడు స్థానాల గెలుపు పైన మంత్రులకు దిశా నిర్దేశం చేసినట్లు సమాచారం. ఏడు స్థానాల్లో గెలిచే బలం తమకు ఉందని.అయితే  ఖచ్చితంగా తామే  గెలుస్తామని వైసీపీ ముఖ్య నేతలు చెబుతున్నారు. టీడీపీ నుంచి ప్రస్తుతం సంఖ్యా బలం రెబల్స్ కారణంగా తక్కువగా కనిపిస్తోంది. అదే సమయంలో టీడీపీ నుంచి ఇద్దరు ఎమ్మెల్యేలు ఆనం కోటంరెడ్డి టీడీపీకి మద్దతిస్తారా లేక ఓటింగ్ కు దూరంగా ఉంటారా అనేది తేలాల్సి ఉంది. ఆ ఇద్దరు నేతలు ప్రస్తుతం ఆత్మసాక్షిగా  ఓటు వేస్తామని చెబుతుండటంతో ఆ ఇద్దరు వైసీపీకి అనుకూలంగా ఓటు వేసే అవకాశాలు తక్కువనే అభిప్రాయం వినిపిస్తోంది. మరిఈ ఇద్దరు టీడీపీకి అనుకూలంగా ఓటు వేస్తారనే సంకేతాల నడుమ వైసీపీ నాయకత్వం వ్యూహం ఏంటనేది ఆసక్తిని పెంచుతోంది.

టీడీపీ నుంచి వైసీపీకి దగ్గరైన రెబల్స్ ఓటింగ్ అదే విధంగా వైసీపీ నుంచి ఇప్పటికే రెబల్స్ గా మారిన ఇద్దరి ఓటింగ్ తీరే ఇప్పుడు కీలకంగా మారుతోంది. వైసీపీ నుంచి ఇద్దరు వ్యతిరేకంగా ఓటు వేసే అవకాశం కనిపిస్తుండటంతోవారికి పార్టీ నాయకత్వం ఆ అవకాశం ఇస్తుందా అనేదే ఇప్పుడు చర్చ. అదే సమయంలో టీడీపీ నుంచి గెలిచి వైసీపీకి దగ్గరైన వారి విషయంలోనూ నిర్ణయం తీసుకోవాలని తెలుగు దేశం ఒత్తిడి పెంచే వ్యూహంతో సిద్దం అవుతోంది. ఆ ఇద్దరు వైసీపీకి అనకూలంగా ఓటు వేయకపోయినా పార్టీ అభ్యర్ధుల గెలుపు పై ప్రభావం చూపించే అవకాశాలు లేవని చెబుతున్నారు. కానీ, టీడీపీకి మాత్రం బరిలో దిగటం వెనుక మాత్రం వైసీపీ నాయకత్వం పైన ఆ పార్టీ ఎమ్మెల్యేల్లో ఉన్న వ్యతిరేకతను బయట పెట్టటమే లక్ష్యంగా కనిపిస్తోంది. రెండో ప్రాధాన్యత ఓటింగ్ కూడా కీలకంగా మరనుంది. దీంతో23వ తేదీ నాటికి రెండు పార్టీల్లోనూ ఎటువంటి పరిణామాలు చోటు చేసుకుంటాయి ఏ నిర్ణయాలు జరగుతాయనేది ఉత్కంఠను మరింత పెంచుతోంది.

 

Leave a Reply

Dimple Hayathi In Shankars Movie keerthi suresh