కుప్పకూలిన ఇండియన్ ఆర్మీ హెలికాప్టర్

Indian Army Helicopter Crash: కుప్పకూలిన ఇండియన్ ఆర్మీ హెలికాప్టర్

భారత సరిహద్దులో దారుణ ఘటన చోటు చేసుకుంది. అరుణాచల్ ప్రదేశ్‌లోని మండల హిల్స్ ప్రాంతంలో ఇండియన్ ఆర్మీ చిరుత హెలికాప్టర్ కుప్ప కూలిపోయిందని వార్తలు వచ్చాయి. హెలికాప్టర్ పైలట్ల కోసం రెస్క్యూ టీం విస్తృత గాలింపు  కొనసాగిస్తోందని ఆర్మీ వర్గాల సమాచారం ప్రకారం తెలిసింది.నేటి ఉదయం 09.15 గంటల నుంచి ఆ హెలికాప్టర్ ఏటీసీతో సంబంధాలు తెగిపోయాయి. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.

హెలికాప్టర్ క్రాష్ అయినప్పుడు అందులో పైలట్, కో-పైలట్‌లు ఉన్నారు. వారిని రక్షించడానికి  ప్రస్తుతం సెర్చ్ ఆపరేషన్ జరుగుతోంది.ఈ రోజు ఉదయం సెంగే నుంచి మిస్సమరి వెళ్తుండగా చీతా హెలికాప్టర్ గల్లంతైంది. ఈ రోజు ఉదయం 09:15 గంటలకు హెలికాప్టర్ ఏటీసీతో సంబంధాలు కోల్పోయింది. ‘అరుణాచల్ ప్రదేశ్ లోని బొమ్డిలా సమీపంలో ఆర్మీ ఏవియేషన్ చీతా హెలికాప్టర్ మార్చి 16న ఉదయం 09:15 గంటలకు ఏటీసీతో సంబంధాలు కోల్పోయింది. బొమ్డిలాకు పశ్చిమాన ఉన్న మందల సమీపంలో ఇది కూలిపోయినట్లు సమాచారం. సహాయక చర్యలు ప్రారంభయ్యాయి.  అయితే ఈ ప్రమాదానికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. గతేడాది అక్టోబర్ లో కూడా అరుణాచల్ ప్రదేశ్‌లోని తవాంగ్ ప్రాంతంలో ఇండియన్ ఆర్మీకి చెందిన ఇదే రకం చీతా హెలికాప్టర్ కూలిపోయింది. ఈ ప్రమాదంలో పైలట్‌ ప్రాణాలు కోల్పోయాడు. తవాంగ్‌లోని ఫార్వర్డ్ ఏరియాల వెంట రొటీన్ మిషన్‌లో  హెలికాప్టర్ ప్ర‌యాణిస్తున్న స‌మ‌యంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది.

భారత సరిహద్దులో దారుణ ఘటన చోటు చేసుకుంది. అరుణాచల్ ప్రదేశ్‌లోని మండల హిల్స్ ప్రాంతంలో ఇండియన్ ఆర్మీ చిత హెలికాప్టర్ కుప్ప కూలిపోయిందని వార్తలు వచ్చాయి. హెలికాప్టర్ పైలట్ల కోసం రెస్క్యూ టీం విస్తృత గాలింపు  కొనసాగిస్తోందని ఆర్మీ వర్గాల సమాచారం ప్రకారం తెలిసింది.

Leave a Reply

Dimple Hayathi In Shankars Movie keerthi suresh