Ap Politics: ఏపీలో అధికారం దక్కేదెవరికి, పబ్లిక్ పల్స్ క్లియర్..!!

Pavan klalyan chandrababu alliance

Ap Politics:ఏపీలో అధికారం దక్కేదెవరికి, పబ్లిక్ పల్స్ క్లియర్..!!

ఏపీలో రాజకీయ సమీకరణాలు మారుతున్నాయి. వచ్చే ఎన్నికల్లో గెలుపు కోసం వైసీపీ వర్సస్ టీడీపీ,జనసేన పోటీ పడుతున్నాయి. తన సంక్షేమం తనకు అధికారం నిలబెడుతుందని జగన్ ధీమాగా ఉన్నారు. ప్రభుత్వం పైన ఉన్న వ్యతిరేకత తమకు కలిసి వస్తుందని చంద్రబాబు, పవన్ అంచనా వేస్తున్నారు. బీజేపీ వైఖరి తేలాల్సి ఉంది. ఇదే సమయంలో ప్రముఖ ఎన్నికల విశ్లేషకులు ఏపీలో పబ్లిక్ పల్స్ ఏంటనేది బయట పెట్టారు. అనూహ్య ఫలితాలు వెల్లడించారు.

ప్రముఖ సెఫాలజిస్ట్..ఎన్నికల ఫలితాల విశ్లేషకులు పార్ధదాస్ ఏపీలో ప్రజల మూడ్ ఏంటనేది వెల్లడించారు. ఏపీలో తాజాగా నిర్వహించిన సర్వేలో పబ్లిక్ పల్స్ ఎలా ఉందో బయట పెట్టారు. పార్ధదాస్ వెల్లడించిన నివేదిక ప్రకారం వైసీపీకి 46 శాతం ప్రజల మద్దతు ఉంది. అదే విధంగా టీడీపీకి 40 శాతం, జనసేనకు 11 శాతం మద్దతు ఉన్నట్లు వెల్లడించారు.

ఇతరులకు ఒక శాతం మాత్రమే ప్రజా మద్దతు ఉందని విశ్లేషించారు. అదే విధంగా పార్లమెంట్ ఎన్నికల్లో వైసీపీకి 48 శాతం మద్దతు ఉండగా.. టీడీపీకి 43 శాతం మద్దతు ఉన్నట్లు తేల్చారు. జనసేనకు 8 శాతం మంది ప్రజల మద్దతు ఉందని చెప్పుకొచ్చారు. కాంగ్రెస్ కు 1 శాతం మాత్రమే మద్దతు లభిస్తున్నట్లు వెల్లడించారు.

ఇక..ముఖ్యమంత్రిగా ప్రజా మద్దతు పైనా ప్రజానాడి ఏంటనేది బయట పెట్టారు. జగన్ ముఖ్యమంత్రిగా 46 శాతం మంది ప్రజలు కోరుకుంటుండగా..చంద్రబాబు సీఎం కావాలని 36 శాతం మంది ప్రజలు కోరుకుంటున్నట్లు వెల్లడించారు. లోకేష్ సీఎంగా 8 శాతం ప్రజలు..పవన్ కల్యాణ్ ముఖ్యమంత్రిగా 10 శాతం మంది కోరుకుంటున్నారని విశ్లేషించారు. ప్రధానిగా ఏపీలో మోదీకి 42 శాతం మంది ప్రజల మద్దతు ఉండగా..రాహుల్ గాంధీకి 39 ప్రజల మద్దతు ఉందని తేల్చారు. ఇక..19 శాతం ప్రజలు ఎవరినీ తమ ప్రాధాన్యతగా తేల్చుకోలేదు. ఏపీలోని నాలుగు అసెంబ్లీ సెగ్మెంట్లలో చేసిన ప్రజాభిప్రాయం మేరకు ఈ ఫలితాలు వెల్లడించినట్లు స్పష్టం చేసారు. రాజమండ్రి సిటీ, శ్రీకాళహస్తి, పెదకూరపాడు, నెల్లూరు సిటీ నియోజవకర్గాల్లో శాంపిల్స్ సేకరించినట్లు స్పష్టం చేసారు.

గతంలో తెలంగాణ ఎన్నికల సమయంలోనూ పార్ధదాస్ కాంగ్రెస్ కు అనుకూలంగా అంచనాలు వెల్లడించారు. అయితే, ఈ నివేదికలో టీడీపీ – జనసేన వేర్వేరుగా ప్రస్తావన చేసారు. ఇప్పుడు ఈ రెండు పార్టీలు పొత్తు ఖరారు చేసుకొని కలిసి పోటీ చేస్తున్నాయి. అయినా..ముఖ్యమంత్రి ఎవరు ఉండాలనే అంశంలో చంద్రబాబు కంటే జగన్ కు 10 శాతం మంది ప్రజల మద్దతు ఎక్కువగా కనిపిస్తోంది. ప్రతీ వారం ఇదే విధంగా అంచనాలను వెల్లడిస్తామని స్పష్టం చేసారు. గెలుపు పైన మూడు పార్టీలు ధీమా వ్యక్తం చేస్తుండగా..మేనిఫెస్టో..సంక్షేమ పథకాలు..సామాజిక సమీకరణాలు ఏపీ ఎన్నికల్లో కీలక పాత్ర పోషించనున్నాయి. దీంతో..ఈ అంచనాల పైన రాజకీయంగా చర్చ మొదలైంది.

Leave a Reply

Dimple Hayathi In Shankars Movie keerthi suresh