ఆ నటి నాన్న ఒప్పుకునుంటే సల్మాన్‌ఖాన్‌కు పెళ్లయిపోయేది!

Salman Khan: ఆ నటి నాన్న ఒప్పుకునుంటే సల్మాన్‌ఖాన్‌కు పెళ్లయిపోయేది!

బాలీవుడ్‌ కండలవీరుడు సల్మాన్‌ ఖాన్‌ క్రేజ్‌ నుంచి ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ అటు వెండితెర, ఇటు బుల్లి తెరను ఊపేస్తున్నాడు. బిగ్ బాస్ షోతో సల్మాన్ ఖాన్ అందరికీ దగ్గరయ్యాడు. విజయవంతంగా 14 సీజన్లన నడిపించాడు.ఆయన తెరపై కనిపిస్తే చాలు లేడి ఫ్యాన్స్ చేసే హంగామా అంతా ఇంతా కాదు. ఐదు పదుల వయసులోనూ యాక్షన్‌ సినిమాలు చేస్తూ బాక్సాఫీస్‌ దగ్గర కోట్లు కొల్లగొడుతున్నాడు.

ఇక బాలీవుడ్‌ మోస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచ్‌లర్‌ లిస్ట్‌లో సల్మాన్‌ తొలిస్థానంలో ఉంటాడు. ఆయనను నిదర్శంగా తీసుకుని ఎందరో నటులు బ్యాచ్‌లర్‌ లైఫ్‌ను కొనసాగిస్తున్నారు. కాగా సల్మాన్‌ పెళ్లి గురించి నిత్యం ఏదో ఒక వార్త చక్కర్లు కొడుతూనే ఉంటుంది. కాగా తాజాగా సల్మాన్‌ పెళ్లికి సంబంధించిన ఓ వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతుంది.

స్వయంగా సల్మాన్‌ తన ప్రేయసి గురించి ఆ వీడియోలో వెల్లడించాడు. బాలీవుడ్‌ సీనియర్‌ నటి జూహీ చావ్లాను పెళ్లిచేసుకోవాలనుకున్నాని, ఇదే విషయం వాళ్ల నాన్నకు చెప్తే తను అంగీకరించలేదని సల్మాన్‌ చెప్పాడు. ఎందుకు అని యాంకర్‌ అడుగగా నేను వాళ్లకు సరిపోనని అనుకున్నారేమో అంటూ నవ్వుతూ చెప్పాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్‌ మీడియాను షేక్‌ చేస్తుంది. కాగా ఈ వీడియో ఇప్పటిది కాదు. పాతికేళ్ల క్రితంది. అప్పుడు ఓ ఇంటర్వూలో భాగంగా సల్మాన్‌ ఇలా సరదాగా తన లవ్‌స్టోరీ గురించి చెప్పాడు. తాజాగా సల్మాన్‌ అభిమాని ఒకరు ఈ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్‌ చేశాడు. దాంతో ఇప్పుడు ఆ వీడియో ట్రెండింగ్‌లో నిలిచింది.

ఈ వీడియోపై పలువురు నెటీజన్లు వాళ్ల నాన్న ఒప్పుకుంటే బాగుండేది అంటూ కామెంట్స్‌ చేస్తున్నారు. కాగా సల్మాన్‌ గతంలో పలువురు బాలీవుడ్‌ హీరోయిన్లతో డేటింగ్‌ చేసినట్లు వార్తలు కూడా వచ్చాయి. ఇక సల్మాన్‌ సినిమాల విషయానికొస్తే ప్రస్తుతం ఆయన కిసీ కా భాయ్‌ కిసీ కి జాన్‌, టైగర్‌-౩ సినిమాలు చేస్తున్నాడు. ఈ రెండు సినిమాలు ఇదే ఏడాది ప్రేక్షకుల ముందుకు రానున్నాయి.

 

 

 

 

 

Leave a Reply

Dimple Hayathi In Shankars Movie keerthi suresh