వివాదంలో డింపుల్ హయాతి.. అసలు ఏమి జరిగిందంటే ?

ఖిలాడి, రామబాణం చిత్రాలతో డింపుల్ హయతి హీరోయిన్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్న. హీరోయిన్ డింపుల్ హయతిపై జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ లో క్రిమినల్ కేసు నమోదైంది.  ట్రాఫిక్ విభాగంలో డీసీపీగా పనిచేసే ఐపీఎస్ అధికారి రాహుల్ హెగ్డే అధికారిక వాహనాన్ని కాలితో తన్ని, కారుతో ఢీకొట్టిందని ఆమెపై  కేసు నమోదైంది.

జూబ్లీహిల్స్‌ జర్నలిస్ట్‌ కాలనీ హుడా ఎన్‌క్లేవ్‌లో ఉన్న ఎస్‌కేఆర్‌ ఎన్‌క్లేవ్‌ అపార్ట్‌మెంట్స్‌లో నివాసముంటున్న ఐపీఎస్‌ అధికారి ట్రాఫిక్‌ విభాగంలో డీసీపీగా పనిచేస్తున్నారు. ఇదే అపార్ట్ మెంట్లోని ఫ్లాట్‌ నంబర్‌ సీ (2)లో టాలీవుడ్‌ హీరోయిన్‌ డింపుల్‌ హయతీ తన బోయ్ ప్రెండ్ విక్టర్‌ డేవిడ్‌తో కలిసి నివాసం ఉంటున్నారు.  ఆ భవంతికి  చెందిన పార్కింగ్‌ స్థలంలో పార్క్‌ చేసిన డీసీపీకి చెందిన అధికారిక వాహనానికి అడ్డుగా డింపుల్‌ హయతీ, విక్టర్‌ డేవిడ్‌లు తమ బీఎండబ్ల్యూ కారును పెట్టడంతో పాటు అకారణంగా కారు డ్రైవర్‌గా పనిచేస్తున్న కానిస్టేబుల్‌ ఎం.చేతన్‌ కుమార్‌తో వాగ్వాదానికి దిగుతుంటారు. తమ కారును తీసేందుకు వీలుగా కారు పార్క్‌ చేసుకోవాలని ఎన్ని సార్లు చెప్పినా వినిపించుకోకుండా పలుమార్లు అడ్డంకులు సృష్టిస్తున్నారు.

ఈ నేపధ్యం లో ట్రాఫిక్ డిసిపి డ్రైవర్ చేతన్ కుమార్ ఫిర్యాదు మేరకు నటి డింపుల్ హయతిపై 353, 341, 279 సెక్షన్ల క్రింద పోలీసులు కేసు నమోదు చేశారు. డింపుల్ హయతి పై ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేసిన కేసు పెట్టారు పోలీసులు. దీంతో ఆమెపై క్రిమినల్ కేసు నమోదైంది. గతంలోనూ వీరికి పార్కింగ్ విషయంలో వివాదం జరిగిందని, ఆమెకు ఎన్నిసార్లు నచ్చ చెప్పడానికి ప్రయత్నం చేసిన తీరు మార్చుకోలేదని చెబుతున్న పోలీసులు కేసు పెట్టారు.

ఇప్పుడే కాదు డింపుల్ పలుమార్లు ఇలాగే ప్రవర్తించిందని రాహుల్ తన  ఫిర్యాదులో తెలిపారు.  అయితే నచ్చజెప్పేందుకు పలుమార్లు ఫయత్నించినా కూడా ఆమె తీరు మార్చుకోలేదు . దీంతో ఫిర్యాదు చేసినట్టుగా రాహుల్  వెల్లడించారు. దీంతో డింపుల్ తో పాటుగా డేవిడ్ ను  కూడా పోలీస్ స్టేషన్ కు పిలిపించారు  పోలీసులు.  వారిద్దరినీ  ఈ విషయంలో హెచ్చరించి CRPC 41a కింద నోటీసులు ఇచ్చి, మరోసారి విచారణకు అవసరమైతే రావాలని చెప్పి పంపించారు.

అయితే తనపై నమోదు చేసిన పోలీస్ కేసు, ఐపీఎస్‌తో వివాదం నేపథ్యంలో డింపుల్ ట్విట్టర్ ద్వారా స్పందించారు. అసలు గొడవ ఏంటీ అన్న విషయాన్ని ప్రస్తావించకుండా వరుస ట్వీట్లు చేశారు. ‘‘అధికారాన్ని వాడి తప్పుల్ని అడ్డుకోలేరు’’, ‘‘అధికారాన్ని దుర్వినియోగం చేసి తప్పుల్ని కప్పిపుచ్చలేరు.. సత్యమేవజయతే’’ అంటూ ట్వీట్స్‌ చేశారు. ప్రస్తుతం ఈ ట్వీట్స్ వైరల్ అవుతున్నాయి. అయితే మొత్తం ఈ వివాదంలో తప్పు ఎవరిది అనేది తేలాలంటే సీసీటీవీ ఫుటేజ్ ఒక్కటే మార్గం. ప్రస్తుతం ఫుటేజ్‌ను విశ్లేషించే పనిలో వున్నారు పోలీసులు. దీనిని బట్టి నేరం ఎవరిదో తేల్చనున్నారు.

Leave a Reply

Dimple Hayathi In Shankars Movie keerthi suresh