మంచి మార్కులు కొట్టేసిన బెల్లంకొండ శ్రీనివాస్

ఎస్.ఎస్.రాజమౌళి తెరకెక్కించిన బిగ్గెస్ట్ కమర్షియల్ హిట్స్ లో ఒకటైన ఛత్రపతి సినిమాను ఇప్పుడు హిందీలో రీమేక్ చేస్తున్నారు. హిందీ రీమేక్ లో బెల్లంకొండ శ్రీనివాస్, నుష్రత్ భరూచా ప్రధాన పాత్రల్లో నటించారు. వి.వి.వినాయక్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా టీజర్ విడుదలై టాక్ ఆఫ్ ది టౌన్ గా మారింది.

శుక్రవారం బెల్లంకొండ శ్రీనివాస్ తన ట్విట్టర్ ద్వారా టీజర్ విడుదల విషయాన్ని అభిమానులతో పంచుకున్నారు. బెల్లంకొండ శ్రీనివాస్ ట్విట్టర్ లో ఇలా రాశాడు, “లెట్స్ ది యాక్షన్ బిగిన్ ! ఛత్రపతి టిజర్ విడుదల అయింది  అంటూ ఛత్రపతి కి  రచన విజయేంద్ర ప్రసాద్, దర్శకత్వం: VV వినాయక్. అని ఈ చిత్రం 2023 మే 12న థియేటర్లలోకి వస్తుందని’ వ్రాసారు.

టీజర్ లో బెల్లంకొండ శ్రీనివాస్ గూండాలతో ఫైట్ చేస్తూ కనిపించాడు. ఆయన యాక్షన్ సీక్వెన్స్ లు నిజంగానే అందర్నీ కట్టిపడేస్తున్నాయి. ఛత్రపతి టీజర్ చాలా యాక్షన్, డ్రామాతో నిండి ఉంది. ఆయనను వెండితెరపై చూసేందుకు అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ఒరిజినల్ తెలుగు చిత్రం ఛత్రపతిలో శ్రియ శరణ్, భానుప్రియ, షఫీ, ప్రదీప్ రావత్, నరేంద్ర ఝా, కోట శ్రీనివాసరావు తదితరులు ముఖ్యపాత్రలు పోషించారు.

యాక్షన్ ప్యాక్డ్ టీజర్ తో అభిమానులను ఆకట్టుకున్న ఈ నటుడు ఇప్పుడు దాని గురించి పొగడ్తలతో ముంచెత్తకుండా ఉండలేకపోతున్నారు. టీజర్ లో నటుడి ఇంటెన్స్ పర్సనాలిటీ అభిమానులను ఉర్రూతలూగించగా, టీజర్ సినిమాపై బలమైన బజ్ క్రియేట్ చేసింది.

బెల్లంకొండ శ్రీనివాస్ తొలి హిందీ చిత్రం ఛత్రపతిలో నుష్రత్ భరూచా, భాగ్యశ్రీ, శరద్ కేల్కర్ కీలక పాత్రలు పోషించారు. ఈ సినిమాకి దర్శకత్వం వి వి వినాయక్ నిర్వహించారు మరియు రచన విజయేంద్ర ప్రసాద్ నిర్వహించారు. 2023 మే 12న ఛత్రపతి థియేటర్లలో విడుదల కానుంది.

ఒకనొక సందర్భంలో మీడియా అడిగిన ప్రశ్నకు బెల్లంకొండ శ్రీనివాస్ మాట్లాడుతూ “అత్యంత థ్రిల్లింగ్ అండ్ ఎంగేజింగ్ మాస్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా రూపొందిన ‘ఛత్రపతి’ లాంటి స్పెషల్ సినిమాతో బాలీవుడ్ ఎంట్రీ ఇవ్వడం ఆనందంగా ఉంది. ఈ సినిమా కోసం పనిచేసిన ప్రతి క్షణం ఛాలెంజింగ్ గా అనిపించింది మరియు చివరికి భారతదేశం అంతటా ప్రేక్షకులకు అందించడానికి మేము చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నాము”  అని అన్నారు.

అలాగే నిర్మాత డా.జయంతిలాల్ గడా మాట్లాడుతూ “రాజమౌళి తెరకెక్కించిన ఛత్రపతి పాన్ ఇండియా ఆడియన్స్ కి నచ్చే విధంగా ఉంది. అత్యంత ప్రతిభావంతుడైన శ్రీనివాస్ బెల్లంకొండను సరికొత్త మార్కెట్ కు పరిచయం చేయడమే కాకుండా మెయిన్ స్ట్రీమ్ ఎంటర్ టైనర్ కు కావాల్సిన అన్ని అంశాలు ఈ సినిమాలో ఉన్నాయి. దేశవ్యాప్తంగా ఉన్న సినీ ప్రియులకు ‘ఛత్రపతి’ని తీసుకురావడం పట్ల పెన్ స్టూడియోస్ వారు హర్షం వ్యక్తం చేశారు.

ఇక బెల్లంకొండ శ్రీనివాస్ విషయానికొస్తే తెలుగులో అల్లుడు శీను, జయ జానకి నాయక, సాక్ష్యం, సీత, రాక్షసుడు, అల్లుడు అదుర్స్ వంటి చిత్రాల్లో నటించారు.

 

Leave a Reply

Dimple Hayathi In Shankars Movie keerthi suresh