ప్రారంభమైన IPL 023 ప్రముఖ హీరోయిన్లు డాన్స్ లతో హోరెత్తిన స్టేడియం

 IPL 023 :ప్రముఖ హీరోయిన్లు డాన్స్ లతో హోరెత్తిన స్టేడియం

రెండు నెలల పాటు క్రికెట్ అభిమానులకు కావాల్సినంత మజా అందించేందుకు మెగా టోర్నీ ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్‌) సిద్ధమైంది. అహ్మదాబాద్‌ లోని నరేంద్ర మోడీ స్టేడియంలో ఐపీఎల్ ప్రారంభ వేడుకలు కొద్దిసేపటి క్రిందే అట్టహాసంగా జరిగాయి. గాయకుడు అరిజిత్ సింగ్ తన గానంతో తొలుత ప్రేక్షకులను మైమరపించగా, ప్రముఖ హీరోయిన్లు తమన్నా భాటియారష్మిక మందన్నతెలుగు పాటలతో ప్రేక్షకులను ఉర్రూతలూగించారు. హీరోయిన్‌ తమన్నా ఐపీఎల్‌-2023 ఆరంభ వేడుకల్లో స్టెప్పులతో దుమ్మురేపింది.  తన డ్యాన్స్‌తో అభిమానులను అలరించింది.  టమ్‌ టమ్‌ అంటూ ట్రెండింగ్‌ సాంగ్ కు ఇరగదీసింది. పుష్ప సినిమాలోని ఊ అంటావా మామా అంటూ ఫ్యాన్స్ ను ఉర్రూతలూగించింది.

పుష్ప మూవీతో పాన్‌ ఇండియా హీరోయిన్ గా మారిన  రష్మిక మందన్నా..ఐపీఎల్ ప్రారంభ వేడుకల్లో సందడి చేసింది. పుష్ప సినిమాలోని  సామీ సామీ సాంగ్ కు తనదైన శైలిలో డ్యాన్స్ చేస్తూ..అభిమానులను ఆకట్టుకుంది. అంతేకాదు..ఆర్ఆర్ఆర్ సినిమాలోని నాటు నాటుకు డ్యాన్సులతో వాహ్వా అనిపించింది.   శ్రీవల్లి పాటతో పాటు గంగూభాయ్‌ కతియావాడీలోని డోలీడా పాటకు సూపర్ డ్యాన్స్ తో కేక పెట్టించింది.

వీరితో పాటు..బాలీవుడ్‌ సింగర్‌ అర్జిత్‌ సింగ్‌ ..హిందీ సాంగ్స్ తో  అభిమానుల్లో మరింత ఊపు తెచ్చాడు. నటి మందిరా బేడి ఐపీఎల్‌ యాంకర్‌గా పునరాగమనం చేసింది. ఆరంభ వేడుకులకు హోస్ట్‌గా వ్యవహరించింది.

ఐపీఎల్ ఓపెనింగ్ సెర్మనీకి  బీసీసీఐ అధ్యక్షుడు రోజర్‌ బిన్నీ, కార్యదర్శి జై షా హాజరయ్యారు.   గుజరాత్ టైటాన్స్‌, చెన్నై సూపర్‌ కింగ్స్‌ జట్ల అభిమానులతో నరేంద్ర మోదీ స్టేడియం పూర్తిగా నిండిపోయింది.

అలాగే అరిజిత్ సింగ్ పాటలకు, తమన్నా, రష్మిక డ్యాన్సులకు స్టేడియంలోని వేలాదిమంది ప్రేక్షకులు తమనుతాము మైమరిపోయారు. ప్రదర్శన అనంతరం గుజరాత్ టైటాన్స్-చెన్నై సూపర్ కింగ్స్ మధ్య మ్యాచ్ మొదలుకాబోతున్నట్టు ప్రెజెంటర్ మందిరా బేడీ ప్రకటించారు. ఇరు జట్ల కెప్టెన్లు మహేంద్రసింగ్ ధోనీ, హార్దిక్ పాండ్యాలను వేదికపైకి పిలిచారు. వారిద్దరూ వేదికపైనున్న బీసీసీఐ కార్యదర్శి జే షా, రోజర్ బిన్నీ, రష్మిక, తమన్నా, అరిజిత్ సింగ్‌లను పరిచయం చేసుకున్నారు

 

 

Leave a Reply