తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి అనేది పెద్ద పండుగ. సంక్రాంతి పండుగ సందర్భంగా తెలనగానలో ఉద్యోగాలు చేస్తున్న వారికి ఆంధ్ర ప్రదేశ్ RTC శుభవార్త తెలిపింది. సంక్రాతి పండుగను తమ స్వగ్రామాలకు వెళ్లి సంబరాలు చేసుకునేకి. APSTRTC ప్రత్యేక బస్సులని కేటాయించనుంది. ఆ రోజు రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలకు ప్రత్యేక బస్సులు నడపనున్నట్లు తెలంగాణ ఆర్టీసీ ఇప్పటికే ప్రకటించింది. ప్రభుత్వ బస్సు ప్రయాణం సురక్షితం మరియు తక్కువ ఖర్చుతో ప్రయాణించవచ్చు. ప్రజలు RTC వెబ్సైట్ లేదా టికెటింగ్ కేంద్రాలలో ముందుగానే టిక్కెట్లను కొనుగోలు చేయవచ్చు. ముందుగా టికెట్ రిజర్వేషన్ సదుపాయాన్ని వినియోగించుకుని సీటు వచ్చేలా చూసుకోవాలని అధికారులు ప్రజలను కోరుతున్నారు.
ఇప్పటికే టీఎస్ఆర్టీసీ సంక్రాంతి కోసం ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేసింది. 4,233 ప్రత్యేక బస్సులను సొంతుళ్లకు వెళ్లే ప్రజల కోసం నడపనుంది. వచ్చేనెల 7 నుంచి 15వ తేదీ వరకు ప్రభుత్వం సర్వీసులు అందించనున్నాయి. ఇప్పటికే ముందుగా రిజర్వేషన్ కోసం ప్రభుత్వ్యం 585 బస్సు సర్వీసు సౌకర్యం కలిపించారు. ఈ విషయాన్నీ TSRTC MD సజ్జనార్ తెలిపారు. ముందుకంటే ఈ ఏడాది 10 శాతం ఎక్కువ బస్సులని నడుపుతున్నట్టు అయన పేర్కొన్నారు.
అమలాపురం, కాకినాడ, కందుకూరు, విశాఖపట్నం, పోలవరం, రాజమండ్రి ప్రాంతాలకు గతంలో కంటే ఎక్కువ బస్సులు నడపనున్నారు. మీరు ఈ బస్సుల కోసం మీ టిక్కెట్లను 60 రోజుల వరకు ముందుగానే బుక్ చేసుకోవచ్చు. ఈ విధానం వచ్చే ఏడాది జూన్ వరకు అమల్లో ఉంటుంది.