YV Subbareddy : శ్రీవాణి ట్రస్ట్ విరాళాలపై శ్వేతపత్రం విడుదలచేసిన టీటీడీ

YV Subbareddy

YV Subbareddy : శ్రీవాణి ట్రస్ట్ విరాళాలపై శ్వేతపత్రం విడుదలచేసిన టీటీడీ

YV Subbareddy : శ్రీవాణి ట్రస్ట్ నిధులపై టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి శ్వేతపత్రం విడుదల చేశారు. ఈసందర్భంగా వైవీ సుబ్బారెడ్డి మాట్లాడుతూ… శ్రీవాణి ట్రస్టు ద్వారా విరాళాలు, నిధుల సేకరణ

కార్యక్రమాలకు సంబంధించి పారదర్శకతని పాటిస్తున్నామన్నారు. శ్రీవాణి ట్రస్టును ప్రారంభించిన తరువాత దళారీ వ్యవస్థను రూపుమాపామని ఆలయాల నిర్మాణంకు, దళారి వ్యవస్థని అరికట్టడానికి

శ్రీవాణి ట్రస్ట్ లో దర్శన విధానాన్ని ప్రారంభించామన్నారు. 70 మంది దళారీలను అరెస్ట్ చెయ్యడంతో పాటు, దళారుల పై 214 కేసులు నమోదు చేసామన్నారు. శ్రీవాణి ట్రస్ట్ కి భక్తులు ఇచ్చిన విరాళాలకు

టిక్కేట్లతో పాటు రసీదు ఇస్తున్నామన్నారు. 2019 సెప్టెంబర్ 23 నుంచి శ్రీవాణి ట్రస్ట్‌కు విరాళాలు సమర్పించిన భక్తులకు వీఐపీ బ్రేక్ దర్శనం కల్పిస్తున్నామని చెప్పారు. అప్పటి నుంచి శ్రీవాణి ట్రస్ట్‌కు

భక్తుల నుంచి భారీ స్పందన లభిస్తోందన్నారు. శ్రీవాణి ట్రస్టు ద్వారా ఇప్పటి వరకూ 860 కోట్లను దాతలు సమర్పించారని అన్నారు. 8,24,400 మంది భక్తులు శ్రీవాణి ట్రస్టు ద్వారా దర్శనం

చేసుకున్నారని తెలిపారు. శ్రీవాణి ట్రస్టు నిధులు ఎక్కడా దుర్వినియోగం కావడం లేదని స్పష్టం చేశారు. శ్రీవాణి ట్రస్టు నిధులు వివిధ బ్యాంకుల్లో రూ.602.60 కోట్ల డిపాజిట్లు ఉన్నాయని.. సేవింగ్స్

ఖాతాలో రూ.139 కోట్ల నిధులు ఉన్నాయని తెలిపారు. శ్రీవాణి ట్రస్టు నిధుల డిపాజిట్ల ద్వారా రూ.36.50 కోట్ల వడ్డీ వచ్చిందని వెల్లడించారు.

శ్రీవాణి ట్రస్టు ద్వారా 8.25 లక్షల మంది భక్తులు శ్రీవేంకటేశ్వరస్వామివారిని దర్శించుకున్నారని వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. 176 పురాతన ఆలయాల పునరుద్ధరణకు రూ. 93 కోట్లు మంజూరు చేశామని,

వెనుకబడిన ప్రాంతాల్లో ఒక్కొక్కటి రూ.10 లక్షల వ్యయంతో మొత్తం 2,273 ఆలయాల నిర్మాణానికి ఆమోదం తెలిపామని చెప్పారు. వీటిలో 1953 ఆలయాలను ఏపీ దేవాదాయ శాఖ, 320 ఆలయాలను

సమరసత సేవ ఫౌండేషన్‌ నిర్మిస్తున్నామని తెలిపారు. ఏపీ, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక, పుదుచ్చేరి రాష్ట్రాల్లో 127 ప్రాచీన ఆలయాల పునరుద్ధరణకు రూ.139 కోట్లు కేటాయించామన్నారు. సుబ్బారెడ్డి

వివరించారు. భజన మందిరాలు, ఎస్సీ, ట్రైబల్ ప్రాంతాలలో 2,273 ఆలయాల నిర్మాణానికి పూనుకున్నట్లు చెప్పారు.

వివిధ ప్రాంతాల్లో ఆలయాల నిర్మాణం కోసం రూ.227 కోట్ల 30 లక్షలు కేటాయింపులు జరిగాయని వివరించారు. శ్రీవాణి ట్రస్ట్ నిధులపై ఎటువంటి అనుమానాలు వున్నా నేరుగా టీటీడీ ని

సంప్రదించవచ్చన్నారు. ఎవరితో తనికీ చేయించుకున్నా తమకు అభ్యంతరం లేదని ఆయన తెలిపారు

Leave a Reply

Dimple Hayathi In Shankars Movie keerthi suresh