Pawan : పవన్ కు మరో లేఖ రాసిన ముద్రగడ

Pawan

Pawan : పవన్ కు మరో లేఖ రాసిన ముద్రగడ

Pawan : ఆంధ్ర ప్రదేశ్ లో రాజకీయ పార్టీల రగడ తార స్థాయి కి చేరింది.  గోదావరి జిల్లాల్లో వారాహి ప్రచార యాత్ర చేస్తున్న జనసేనాని పవన్ కల్యాణ్.. ప్రభుత్వం విమర్శలు చేస్తుండటంతో పాటు.. కాపుల

సంక్షేమం గురించి కూడా వ్యాఖ్యలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో పవన్ భాషపై కాపునేత ముద్రగడ పద్మనాభం అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇప్పటికే ఒకసారి పవన్ కు లేఖ రాసిన ముద్రగడ.. తాజాగా మరో

లేఖ రాశారు. ఈ 3 పేజీల లేఖలో 30 ప్రశ్నలు సంధిస్తూనే.. కాకినాడ నుంచి కాకుంటే పిఠాపురం నుంచి పోటీ చేయగలరా? చేస్తే తనను పోటీకి రమ్మని సవాల్ చేయగలరా?

అయితే ఇటీవల తాను విడుదల చేసిన లేఖతో మీ అభిమానులతో తనను బండ బూతులు తిట్టిస్తున్నారని, మెస్సేజ్‌లు పెట్టిస్తున్నారని ముద్రగడ లేఖలో పేర్కొన్నారు. మీ మెస్సేజ్‌లకు లొంగిపోయే

వ్యక్తిని కాదని, అది ఈ జన్మలో జరగదని లేఖలో కౌంటరిచ్చారు. ‘ మీరు సినిమాలో హీరో అంతే  రాజకీయాల్లో మాత్రం మీరు జీరో అసలు  నన్ను తిట్టాల్సిన అవసరం మీకు, మీ అభిమానులకు

ఎందుకొచ్చింది. నీ వద్ద నేను నౌకరిగా పనిచేయడం లేదు కదా.. అటువంటప్పుడు నన్ను తిట్టించాల్సిన అవసరం ఏంటి?’ అని ముద్రగడ ప్రశ్నించారు. అలాగే పవన్ కు  రాసిన లేఖలో ముద్రగడ

ప్రస్తావించిన అంశాలు

కాకినాడ నుండి పోటీ చేయడానికి నిర్ణయం తీసుకోండి ఒకవేళ మీకు అంతా దమ్ము లేకపోతే  పిఠాపురం నుండి పోటీ చేయడానికి తమరు నిర్ణయం తీసుకుని నన్ను మీ మీద పోటీ చేయడానికి నాకు సవాలు

విసరండి అంటూ ప్రశ్నలు సంధించారు. తాజా లేఖలో ముద్రగడ పవన్ కు సంధించిన 30 ప్రశ్నలు ఇవే.

1.నన్ను మీరు, మీ అభిమానులు ఎందుకు తిడుతున్నారు ?

2. నేను మీ దగ్గర నౌకరునా ?

3.నేను మీకు తొత్తులుగా ఉండాలా ?

4.మీకు నాకు సంబంధం ఏంటి ?

5.నాకు సొంత అభిప్రాయాలు ఉండకూడదా?

6.మీరు ఏమన్నా పడతానన్న గర్వమా?

7.రంగా హత్య నిందితుల్ని పలకరించారా ?

8.వాళ్ల కుటుంబాలను ఏ రోజైనా పలకరించారా ?

9. జైల్లో ఉన్నవాళ్లకు బెయిల్ ఇప్పించేందుకు ప్రయత్నించారా ?

10.1988 నాటి కాపు కేసులపై అప్పటి సీఎంతో మాట్లాడారా ?

11.1993లో కాపులను చావబాదిన వ్యవహారంపై స్పందించారా ?

12.1994లో కాపు ఉద్యమకారులపై కేసులు ఎత్తివేయాలని కోరారా ?

13.2016 తుని ఘటన బాధితులను పరామర్శించారా ?

14. తుని ఘటన కేసుల్ని జగన్ ఎత్తివేసినట్లు మీకు తెలీదా?

15.కాపు కులాన్ని నేను స్వార్థం కోసం వాడుకుంటున్నానా?

16. గోచీ మొలతాడు లేనివాళ్లతో తిట్టిస్తే ఏం లాభం?

17.కాపుల గురించి మాట్లాడే నైతిక హక్కు మీకు ఉందా ?

18.జిల్లాకు అంబేద్కర్ పేరు విషయమై కాపులపై కేసులు లేవా?

19. నిత్యం మిమ్మల్నే స్మరించేవారి కోసం మీరెందుకు వెళ్లరు?

20.మీ కోసం అందరూ రోడ్డు మీదికి రావాలా?

21. రోడ్డు మీదకు వచ్చినవారికి ఆపదొస్తే పట్టించుకోరా?

22.మీ సినిమాలు విడుదలైతే ఫ్యాన్స్ కు వేలాది రూపాయల ఖర్చెందుకు?

23.నన్ను పోలీసులు బూటుకాళ్లతో తన్నినపుడు మీరెక్కడ?

24.మీ బాంచెన్ దొర అనకపోతే నన్ను తిడతారా?

25.నా ఫ్యామిలీని బూతులు తిడితే మీరేమైపోయారు?

26. కాకినాడ ఎమ్మెల్యేతో కలిపి నన్నెందుకు తిట్టారా?

27.కాకినాడ నుంచి పోటీ చేసే ధైర్యం మీకు ఉందా?

28. కాకినాడ వద్దనుకుంటే పిఠాపురం నుంచి పోటీ చేస్తారా?

29.నన్ను మీకు పోటీగా రమ్మని సవాల్ విసరగలరా?

30. మీ వాళ్లతో తిట్టించి నన్ను పోటీకి లాగుతున్నారా? ముద్రగడ రాసిన లేఖలపై పవన్ స్పందిస్తారా ? ఆయన సంధించిన ప్రశ్నలన్నింటికీ జవాబిస్తారా ? లేక మరో బహిరంగసభలో ఈ అంశాన్ని లేవనెత్తి మరిన్ని విమర్శలు చేస్తారా ? అన్నది చూడాలి.

Leave a Reply

Dimple Hayathi In Shankars Movie keerthi suresh