YSRCP: వైఎస్ వివేక విచారణ గడువు పొడిగింపు

YSRCP

YSRCP: వైఎస్ వివేక విచారణ గడువు పొడిగింపు

YSRCP: మాజీ మంత్రి వివేకా హత్య కేసులో కడప ఎంపీ అవినాష్‌ రెడ్డికి బెయిల్‌ వ్యవహారంపై వివేకా కుమార్తె సునీత సుప్రీం కోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌పై వాదనలు ముగిశాయి. ఆమె తరఫున సీనియర్‌ న్యాయవాది సిద్ధార్థ లూథ్రా, అవినాష్‌ తరఫున మరో సీనియర్‌ న్యాయవాది ముకుల్‌ రోహత్గీ వాదనలు వినిపించారు.  సీబీఐకి హైకోర్టు అలాంటి నిబంధనలను విధించడం సరికాదని పేర్కొంది. హైకోర్టు ఆదేశాల వల్ల సీబీఐ దర్యాప్తుపైనా ప్రభావం పడుతుందని సుప్రీం కోర్టు పేర్కొంది. ఈ హత్య కేసులో దర్యాప్తు గడువును జూన్‌ 30 వరకు పొడిగించింది. గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాల మేరకు ఆ గడువు ఏప్రిల్‌ 30కి ముగియాల్సి ఉంది. తాజా ఉత్తర్వులతో సిబిఐకి మరో రెండు నెలల అదనపు గడువు వచ్చినట్టయింది.

అయితే YSRCP ఎంపీ అవినాష్ రెడ్డి నుంచి వాంగ్మూలాన్ని లిఖితపూర్వకంగానే తీసుకోవాలని.. రాతపూర్వకంగా తీసుకోవాలన్న హైకోర్టు ఆదేశాలను రద్దు చేసింది సుప్రీంకోర్టు. అయితే ముందస్తు బెయిల్ అంశాన్ని మాత్రం హైకోర్టులోనే తేల్చుకోవాలని. సుప్రీంకోర్టు వరకు రావాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది న్యాయస్థానం.  ముందస్తు బెయిల్ పై హైకోర్టులో తేల్చేవరకు అరెస్ట్ చేయకుండా ఆదేశాలు ఇవ్వాలన్న అవినాష్ రెడ్డి తరపు లాయర్ అభ్యర్థనను తోసిపుచ్చింది కోర్టు. సీబీఐ విచారణ సక్రమంగా జరుగుతుందనే అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది కోర్టు. సీబీఐ అరెస్ట్ చేయాలని అనుకుంటే ఎప్పుడో అరెస్ట్ చేసేదని.. మీరు ఎందుకు అలా భావిస్తున్నారని అవినాష్ రెడ్డి తరపు లాయర్ ను ప్రశ్నించింది సుప్రీంకోర్టు.

మరోవైపు ఈ కేసులో సీబీఐ ఈమధ్య అరెస్టు చేసిన అవినాష్ రెడ్డి తండ్రి భాస్కర్ రెడ్డి, అనుచరుడు ఉదయ్ కుమార్ రెడ్డి నుంచి ఐదు రోజుల పాటూ సీబీఐ కీలక సమాచారం రాబట్టినట్లు తెలిసింది. ప్రస్తుతం వీరిద్దరు చంచల్‌గూడ జైలులో ఉన్నారు. వీరిని సీబీఐ.. ఏరోజుకారోజు కస్టడీలోకి తీసుకొని విచారిస్తోంది. విచారణ మొత్తాన్నీ ఆడియో, వీడియో రికార్డ్ చేస్తోంది. నేటితో వీరి విచారణ ముగియనుంది.

భాస్కర్ రెడ్డి ఇచ్చిన సమాచారం ఆధారంగా.. నిన్న మరోసారి పులివెందులకు వెళ్లిన సీబీఐ అధికారులు… అవినాష్ రెడ్డి, వివేకానంద రెడ్డి ఇళ్లలో తనిఖీలు చేశారు. ముందుగా వివేకా హత్య జరిగిన ఇంట్లోని బాత్‌రూమ్, హంతకులు.. గోడ దూకి పారిపోయిన ప్రదేశాన్ని పరిశీలించింది. సాక్ష్యాలు ఎలా తారుమారు అయ్యాయో గమనించారు. ఆ తర్వాత అవినాష్ రెడ్డి ఇంటికి వెళ్లారు. రెండు ఇళ్ల మధ్య దూరం ఎంత ఉందో చూశారు. అవినాష్ రెడ్డి పీఏతో మాట్లాడి.. కొంత సమాచారం రాబట్టారు.

 

 

Leave a Reply

Dimple Hayathi In Shankars Movie keerthi suresh