Virupaksha: షాక్ లో విరూపాక్ష డైరెక్టర్‌

Virupaksha

Virupaksha: షాక్ లో విరూపాక్ష డైరెక్టర్‌

Virupaksha: మెగా మేనల్లుడు సాయి ధరంతేజ్ తాజాగా నటిస్తున్న చిత్రం విరూపాక్ష.. సాయి ధరంతేజ్  యాక్సడెంట్ అయిన తర్వాత నటిస్తున్న సినిమా  కావడంతో అభిమానులు చాలా ఆత్రుతగా ఎదురుచూశారు. అయితే ఎట్టకేలకు ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. ధరమ్ తేజ్ హీరోగా సంయుక్త మీనన్ హీరోయిన్ గా  నటించిన ఈ సినిమా శుక్రవారం అంటే ఏప్రిల్ 21వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది. హారర్ థ్రిల్లర్ జానర్ లో రూపొందిన ఈ సినిమా మొదటి ఆట నుంచి ప్రేక్షకులను థ్రిల్ కు గురిచేస్తుంది. దాదాపుగా ఈ సినిమా చూసిన వారంతా సినిమా బాగుందని కామెంట్లు చేస్తున్నారు.

సాయి ధరమ్ తేజ్. వైవీఎస్ చౌదరి దర్శకత్వంలో రేయ్ సినిమాతో హీరోగా డెబ్యూ చేశాడు. కానీ ఈ సినిమా తర్వాత చేసిన పిల్లా నువ్వు లేని జీవితం మూవీ ముందుగా 2014లో విడుదలైంది. తర్వాత సుబ్రమణ్యం ఫర్ సేల్, సుప్రీమ్, చిత్ర లహరి, ప్రతిరోజూ పండగే వంటి హిట్స్ తన ఖాతాలో వేసుకున్నాడు. అయితే కెరీర్ లో ఎక్కువగా ఫ్లాప్స్ చూసిన సాయి డిఫరెంట్ పంథాలోనే సినిమాలు చేస్తున్నాడు.

ఇందులో భాగంగానే సాయి ధరమ్ తేజ్ తాజాగా నటించిన చిత్రం Virupaksha. తేజ్ కెరీర్ లో 15వ చిత్రంగా వచ్చిన ఈ సినిమాతో కార్తీక్ వర్మ దండు దర్శకుడిగా పరిచయం అయ్యారు.

సాయి ధరమ్ తేజ్ విరూపాక్ష సినిమాకు మంచి టాక్ తో పాటు బాక్సాఫీస్ వద్ద ప్రపంచవ్యాప్తంగా ఇప్పటికీ రూ. 37 కోట్ల గ్రాస్ , రూ. 20.82 కోట్ల షేర్ కలెక్షన్స్ సాధించింది. దీంతో చిత్ర బృందం సక్సెస్ ను ఎంజాయ్ చేస్తున్నారు . ఇక తన ఆక్సిడెంట్ తరువాత తొలి చిత్రంపై ప్రేక్షకుల రియాక్షన్ ఎలా ఉందో చూద్దామని విరూపాక్ష విడుదలైన తొలి రోజున థియేటర్లోకి వెళ్లిన డైరెక్టర్ కార్తిక్ వర్మ దండు కు ఊహించని షాక్ తగిలింది.

దర్శకుడు కార్తీక్ తోపాటు నిర్మాత బీవీఎస్ఎన్ ప్రసాద్ కలిసి శుక్రవారం హైదరాబాద్ లోని పలు థియేటర్లు చుట్టేశారు. ప్రేక్షకుల నుంచి వస్తున్న స్పందన చూసి దర్శకనిర్మాతలు ఇద్దరూ చాలా సంతోషించారు. కానీ ఆనందం ఎంతో సేపు నిలవలేదు. థియేటర్ లో ప్రేక్షకుల రెస్పాన్స్ చూస్తున్న డైరెక్టర్ కార్తీక్ వర్మ దండు మొబైల్ ఫొన్ ను గుర్తు తెలియని వ్యక్తి కొట్టేశాడు. ఆయనతో పాటు వచ్చిన నిర్మాత పర్సును కూడా ఎవరో కాజేశారు. అయితే థియేటర్ లో ఫోన్, పర్స్ పోవడంతో దర్శకనిర్మాతలు కార్తీక్, ప్రసాద్ లు  అయోమయంలో పడ్డారు.

Leave a Reply

Dimple Hayathi In Shankars Movie keerthi suresh