YS Jagan Vizag Tour: ఏపీ సీఎం జగన్ విశాఖ పర్యటన వాయిదా …
YS Jagan Vizag Tour: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఈ నెల 28న పార్వతీపురం మన్యం జిల్లా కురుపాంలో పర్యటించనున్నారు.
28వ తేదీ ఉదయం 8 గంటలకు సీఎం జగన్ తాడేపల్లిలోని నివాసం నుంచి బయలుదేరి.10 గంటలకు చినమేరంగి పాలిటెక్నిక్ కాలేజ్ హెలీప్యాడ్‌కు చేరుకుంటారు.
అక్కడి నుంచి కురుపాంలోని బహిరంగ సభ వేదిక వద్దకు చేరుకుంటారు. జగనన్న అమ్మ ఒడి పథకం నాలుగో ఏడాది నిధులు విడుదల చేసి.. ప్రజలనుద్దేశించి ప్రసంగిస్తారు.
అనంతరం అక్కడి నుంచి బయల్దేరి తాడేపల్లిలోని నివాసానికి చేరుకుంటారు.
సీఎం పర్యటన నేపథ్యంలో కురుపాంలో ఏర్పాట్లను ఆదివారం డిప్యూటీ సీఎం రాజన్నదొర, జడ్పీ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు, కలెక్టర్ నిశాంత్‌కుమార్, ఎస్పీ విక్రాంత్ పాటిల్ తదితరులు పరిశీలించారు.
సభకు వచ్చే ప్రజలకు ఏ ఇబ్బంది కలగకుండా చూసుకోవాలని డిప్యూటీ సీఎం ఆదేశించారు.
ఏర్పాట్లన్నీ పక్కాగా చేయాలన్నారు. రూ. 150 కోట్లతో కురుపాంలో గిరిజన ఇంజనీరింగ్ కళాశాల ఏర్పాటు చేస్తున్నారని తెలిపారు. ఈ పరిశీలనలో జేసీ గోవిందరావు,
ఐటీడీఏ పీవోలు విష్ణుచరణ్, కల్పనాకుమారి, డీఆర్వో వెంకటరావు, సబ్ కలెక్టర్ నూరుల్ కమర్, ఎమ్మెల్సీ తలశీల రఘురాం, ఎమ్మెల్యేలు పుష్పశ్రీవాణి, అలజంగి జోగారావు, వైసీపీ నేత పరీక్షిత్ రాజు పాల్గొన్నారు.
అలాగే సీఎం జగన్ పర్యటన నేపథ్యంలో రక్షణ అవసరాల దృష్ట్యా కల్టెకర్ నిశాంత్‌కుమార్ ఆదేశాల మేరకు కురుపాంలో విద్యా సంస్థలకు మూడు రోజుల పాటు సెలవు ప్రకటించారు.
బహిరంగ సభ, హెలీప్యాడ్‌ఏర్పాట్లు, ఉన్నతాధికారులు, పోలీసులు, ఇతర సెక్యూరిటీ సిబ్బంది ఉండడం కోసం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది.
సీఎం పర్యటన నేపథ్యంలో జియ్యమ్మవలస మండలం చినమేరంగిలోని పాలిటెక్నికల్ కళాశాల ఆవరణలో హెలీప్యాడ్ ఏర్పాటు చేయనున్నారు.
అక్కడకు రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్న కురుపాంలో ఓ ప్రైవేట్ పాఠశాలకు ఆనుకుని ఉన్న స్థలంలో సభా వేదికను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు.
ఆ ప్రాంతానికి సమీపంలో ఉన్న ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో వాహనాలను పార్కింగ్ చేయనున్నారు. సీఎం సెక్యూరిటీ కోసం కురుపాంలోని పోస్టుమెట్రిక్ బోయ్స్ హాస్టల్ వినియోగించనున్నారు.
ఈ క్రమంలో వాటితో పాటు ఆ గ్రామంలోని జడ్పీ హైస్కూల్, ప్రాథమిక పాఠశాలలు, ఏపీ మోడల్ స్కూల్, గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలలో పోలీసులు, ఇతర సిబ్బంది ఉండడం కోసం
ఈ నెల 26, 27, 28 వరకు మూడు రోజుల పాటు సెలవు ప్రకటించారు.