Rain Alert: తెలంగాణలో రానున్న ఐదు రోజుల పాటు వర్షాలు

Rain Alert

Rain Alert: తెలంగాణలో రానున్న ఐదు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం

Rain Alert:  నైరుతి రుతుపవనాల రాకతో ఇప్పటికే తెలంగాణలో వర్షాలు కురుస్తోన్నాయి. ఎండల తీవ్రత తగ్గి వానలు పడుతున్నాయి. గత మూడు రోజులుగా ఎక్కడచూసినా భారీ వర్షాలు కురుస్తున్నాయి.

అయితే రానున్న ఐదు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం  ఉందని వాతావరణ శాఖ తెలిపింది.

శనివారం వాయవ్య బంగాళాఖాతం పరిసరాల్లోని ఒడిశా, పశ్చిమ బెంగాల్‌ తీరాలకు దగ్గరలో సముద్ర మట్టం నుంచి 7.6 కిలోమీటర్ల వరకు ఆవర్తనం కొనసాగుతున్నదని వెల్లడించింది.

ఎత్తుకి వెళ్లే కొద్ది నైరుతి దిశగా కొనసాగుతుందని తెలిపింది. కాగా  నైరుతి రుతుపవనాలు రాష్ట్రంలోకి ప్రవేశించడంతో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో శనివారం వర్షం కురిసింది.

ఈ నేపథ్యంలో ఏడు జిల్లాలకు వాతావరణ కేంద్రం ఎల్లో హెచ్చరికలు జారీ చేసింది. రాష్ట్రంలో రాగల ఏడురోజుల పాటు వాతావరణం చల్లగా ఉంటుందని, అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురుస్తుందని తెలిపింది.

అలాగే సముద్రం  తీరం వెంబడి బలమైన గాలులు వీస్తాయని.. మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని హెచ్చరించారు అధికారుఅటు రాయలసీమ జిల్లాలోను మూడు రోజుల పాటు తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో

కూడిన జల్లులు కురిసే అవకాశం ఉందని తెలిపింది. బలమైన గాలులు గంటకు 30-40 కి.మీ. వేగంతో ఒకటి లేదా రెండు చోట్ల వీచే అవకాశముంది.

ఇవాళ కొమరం భీం ఆసిఫాబాద్, మంచిర్యాల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, వరంగల్, హనుమకొండ జిల్లాల్లో అక్కడక్కడ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ అధికారులు తెలిపారు.

అలాగే కొన్ని జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడతాయన్నారు.

ఇక 26వ తేదీ నుంచి 29వ తేదీ వరకు రాష్ట్రంలో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురుస్తాయని చెప్పారు. ఇక నిన్న రాత్రి హైదరాబాద్‌లో రాత్రి కుండపోత వర్షం కురవగా..

నేడు కూడా ఆకాశం మేఘావృతమే ఉంటుందని పేర్కొన్నారు. రాష్ట్రంలోకి నైరుతి రుతుపవనాలు ప్రవేశించాయి. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా అవి విస్తరిస్తున్నాయి.

అయితే రాష్ట్రం మొత్తం విస్తరించడానికి మరికొంత సమయం పట్టే అవకాశముందని వాతావరణశాఖ అధికారులు చెబుతున్నారు.

విస్తరించిన తర్వాత మరింత విస్తారంగా వానలు పడతాయని పేర్కొంటున్నారు.

Leave a Reply

Dimple Hayathi In Shankars Movie keerthi suresh