Modi : ప్రధాని నరేంద్ర మోదీకి దక్కిన మరో అరుదైన పురస్కారం

Modi

Modi : ప్రధాని నరేంద్ర మోదీకి దక్కిన మరో అరుదైన పురస్కారం

Modi : భారత ప్రధాని  నరేంద్ర మోదీ ప్రస్తుతం రెండు రోజుల ఈజిప్ట్ పర్యటనలో ఉన్న సంగతి తెలిసిందే.

ఈ సందర్భంగా ఈజిప్టు ప్రభుత్వం ప్రధాని నరేంద్ర మోదీని ఆ దేశ అత్యున్నత పౌర పురస్కారం ‘‘ది ఆర్డర్ ఆఫ్ ది నైల్’’తో సత్కరించింది.

ఈజిప్టు అధ్యక్షుడు అబ్దెల్ ఫతాహ్ ఎల్-సీసీ ప్రధానమంత్రి మోదీకి ఈ పురస్కారాన్ని అందజేశారు. నరేంద్ర మోదీ అందుకున్న 13వ అత్యున్నత రాష్ట్ర గౌరవం ఇది. ఇది.

. ప్రపంచంలోని వివిధ దేశాలు ప్రధాని మోదీకి ప్రదానం చేసిన 13వ అత్యున్నత పురస్కారం.

ఈజిప్టు టూర్ లో ఉన్న ప్రధాని మోదీ.. పురాతనమైన  అల్‌- హకీం- మసీదు ను  మసీదును మతపెద్దలతో కలిసి సందర్శించారు.

11వ శతాబ్దానికి చెందిన ఈ మసీదులో ఇటీవల చేపట్టిన పునరుద్ధరణ  పనులను దావూదీ బోహ్రా వర్గానికి తెలియజేశారు.

వెయ్యి సంవత్సరాల చరిత్ర కలిగిన ఈ మసీదు 13,560 చదరపు మీటర్ల పరిధిలో విస్తరించి ఉంది. ఇందులో ప్రధాన ప్రార్థనా మందిరమే ఐదువేల చ.మీ విస్తీర్ణంలో ఉంది.

దీనిని ఫాతిమిద్‌కు చెందిన దావూదీ బోహ్రా వర్గం వారు ఇటీవల పునరుద్ధరించారు. ఈ వర్గం జనాభా ఇండియాలో సుమారు 5 లక్షల వరకు ఉన్నట్లు తెలుస్తోంది.

ప్రధాని మసీదు సందర్శన సందర్బంగా దావూదీ బోహ్రా సంఘంలోని సభ్యుడు శుజావుద్దీన్ షబ్బీర్ తంబావాలా మాట్లాడుతూ.. ఈరోజు నిజంగా చారిత్రాత్మకమైనది.

భారత ప్రధాని నరేంద్ర మోదీ ఇక్కడికి రావడం.. మాతోనూ, మా సంఘంతోనూ మాట్లాడటం.. మమ్మల్ని వారి కుటుంబసభ్యుల్లా భావించి మా యోగక్షేమాలను అడిగి తెలుసుకోవడం చాలా సంతోషంగా ఉందన్నారు.

అనంతరం ఆయన హీలియోపోలిస్ అమరవీరుల యుద్ధ వాటికను సందర్శించారు. అమర వీరులకు నివాళి అర్పించారు. విజిటర్స్ బుక్‌లో సంతకం చేశారు.

మొదటి ప్రపంచ యుద్ధంలో వీరమరణం పొందిన 4,000 మంది భారత జవాన్ల పార్థిక దేహాలకు ఇక్కడే అంత్యక్రియలను నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ యుద్ధ వాటికను కామన్వెల్త్ వార్ గ్రేవ్స్ కమిషన్ నిర్వహిస్తోంది.

1967-73 మధ్యకాలంలో ఇజ్రాయెల్- ఈజిప్షియన్ ఘర్షణ సమయంలో ఇది పాక్షికంగా ధ్వంసమైంది. 1980లో అప్పటి భారత ప్రభుత్వం దీన్ని పునరుద్ధరించింది.

అప్పట్లో ఈజిప్టులోని భారత రాయబార కార్యాలయం దీన్ని సంరక్షించింది. అమరులైన భారత జవాన్ల పేర్లతో కూడిన ఓ ప్యానెల్, స్మారక చిహ్నాన్ని అప్పటి భారత ప్రభుత్వం ఏర్పాటు చేసింది.

తాజాగా ప్రధాని మోదీ ఈ స్మారక చిహ్నానికి నివాళి అర్పించారు.

ఈజిప్టులో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పర్యటించడం ఇదే తొలిసారి. 1997 తర్వాత, ఈజిప్టులో భారత ప్రధాని తొలి అధికారిక పర్యటన కూడా ఇదే.

Leave a Reply

Dimple Hayathi In Shankars Movie keerthi suresh