రష్యా-ఉక్రెయిన్ సంక్షోభాన్ని పరిష్కరించడానికి ప్రధాని కీలక నిర్ణయం

Willing To Join Any Peace Process To Solve Ukraine War

రష్యా-ఉక్రెయిన్ సంక్షోభాన్ని పరిష్కరించడానికి ప్రధాని కీలక నిర్ణయం

రష్యా-ఉక్రెయిన్ సంక్షోభాన్ని పరిష్కరించడానికి ప్రధాని కీలక నిర్ణయం రష్యా-ఉక్రెయిన్ సంక్షోభాన్ని పరిష్కరించడానికి ఎలాంటి శాంతి ప్రక్రియతో అయినా భాగస్వామ్యం కావడానికి భారతదేశం సుముఖంగా ఉందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. శనివారం రాష్ట్రపతి భవన్లోకి జర్మనీ ఛాన్సలర్ ఒలాఫ్ స్కోల్జ్‌ను స్వాగతిస్తూ నిర్వహించిన సమావేశంలో ప్రధాని మాట్లాడుతూ సీమాంతర ఉగ్రవాదాన్ని అంతం చేయడంతో పాటు, ప్రపంచవ్యాప్తంగా కొన్ని సంస్కరణాలు అవసమరమని ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో వాటిని రూపొందించాలని కోరారు. ఇక ఉక్రెయిన్ సంక్షోభాన్ని తన ప్రసంగంలో ప్రధానంగా ప్రస్తావించిన ఛాన్సలర్ స్కోల్జ్ ఈ వివాదం ప్రభావం వల్ల ప్రపంచం అల్లాడిపోతోందని, ముఖ్యంగా యూరోపియన్ యూనియన్-భారత్ మధ్య స్వేచ్ఛా వాణిజ్యంపై ప్రభావం పడిందని అన్నారు.

“కోవిడ్ మహమ్మారి, ఉక్రెయిన్ వివాదం మొత్తం ప్రపంచాన్ని ప్రభావితం చేశాయి. ముఖ్యంగా అభివృద్ధి చెందుతున్న దేశాలు వీటి వల్ల ప్రతికూలంగా ప్రభావానికి గురియ్యాయి.  ఉమ్మడి ప్రయత్నాల ద్వారా ఈ సమస్యలను పరిష్కరించవచ్చని జర్మనీ-ఇండియా అంగీకరిస్తున్నాయి. జీ-20లో మేము దీనిపై దృష్టి పెడుతున్నాము. ఉక్రెయిన్ సంక్షోభం మొదలైనప్పటి నుంచి చర్చలు, దౌత్యం ఆవశ్యకత గురించి భారత్ మాట్లాడుతోంది. ఈ సంక్షోభాన్ని పరిష్కరించడానికి భారతదేశం ఎలాంటి శాంతి చర్చలలోనైనా చేరడానికి సిద్ధంగా ఉంది” అని ప్రపంచం ఎదుర్కొంటున్న అతిపెద్ద సమస్యలపై భారతదేశ దృక్పథాన్ని ప్రదర్శిస్తూ ప్రధాని మోదీ అన్నారు.

బహుపాక్షిక వేదికలలో సంస్కరణలు అవసరమని, “ప్రపంచ వాస్తవికతలను” ప్రతిబింబించేలా బహుపాక్షిక వేదికలు చేయాలని ప్రధాని  మోడీ కోరారు. “ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో సంస్కరణలు తీసుకురావడానికి జి-4 కింద మేము చేసిన ఉమ్మడి చొరవలో ఇది స్పష్టంగా కనిపిస్తుంది” అని అన్నారు. ఈ ఏడాది చివర్లో మన దేశంలో జరగనున్న జీ-20 శిఖరాగ్ర సమావేశానికి ఛాన్సలర్ స్కోల్జ్‌ను మోదీ ఆహ్వానించారు.

హాంబర్గ్ మేయర్‌గా ఉన్న సమయంలో తాను మొదటిసారి భారత్‌ను సందర్శించానని గుర్తు చేసుకున్న జర్మనీ ఛాన్సలర్ స్కోల్జ్  అతి తక్కువ సమయంలో అపారమైన పురోగతిని భారత్ సాధించిందని కొనియాడారు. జీ-20 ప్రెసిడెన్సీకి భారతదేశం ఉండడం గర్వంగా ఉందని ఆయన అన్నారు. “జీ-20కి మేము సహకరిస్తున్నాము. అందుకే ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవడం సాధ్యమైంది. జీ-20 ప్రెసిడెన్సీ భారతదేశానికి దక్కడం పట్ల నాకు చాలా సంతోషంగా ఉంది. చాలా క్లిష్ట సమయంలో చాలా బాధ్యతాయుతమైన స్థానాన్ని భారత్ తీసుకుంది. ప్రస్తుత సమయంలో ఏమి చేయాలనేదానికి భారత్ పూర్తిగా కట్టుబడి ఉంటుందని నేను విశ్వసిస్తున్నాను అని స్కోల్జ్ అన్నారు.

ఇది కూడా చదవండి :

Leave a Reply

Dimple Hayathi In Shankars Movie keerthi suresh