BJP: అమిత్‌షా తెలంగాణ పర్యటనకు డేట్ పిక్స్

BJP

అమిత్‌షా తెలంగాణ పర్యటనకు డేట్ పిక్స్

BJP: కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా తెలంగాణ పర్యటనకు షెడ్యూల్ పిక్స్ అయింది. అయితే ఉత్తరాదిలో బలపడాలని చూస్తున్న కర్ణాటక, తెలంగాణపై ప్రధానంగా ఫోకస్ పెట్టింది. ఈ రెండు రాష్ట్రాల్లో BJP బలమైన శక్తిగా ఎదుగుతోంది. కర్ణాటకలో ప్రస్తుతం అధికారంలో ఉండగా ఆ అధికారాన్ని నిలబెట్టుకోవడం ఇప్పుడు ఆ పార్టీకి అవసరం. కర్ణాటకలో తిరిగి అధికారంలోకి వస్తే తెలంగాణ బీజేపీ క్యాడర్‌లో కూడా అది కాస్త ఉత్సాహం నింపే అవకాశముంటుంది. అలాగే వచ్చే నెలలో కర్ణాటక ఎన్నికలు ముగియనున్న నేపథ్యంలో నెక్ట్స్ టార్గెట్ తెలంగాణపై బీజేపీ అధిష్టానం పెట్టింది. కర్ణాటక ఎన్నికల తర్వాత తెలంగాణకు అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. మరో 8 నెలల్లో తెలంగాణ ఎన్నికలు ఉండటంతో BJP మరింత దూకుడు పెంచుతోంది. అందులో భాగంగా ఈ నెల 23న తెలంగాణకు అమిత్ షా రానున్నారు. ఈ రాజకీయ పర్యటనలో భాగంగా చేవెళ్ల పార్లమెంట్ పరిధిలో భారీ బహిరంగ సభ నిర్వహించనున్నారు. అమిత్ షా పర్యటన సందర్భంగా కాషాయ పార్టీలోకి భారీగా చేరికలు ఉంటాయని తెలుస్తోంది.

చేవేళ్ల పార్లమెంట్‌ పరిధిలో జరిగే భారీ బహిరంగ సభలో కేంద్ర హోం శాఖ మంత్రి పాల్గొననున్నారు. కాగా అమిత్‌షా సభను భారీ సక్సెస్‌ చేయాలని బీజేపీ శ్రేణులు భావిస్తున్నాయి. బహిరంగ సభకోసం పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేసే యోచనలో ఉన్నారు. అలాగే రాబోయే ఎన్నికలకు సంబంధించి రాష్ట్ర BJP నేతలకు దిశానిర్దేశం చేసే అవకాశముందని చెబుతున్నారు. కర్ణాటకలో ఎన్నికల ప్రచారాన్ని ముగించుకుని అమిత్‌షా నేరుగా హైదరాబాద్ చేరుకుంటారు. అక్కడి నుంచి చేవెళ్లకు అమిత్ షా వెళతారని పార్టీ వర్గాలు చెప్పాయి. ఈ మేరకు అమిత్ షా పర్యటనను విజయవంతం చేసేందుకు పార్టీ నేతలు సన్నాహాలు చేస్తున్నారు.

అసలు ప్రతి నెలలో ఒకసారైనా తెలంగాణ టూర్‌కి వస్తానంటూ గతంలో రాష్ట్ర BJP నేతలకు అమిత్ షా హామీ ఇచ్చారు. కానీ దేశంలోని పలు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో బిజీ షెడ్యూల్ వల్ల అమిత్ షాకు కుదరలేదు. కానీ వచ్చే నెల 13తో కర్ణాటక ఎన్నికలు ముగినుండటంతో.. ఇక నుంచి తెలంగాణలో అమిత్ షా వరుస పర్యటనలు ఉంటాయని బీజేపీ శ్రేణులు చెబుతున్నాయి. అవసరమైతే హైదరాబాద్‌లోనే ఉండి వచ్చే ఎన్నికల్లో రాష్ట్రంలో BJP గెలుపు కోసం అమిత్ షా వ్యూహలు రచిస్తారని, క్యాడర్‌కు దిశానిర్దేశం చేస్తారనే ప్రచారం కూడా సాగుతోంది.

Leave a Reply

Dimple Hayathi In Shankars Movie keerthi suresh